Tuesday, March 6, 2012

దేవుళ్ళు

సినిమా:దేవుళ్ళు  
రచన:జొన్నవిత్తుల 
సంగీతం:వందేమాతరం  శ్రీనివాస్
గానం:బాల సుబ్రహ్మణ్యం,రాకేశ్,చిత్ర,జానకి,స్వర్ణలత



సాగర ఘోషల శృతిలో 
హిమ జలపాతాల లయలో 
సంగీతం భారత సంగీతం
సునోరే భాయి సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ....సత్యాహింసలు శృతిలయిలైన
మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం
ప్రపంచ శాంతి సంకేతం...
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి
కర్ణాటక భావాలు కమ్మనైనవి
సగమ గమగ మగని సానిద సానిదనిసా
ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన
ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్

సరిగరి సరిగరి సనిదని
పదనిస పదనిస పమగమ
నిస నిదప మపదప
గరి మగ పమ దప మగ పమ దప నిద
నిసాస దనీని పమగప పమగప పమగప
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది

దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరూ బందువులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట
నయాగరా హోరులో ఆలపించగా
సగమ గమగ మదని సానిస 
నిదమ గమగ మగస నిసగ మదనిస
గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ
మపదప పదనిద దనిసని నిసరిస 
సనిదప మగరి నిదప మగరిస సని
దనిస నిసని సరిగ రిగమ
రిగమ గమప మపద పదనిసా..ఆ..ఆ

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
*****************************
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ

షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో 
వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు 
సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి 
అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి
బాబా భోదల నిలయమదోయి 

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ

ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే 
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె
నీటి దీపములను వెలిగించె
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె
ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికె
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం 

నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై గురుపౌర్ణమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్


**************************
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా....

జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం


జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక 
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ
***********************
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
గోరుముద్దలెరుగని బాలకృష్ణులం
భాద పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం

కమ్మగా మా అమ్మచేతితో
ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా
సరదాగా తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెళతారు
రాతిరికి ఎపుడో వస్తారు
మరి మరి అడిగినా కథలు చెప్పరు
మేమేం చెప్పినా మనసుపెట్టరు
అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు
ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు

ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం

పిల్లలం మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు
కనిపించే శివుడు పార్వతులు
లోకం బూచికి మా గుండె వణికితే
మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి
అనాధలను చేయకండి పసిపిల్లలని

ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
**************************
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి
జనకృందముల చేరే జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ము కాగా
ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు విని రోజు శబరిషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీరా ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాధినేత

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం...

పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః



******************************
రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ ఆ..
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా


అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


***********************************
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా  నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

శ్రీ రామరాజ్యం

సినిమా: శ్రీ రామరాజ్యం
రచన:జొన్నవిత్తుల 
సంగీతం:ఇళయరాజా
గానం:బాల సుబ్రహ్మణ్యం,శ్రేయ ఘోసాల్,రాము,అనిత,కీర్తన,చిత్ర,శ్వేత,శ్రావణి,టిప్పు



  సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితం
కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో
నిండుగా అండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ

సుందర రాముని మోహించె రావణ సోదరి సూర్పనఖ
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగ
తప్పనిసరియై లక్ష్మనుడే ముక్కు చెవులను కోసి
అన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను రక్కసి

దారునముగ మాయ చేసె రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడు అదను చూసి
సీతని అపహరించె రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి
కరకు గుండెలొపాసుల కాపలాగ వుంచి

శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగె దాశరధి
సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రొదసి కంపించేలా
రోధించె సీతపతి

రాముని మోమున దీనత చూసి వెక్కి ఎడ్చినవి వేదములే
సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం
కమలనయనములు మునిగె పొంగె కన్నీటిలో చూడలేక
సూర్యుడే దూకెను మున్నీటిలో సూర్యుడే దూకెను మున్నీటిలో

వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి
సీత సిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చి

వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
వానరవేగముగ రామభద్రుడె రావణ తలపడికొట్టెర
భుజమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెగా
అంత బాధ పడి సీతకోసమని ఇంత చేసె శ్రీరాముడు
చెంతచేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష వయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీపరిక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ

అగ్గిలోకి దూకె అవమానముతొ సతి అగ్గిలోకి దూకె అవమానముతొ సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహొత్రుడె పలికె దిక్కులు మార్మొగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె నేటి శ్రీరాముడు
ఆ జానకితో అరణ్యమేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు


*********************************************
ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను  

ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు  
ఎవడున్నాడు ఈ కాలంలో సరియగు నడబడివాడు 
నిత్యము సత్యం పలికే వాడు 
నిరతము ధర్మము నిలిపే వాడు 
చేసిన మేలు మరువని వాడు 
సుర్యునివలనే వెలిగెడివాడు
ఎల్లరికి చలచల్లని వాడు
ఎదనిండా దయ గల వాడు
ఎవడు .ఎవడు ఎవడు …

అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు

ఒకడున్నాడు ఈ లోకంలో ఓం కారానికి సరి జోడు
ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు
పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవుల నెలరేడు
మాటకు నిలబడు యిలరేడు
దసరధ తనయుడు దానవ ధమనుడు జానకిరాముడు
అతడే శ్రీరాముడు ..... శ్రీ ..రాముడు …

********************************
 ఆ..ఆ
జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేధిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక

నీ పాలన శ్రీకారమౌగాకా
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

సార్వభౌమునిగా పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే

నాలుగు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
న్యాయ దేవతై శంఖమూదగా పూల వాన కురిసే

రాజమకుటమే వొసగేలా నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించ చేసే అభివందనం

సామ్రాజ్య లక్ష్మి ఈ పాద స్పర్శ ఇ పరవసించి పోయే

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామా శాసనము తిరుగులేనిదని జలధి భోద చేసే

రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే
రామ రాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే

రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సముదాయకం
రామా నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామ చంద్రుడే ల్క రక్షయని అంతరాత్మ పలికే

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 
మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేధిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ పాలన శ్రీకారమౌగాకా
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక
జగదానంద కారకా
జయ జానకి ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా


*************************


గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ
నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ

రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా?
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా?

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ

ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార?
అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద?
విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ

అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధి కి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా?
సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలిసిందా? ఈ జగమే చీకటి అయ్యిందా?
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా?ఎవరైనా కానీ
నీ మాట నీదా వేరే దారేదీ లేదా

నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ

రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా?
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా?

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ 


**************************
  శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా
సీతారామచూపే నీ మహిమ
మదిలో అసురాలిని మాపగ రా
మదమత్రామ క్రోదములే మా నుంచి తొలగించి
సుగుణాలను కదిలించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా..రా..

శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా రా

ఆఆ..దరిసనమును కోర దరికి చేరే
దయగల మా రాజు దాశరధి
తొలుతనే ఎదురేగి కుశలములడిగే
హితమును గావించే ప్రియ వాడి
ధీరమతియై న్యాపతి అయి ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వొసగునులే
అందరు ఒక్కటేలే రామునికి ఆధారమొక్కటేలే
సకల గుణ ధామును రీతిని
రాముని నీతిని ఏమని పొగడుదులే
మా శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా

తాంబుల రాగల ప్రేమాంమృతం 
తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామా చంద్రోదయం
ప్రతీరేయి వైధేహి హృదయం
మౌనం కూడా మధురం..
సమయం అంతా సఫలం..
ఇది రామ ప్రేమలోకం ... ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోని మోక్షం రవి చంద్రులింక సాక్షం
ఏనాడు విడిపోని బంధం ..ఆఅ
శ్రీ రామ రామ రఘురామా 
పిలిచే సమ్మోహన సుస్వరామా
సీతాభామా ప్రేమారాధానామా
హరికే హరి చందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం 
ఏనాడు వీడిపోని బంధము...

లవకుశ

సినిమా: లవకుశ
రచన:సీనియర్ సముద్రాల,వెంపటి సదాశివ,కొసరాజు
సంగీతం:ఘంటసాల
గానం:సుశీల,లీల,ఘంటసాల,జే వి రాఘవులు,సరోజినీ



లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
తల్లి దీవెన తాతయ్య కరుణ
వెన్ను కాయగా వెరువగనేలా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తల్లి దీవెన తాతయ్య కరుణ
వెన్ను కాయగా వెరువగనేలా
భయమును విడవమురా..
లేరు కుశలవుల సాటి


బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి


పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేమి
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
యశమిక మాదేగా..ఆ..ఆ..ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి


*****************
సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా 


ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా..ఆ..ఆ..ఆ
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా


సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా 


రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మో వృధయగునమ్మా
నాదు జపము తపము నా కావ్యమ్మో వృధయగునమ్మా


సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ


****************************
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


రాముగని ప్రేమగొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ 
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


ఆ.. నాథా..రఘునాధా..పాహి పాహి
పాహి అని అశోకవననిని శోకించే సీత
పాహి అని అశోకవననిని శోకించే సీత
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొని పావని
ఆ జనని శిరోమణి అందుకొని పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివ్వు రివ్వు మని
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా


దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి 
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి 
అతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికె
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజపైనే అనుమానమా
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత


శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా వినుడోయమ్మా


శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి


రామ సుగుణధామా రఘువంశజలధిసోమా..
శ్రీరామా సుగుణధామా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
శ్రీరామా సుగుణధామా


మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా
మందార మరందోపమ మధురమధురనామా


రామ సుగుణధామా రఘువంశజలధిసోమా..
శ్రీరామా సుగుణధామా


అవతారపురుష రావణాధి దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మ నిరతరాజలరామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా..
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
సీతామనోభిరామా
*****************************
 ఓ..ఓ..ఓ
వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా
వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ
వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా


శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ..ఆ..ఆ
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని 
కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని
మంథర మాట విని
వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా


అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని
కూలే భువి పైని...
వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా


కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి


ఆ..ఆ..ఆ..ఆ
వెడలినాడు రాఘవుడు అడవికేగగా
పడతి సీత సౌమిత్రి తోడు నీడగా
వెడలినాడు రాఘవుడు అడవికేగగా
పడతి సీత సౌమిత్రి తోడు నీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ...
వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ..
అడుగుల బడి రాఘవా
అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది
అడలి అడలి కన్నీరై అరయుచున్నది
**************************
రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా


అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజులు రాణులు మువ్వురు
కౌసల్య సుమిత్ర కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ


రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా


ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని
రామకథను వినరయ్యా


తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిథిలకు దాశరథి
రామకథను వినరయ్యా


మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నుల వెన్నెల వీచినది
రామకథను వినరయ్యా


హరుని విల్లు రఘునాథుడు చేగొని
ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కళకళలాడే సీతారాముల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవి
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా


**********************
 జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 


జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే


జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితామణితో
వనములకేగిన ధర్మవతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే


కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు ఆ..ఆ..
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభిరాముడు శ్రీరాముడే


అలుమగల అనురాగాలకు
అలుమగల అనురాగాలకు
పోలిక సీతారాములే యనగ
పోలిక సీతారాములే యనగ
వెలసిన ఆదర్శ ప్రేమవతారుడు
జగదభిరాముడు శ్రీరాముడే
ఆ..ఆ..ఆ


నిరతము ధర్మము నెరపి నిలిపి
ఆ..ఆ..ఆ   ఆ..ఆ..ఆ
నిరతము ధర్మము నెరపి నిలిపి
నరులకు సురలకు తరతరాలకు
వరవడియైన వరయగ పురుషుడు
జగదభిరాముడు శ్రీరాముడే


ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయూ ప్రభువు లేనేలేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయూ ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే


జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 
జయజయరాం జయరఘురాం 


***********************
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా


నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
కష్టజీవుల వెతలు తీరేనురా
బీదా సాదా బ్రతుకు మారేనురా


రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా


రామయ్య వంటి కొడుకు రావాలనే
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే
రామయ్య వంటి కొడుకు రావాలనే
సీతమ్మ వంటి బిడ్డ కావాలనే
ఇల్లు వాకిలి పరువు నిలపాలనే
చల్లంగ నూరేళ్ళు వెలగాలనే


రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా


పేదతనము భూమి మీద ఉండబోదురా
భేదాలకికమీద తావులేదురా
పేదతనము భూమి మీద ఉండబోదురా
భేదాలకికమీద తావులేదురా
దొంగ తోడుబోతు బాధ తొలగిపోవురా
రామరాజ్యమాయే మనకు లోటులేదురా


రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా




న్యాయమ్ము పాలించి నడుపువాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
న్యాయమ్ము పాలించి నడుపువాడురా
ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
మునులందరినీ గాచు మొనగాడురా
ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా


రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
హోయ్
**********************
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


కంచెయె నిజముగ చేను మేసిన కాదనువారెవరు
రాజే ఇది నాశనమని పల్కిన ప్రతిఘటించువారెవరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాద్వులకేపుడు వెతలేనా తీరని దుఃఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
విను వీధిని శ్రేణులుగా నిలచి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


ఎండకన్ను ఎరగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా భోదపడవులే దైవ చిద్విలాశాలు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ


అగ్ని పరీక్షకే నిలిచిన సాద్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే   జనవాక్యమ్మని 
అనుసరించుటయే ధర్మమా


ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
ఎవరూహించెదరూ

కోకిలమ్మ

సినిమా:కోకిలమ్మ
రచన:ఆచార్య ఆత్రేయ
సంగీతం:ఎం ఎస్ విశ్వనాథన్
గానం:బాల సుబ్రహ్మణ్యం


ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగింటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం 

వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం 

ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగమాలికలర్పిస్తున్నా
మీ అందరి కరతాళహరతులర్ధిస్తున్నా
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై

వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతు నమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా  ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం 
నేడే ఆ శుభలగ్నం
చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం

ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగింటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం
***********************
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా
నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
జతులుగా..గతులుగా..లయలుగా..హొయలుగా

కనులకు వెలుగైనా కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ..
కనులకు వెలుగైనా కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ..
తలపులలైనా మరపులలైనా
నీవే నా రూపుగా..
తలపులలైనా మరపులలైనా
నీవే నా రూపుగా..
వయసుకే మనసుగా మనసుకే సొగసుగా
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా

మల్లెల జల్లేల వెన్నెల జల్లేల
మదిలో నీవుండగా..ఆ
మల్లెల జల్లేల వెన్నెల జల్లేల
మదిలో నీవుండగా..ఆ
కోవెల ఏల దైవము ఏల ఎదటే నీవుండగా...
కోవెల ఏల దైవము ఏల ఎదటే నీవుండగా...
నీవుగా.. నేనుగా..వేరుగా..లేముగా...

నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
జతులుగా..గతులుగా..లయలుగా..హొయలుగా
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా


************************
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ

ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ

ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ
అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ


***************************
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

ప్రణయ సుధా రాధా..
నా బ్రతుకు నీది కాదా..

నేనున్నది నీలోనే..ఆ నేను నీవేలే..
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే..ఆ నేను నీవేలే..
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడో మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమని..ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమని..ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది..గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని
నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది నా..వేదన


నీ ప్రేమకు కలశాన్ని
నీ పూజకి నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధనా
నీకు ఈనాడు తెలిపేది నా..వేదన

ఇదే నిన్ను వినమని..ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని..ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది..గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

ప్రణయ సుధా రాధా..
నా బ్రతుకు నీది కాదా..

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

Friday, March 2, 2012

బాణం

సినిమా:బాణం
రచన:రామజోగయ్య శాస్త్రి
సంగీతం:మణిశర్మ
గానం:హేమచంద్ర,సైంధవి
 
నాలో నేనేనా,ఏదో అన్నానా,
నాతో నే లేని మైమరపునా..
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా   :నాలో నేనేనా:
 
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటి ఇలా కొత్త ఆలోచనా
మనసే నాది మాటే నీది ఏది ఏమి మాయో..
 
నాలో నేనేనా,ఏదో అన్నానా,
నాతో నే లేని మైమరపునా..
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా   :నాలో నేనేనా:
 

అవును కాదు తడబాటుని,అంతో ఇంతో గది దాటని
విడి విడిపోని పరదాని,పలుకై రానీ ప్రాణాన్ని
యెద అంత పదాల్లోన పలికేనా
నా మౌనమే ప్రేమ ఆలాపనా..
మనసే నాది మాటే నీది ఇది మాయో..
 
నాలో నేనేనా,ఏదో అన్నానా,
నాతో నే లేని మైమరపునా..
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా   :నాలో నేనేనా:

దైవం వరమై దొరికిందనీ  నాలో సగమై కలిసిందనీ
మెలకువ కాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగి పోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం

నాలో నేనేనా,ఏదో అన్నానా,
నాతో నే లేని మైమరపునా..
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో
చిన్న మాటేదో నిన్నడగనా   :నాలో నేనేనా:

 

మా తమ్ముడు రాజా ఫేవరేట్ సాంగ్

సినిమా కరెంటు
రచన రామజోగయ్య శాస్త్రి
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
గానం నేహ భాసిన్


అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసెటు చుస్తే అటు నువ్వే  ....
ఎటు వెళ్తున్న ఏం చేస్తున్న ప్రతిచోటా నువ్వే ..
అటు నువ్వే ఇటు నువ్వే ,
అలికిడి వింటే అది నువ్వే ....
అదమరపైన పెదవుల పైనా ప్రతి మాట నువ్వే ...
అపుడు ఇపుడు ఎపుడైనా ,
నా చిరునవ్వే నీవలనా  ..
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే ...
పరిచయమంత గతమేనా ,
గురుతుకు రానా క్షణమైనా ...
ఎదురుగ వున్నా నిజమేకాని కలవైనావులే..


==అటు నువ్వే ఇటు నువ్వే ==

రంగు..రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా ..
చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ వుంది ...
దూరం ...దగ్గరంటూ తేడా చూడదీప్రేమ.. ..
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుంది.....
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా    ...
ఒక రెప్పపాటు కాలమైన మరపే రావుగా ..
యద మారు మూలలో ఒదిగున్నప్రాణమై ...
నువు లేని నేను లేనే లేను అనిపించావుగా ....


అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసెటు చుస్తే అటు నువ్వే  ....
ఎటు వెళ్తున్న ఏం చేస్తున్న ప్రతిచోటా నువ్వే ..
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే ....
అదమరపైన పెదవుల పైనా ప్రతి మాట నువ్వే ...


నాకే .. తెలియకుండా నాలో నిన్ను వొదిలావే...
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే ...
మాటే ... చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ....
ఇటుగా చూడనంటు నన్ను ఒంటరి చేసావే ....
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడ జాలి లేని పంతాలేన్టిలా..
నీతోడు లేనిదే .మనసుండలేదుర .
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదేలా ....


అటు నువ్వే ఇటు నువ్వే ,
మనసెటు చుస్తే అటు నువ్వే  ....
ఎటు వెళ్తున్న ఏం చేస్తున్న ప్రతిచోటా నువ్వే ..
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే ....
అదమరపైన పెదవుల పైనా ప్రతి మాట నువ్వే ...