Thursday, September 6, 2012

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ (Sreesurya naaraayana meluko hari suryanaaraayana)



శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ


No comments:

Post a Comment