Saturday, July 30, 2011

నేను రాసిన తొలి పాట

రచన:హలీమ
గానం:హలీమ
 
ఏ దేవుని వరమో నీవు  ఏ పూజల ఫలమో నీవు
ఏ జన్మల బంధం నీవు తెలుసునా
నా గుండెకు ఊపిరి నీవు నా ఆశల కిరణం నీవు
నా తారక మంత్రం నీవు తెలుసునా
ఎన్నెన్నో ఊహలు ఏవేవో ఊసులు ఎదురొచ్చి నిలిచెను తెలుసునా
ఎగసోచ్చేఅలలపై రాగాలై పలికెను నాలోని ఆశలూ తెలుసునా..(ఏ దేవుని)
 
ఏదో విధమైన అలజడి రేగెను మదిలోన ఏమో ఆ సందడి తెలుసునా
నీతో చెప్పాలని నా మనసే ఉరకలు వేస్తుంది  ఏమో ఆ సంగతీ తెలుసునా
మనసే కలవరమాయే మది ఆశల సాగరమాయే....౨
నీలి మేఘాల పల్లకిలో ఊహలుయ్యాలలూగాలిలే...(ఏ దేవుని)

 

Friday, July 29, 2011

మైకం మబ్బేసి

రచన:హలీమ
గానం:హలీమ

మైకం మబ్బేసి మోహం మాటేసి మనసును ముంచేసింది
చూపులు కట్టేసి ఊపిరి లాగేసి గుండెను పిండేసింది..
ఏమిటిదీ ఏమిటిదీ ఏదో తెలియని తహతహని
ఎందుకనీ ఎందుకనీ లోకం తెలియని తికమకనీ (మైకం)

తెలియక చేసిన నేరం చేసెను బ్రతుకును ఓ పెనుభారం
చేతులు కలిపిన స్నేహం చివరకు చేసిందేమో ద్రోహం
మచ్చలేని చంద్రుడంటూ ఎక్కడైన ఉంటాడా  ..
మమతలన్ని దూరమైతే మనిషి తేరుకుంటాడా  ..       
మనసులేని మనిషిగ మిగిలి మరణం కోరుకుంటాడా  ...(మైకం)


        

చిట్టీ పొట్టీ చిన్నారి పాప

రచన:హలీమ
గానం:హలీమ

చిట్టీ పొట్టీ చిన్నారి పాపకు చిరునవ్వే అందమూ
చిన్నారి చిట్టి తల్లి అలకలింక అందమూ..అలకలింక అందము   
చిట్టీ పొట్టీ చిన్నారి పాపకు చిరునవ్వే అందమూ

డూ డూ డూడూ బసవడు తువ్వాయి లేగలు
మా పాప గెంతులను చిన్నబోయి చూద్దురూ
చిన్నారి పొన్నారి చిలుకలు సింగారీ నెమలులు
మా పాపా పలుకులను మూగబోయి విందురూ..మూగబోయి విందురు     ''చిట్టీ"

పారాడుతుంటే పాపాయి యింటా పసిడి పంట పండును  
చిరునవ్వుల రత్నాలు వేనవేలు కురియును
జాబిల్లి పాడేసి జోలపాట తన నిద్దుర మరిచెను
ఏ కన్నూ సోకకుండా మబ్బు దిష్టి తీసెను..      ''చిట్టీ"






 

కాదన్నా కలలు రేపు

రచన:హలీమ
గానం:హలీమ

కాదన్నా కలలు రేపు  కాలాన్నే కదలనీకు
మనసంతా మాయ నింపు మౌనాన్నే రాసి పంపు
చిలుక చిలుకా చిగురాకు చాటు పలుకా
చినుక చినుకా మరుమల్లె మేలుకొలుపా......''కాదన్నా''

ఉషషుతో మనసంతా వుషారుగా మారేనంట.. 
వసంతమే నా వెంట వయారమై తరిమేనంట..
మాటలన్నీ పాటలంట ...మరపురాని రంగులంట..
నింగి నేల కలిపే ఊయల ఊగుతోంది మనసంతా......''కాదన్నా''

లోకాన్నే చుట్టోద్దాము ఆకాశం ఎక్కేద్దాము
అవతలేపు ఏముంటుందో ఒక్కసారి చూసోద్దాము
కొత్తలోకం ఎక్కడున్నా కొల్లగొట్టి వచ్చేద్దాము ..
మన భూమిని మించిన స్వర్గం వేరేలేదని చాటేద్దాము  ...''కాదన్నా''