చిత్రం : ఉయ్యాల జంపాల
రచన : ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
గానం : ఘంటసాల,సుశీల
కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది
గోదవరి వరదలాగ కోరిక చెలరేగింది (కొండ)
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవసించి పాడింది (కొండ)
మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది (కొండ)
(Kondagaali tirigindi)
*******************************************
అందాల రాముడు, ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ? 2
ఎందువలన దేముడు ? .
తండ్రిమాటకై పదవులు త్యాగామునే చేసేనూ
తండ్రిమాటకై పదవులు త్యాగామునే చేసేనూ
తన తమ్ముని బాగుకై తానూ బాధ పొందేనూ
అందాల రాముడు అందువలన దేముడు.. !
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ?
అనుభవంచదగిన వయసు అడవపాలు జేసెను....
అనుభవంచదగిన వయసు అడవపాలు జేసెను,
అడుగుపెట్టినంతమేర ఆరభూమి జేసెను... అందాల రాముడు అందువలన దేముడు..!
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ?
ధర్మపత్ని చేరబాపగా దనుజుని దనుమాడెను
ధర్మపత్ని చేరబాపగా దనుజుని దనుమాడెను
ధర్మము కాపాడుటకై ఆ సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేముడు.. !
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఇలలోమన దేముడు
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఇలలోమన దేముడు
(andaalaa raamudu indeevarashyamudu)
*************************************
సినిమా:భక్త కన్నప్ప
రచన:ఆరుద్ర
సంగీతం:సత్యం
గానం:రామకృష్ణ,సుశీల
(Aakasam Dinchaala )చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు
ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు సిగలో నువ్వురా... ఆ...
అంతేనా అంతేనా.అవును.అంతేరా...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా..ఆ...
సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే..చేస్తానే
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే..దిద్దేనే..
ఆ..నీ వొంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
అంతేనా అంతేనా.అవును.అంతేరా...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా..ఆ...
ఆ..ఆహా...ఆ
*********************************
సినిమా:తూర్పు వెళ్ళే రైలు
రచన:ఆరుద్ర
సంగీతం:బాలు
గానం:బాలు
(Chuttoo Chengaavi Cheera Kattale Chilakamma)
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..
బొట్టూ కాటుక పెట్టి, నే కట్టే పాటను చుట్టి ..
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ...
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..
తెల్లచీరకందం నువ్వే తెవాలీ చిట్టెమ్మా ...
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా..
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మ..
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..
నేరేడు పళ్ళ రంగు,జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన..పొంగుదాగి సొగసుళ్ళు
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..
బొట్టూ కాటుక పెట్టి, నే కట్టే పాటను చుట్టి ..
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ...
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..
*************************************
సినిమా:అభిమానం
రచన:ఆరుద్ర
సంగీతం:ఘంటసాల
గానం:జిక్కి,ఘంటసాల
(oho bastee dorasaani)
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది
హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది
హాయ్...
ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని
కొత్తపెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గువేసింది,మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది...
హాయ్
కొత్తపెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గువేసింది,మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసిందీ..
హాయ్
ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకోచ్చిందీ అందచందాల వన్నెలాడి కోపం పోయింది
ఓహో బస్తీ దొరసాని
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది ,పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది ...
హాయ్ పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది ,పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది ...
హాయ్ చివరకు చిలిపిగా నవ్విందీ చేయి చేయి కలిపిందీ అందచందాల వన్నెలాడి ఆడి పాడిందీ
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని ....ఓహో బస్తీ దొరసాని .....ఓహో బస్తీ దొరసాని ....
******************************************
సినిమా:లేతమనసులు
రచన:ఆరుద్ర
సంగీతం:ఎం ఎస్ విశ్వనాథన్
గానం:సుశీల
(Pillalu Devudu Challani Vaare)
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
తప్పులు మన్నిన్చుటే దేవుని సుగుణం ..ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం..౨
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
పుట్టినపుడు మనిషి మనసు తెరచి ఉండును..౨
ఆ పురిటి కందు మనసులో దైవము ఉండును..౨
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే..౨
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే..౨
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
వెలుగుతున్న సూర్యున్ని మబ్బు మూయును..౨
మనిషి తెలివి అనే సూర్యున్ని కోపం మూయును..౨
గాలి వీచి మబ్బు తెరలు కదలిపోవులే..౨
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే...౨
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు..౨
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు..౨
మాయమర్మమేమి లేని బాలలందరూ..౨
ఈ భూమి పైన వెలసినా పుణ్యమూర్తులే..౨
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
తప్పులు మన్నిన్చుటే దేవుని సుగుణం ..ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం..౨
పిల్లలు దేవుడు చల్లనివారే...కల్లకపటం ఎరుగని కరుణా మయులే
********************************************
సినిమా:తూర్పు వెళ్ళే రైలు
రచన:ఆరుద్ర
సంగీతం:బాలు
గానం:సుశీల
(Emitidi Emitidi Edo Teliyanidi)
ఏమిటిది ఏమిటిది ? ఏదో తెలియనిది... ఎప్పుడూ కలగనిది ఏమిటిది ? ఏమిటిది.. ? ఏమిటిది ఏమిటిది ? ఏదో తెలియనిది... ఎప్పుడూ కలగనిది ఏమిటిది ? ఏమిటిది.. ?
హత్తుకున్న మెత్తదనం...కొత్త కొత్తగా ఉంది . ..
మనసంతా మత్తుకమ్మి మంతరించినట్లుంది...
నరనరాన మెరుపుతీగ నాట్యం చేసేస్తుంది..
నాలో ఒక పూల తేనే నదిలా పొంగుతుంది..పొంగుతుంది
ఏమిటిది ? ఏమిటిది ఏమిటిది.. ?
ఈడు జోడు కుదిరింది...తోడునీడ దొరికింది..
అందానికి ఈనాడే అర్థం తెలిసొచ్చింది..
పెదవి వేనుఅక చిరునవ్వు దోబూచులాడింది..
చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తుంది..
ఏమిటిది ఏమిటిది ? ఏదో తెలియనిది... ఎప్పుడూ కలగనిది ఏమిటిది ? ఏమిటిది.. ? ఏమిటిది ఏమిటిది ?
***************************************************
సినిమా:తూరుపు వెళ్ళే రైలు
రచన:ఆరుద్ర
సంగీతం:బాలు
గానం:బాలు
(Ko Ante Koilamma Koko)
కొండమీద కో అంటె చుక్కలన్ని కోసుకో.. నేలమీద కో అంటె పండింది కోసుకో... కోసుకో...
కో... కాసుకో...
కో అంటె కోయిలమ్మ కోకో... కో అంటె కోడిపుంజు కోకోరుకో....
కోటేరు పట్టినోడుకో ..పూటకూడు దక్కదెందుకో..నారు నీరు పోసినోడుకో..సేరుగింజలుండవెందుకో
అన్నముండదొకడికి..తిన్నదరగదొకడికి..ఆశ సావదొకడికి . ఆకలారదొకడికి ..
కో... కాసుకో...
కో అంటె కోయిలమ్మ కోకో... కో అంటె కోడిపుంజు కోకోరుకో
మేడిపండు మేలిమెందుకో...పొట్టవిప్పి గుట్టు తెలుసుకో..
చీమలల్లే కూడబెట్టుకో..పాములోస్తే కర్రపట్టుకో..ఓ ఓ పాములోస్తే కర్రపట్టుకో
కో అంటె మేలుకో... / కో అంటె మేలుకో...లోకాన్ని తెలుసుకో..ఏమైనా ఏదాలు చెబుతాను రాసుకో...
రాసుకో..కో... కాసుకో...
కో అంటె కోయిలమ్మ కోకో... కో అంటె కోడిపుంజు కోకోరుకో....
తూర్పింటి అంకాలమ్మ కో కో..పడమటింటి పోలేరమ్మ కో కో కో..
దక్షిణాన గంగాలమ్మ కో కో ..ఉత్తరాన నూకాలమ్మ కో కో కో..
కో అంటే కోటిమంది అమ్మతల్లులున్నా..పంటచేను కాపలాకు నేను ఎందుకో..
కో అంటె కోయిలమ్మ కోకో... కో అంటె కోడిపుంజు కోకోరుకో....
కొండమీద కో అంటె చుక్కలన్ని కోసుకో.. నేలమీద కో అంటె పండింది కోసుకో... కోసుకో...
కో... కాసుకో...
No comments:
Post a Comment