Thursday, March 8, 2012

వేటూరి పాటలు. .

మేఘసందేశం (Megha Sandesham)
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి మేఘమా మెరిసేటి  మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం  మేఘసందేశం 

వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి మేఘమా మెరిసేటి  మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో 
***************************************          
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
*************************************************       
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వంపు నటనాల మాతంగిని
కైలశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు 
చెంత వెలిగేవేళ చింత నీకేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతూ ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
**************************************************          
........
గమదని సని పమ నిరిగమ రిగ నిరిస
మమగ గదప దపమ గనిద నిదప మదని
సని గరి సనిద పసని దపమ
నిసని దపమ నిసని గమదని సని పర్మరిగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా....
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

తనువణువణువున్ను తంబుర నాదము నవనాడుల శృతి చేయగా....
గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ
ఎద మృదంగమై తాళ లయగతులు ఘమకములకు జతకూడగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగా
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా
లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించిగా

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా....
*******************************************************     
నవరస  సుమ మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమ మాలికా
సని సరి గరి సరి మపని పనిస గరి
గరి సనిద దని తపమ గరి నిసగ
నవరస  సుమ మాలికా
సగమ గమప గమ గప మగసగ సని
పనిసగ సగమ గమప నిని పమప
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య
తెలుగింటిలోన వెలిగించిన..
తెలుగింటిలోన వెలిగించినా నాద సుధామయ రసదీపిక
నవరస సుమ మలికా

అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని
ఆమె చరణాలు అరుణ కిరణాలు
ఆమె నయనాలు నీల గగనాలు
జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
చిరునవ్వు లేత నెలవంక
చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా

శృంగార రసరాజ కల్లోలిని
కార్తీక పూర్ణేందు కలహారిని
ఆమె అధరాలు ప్రణయ మధురాలు
ఆమె చలనాలు శిల్ప గమనాలు
దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు
కనుచూపు నాకు కడదాక
కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా

******************************************    
నాలుగుస్తంబాలాట
చినుకులా రాలి..నదులుగా పొంగీ..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
చినుకులా రాలి..నదులుగా పొంగీ..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే..వెల్లువౌతానులే
హిమములా రాలి..సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగి
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా..శిథిలమైనా..విడిచి పోబోకుమా.. విరహమై పోకుమా..
తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై ముద్దు తీరాలిలే.. తీరాలు చేరాలిలే
మౌనమై వెలసి..గానమై పిలిచి
కలలతో అలిసి..గగనమై ఎగసి
ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..ప్రేమ మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
చినుకులా రాలి..నదులుగా పొంగీ..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..

***************************************************   
మరణమృదంగం
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసి పోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది సందె వెన్నెలా
కలిసిపోయాక రెండు కన్నులా

మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా
ఆశలో ఒకే ధ్యాసగా ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది సందె వెన్నెలా

అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా ఏమైనా సరి గసిగా
కోరికో శృతే మించగా ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది సందె వెన్నెలా
కలిసి పోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది సందె వెన్నెలా
కలిసిపోయాక రెండు కన్నులా

1 comment: