Monday, September 29, 2014

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా -Annapoornaadevi archintunammaa

సాహిత్యం : బేతవోలు రామబ్రహ్మం
గానం : పి.సుశీల

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా 
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా 
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా 
విశ్వైకనాథుడే విచ్చేయునంటా 
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా 
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా 
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా 
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా 

నా తనువునో తల్లి నీ సేవ కొరకు 
నా తనువునో తల్లి నీ సేవ కొరకు 
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి 
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి 
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి 
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి 
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
 నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా 

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి 
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి 
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి 
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి 
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి 
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి 
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
 నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా 

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి 
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి 
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి 
నా తనువు గగనాంశ నీ మనికి జేరి 
నీ నామ గానాలు మోయాలి తల్లి 
నీ నామ గానాలు మోయాలి తల్లి 
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

Saturday, June 21, 2014

For my little darling Jaish-చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ ...Chitti potti chinnari babuku chirunavve andamu..

చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ

చిన్నారి చిట్టి తండ్రి అలకలింక అందమూ..అలకలింక అందము
చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ

డూ డూ డూడూ బసవడు తువ్వాయి లేగలు
మా బాబు గెంతులను చిన్నబోయి చూద్దురూ
చిన్నారి పొన్నారి చిలుకలు సింగారీ నెమలులు
మా బాబు పలుకులను మూగబోయి విందురూ..


చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ
చిన్నారి చిట్టి తండ్రి అలకలింక అందమూ..అలకలింక అందము
చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ

పారాడుతుంటే మాబాబు యింటా పసిడి పంట పండును
చిరునవ్వుల రత్నాలు వేనవేలు కురియును
జాబిల్లి పాడేసి జోలపాట తన నిద్దుర మరిచెను
ఏ కన్నూ సోకకుండా మబ్బు దిష్టి తీసెను..

చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ
చిన్నారి చిట్టి తండ్రి అలకలింక అందమూ..అలకలింక అందము
చిట్టీ పొట్టీ చిన్నారి బాబుకు చిరునవ్వే అందమూ