Saturday, August 11, 2012

కలకాలం ఇదే పాడనీ నీలో నన్నే చూడనీ (kalakaalam ide paadanee)

కలకాలం ఇదే పాడనీ నీలో నన్నే చూడనీ
కలకాలం ఇదే పాడనీ నీలో నన్నే చూడనీ

నీ వలపుల లోగిలో విహరించనీ
నీ వెచ్చని కౌగిలిలో నిదురించనీ
నీ నయనాలలో నను నివసించనీ
నీ నయనాలలో నను నివసించనీ

మన ప్రేమ నౌక ఇలా సాగనీ (కలకాలం)

జన్మజన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ
జన్మజన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ
ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా
నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ
నీడల్లే నీవెంట నేనుండగా బ్రతుకంత నీతోనే పయనించగా (కలకాలం)

ఈ జంటకు తొలిపంట నీ రూపము
నాకంటికి వెలుగైన చిరు దీపము--ఈ జంటకు
ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై
ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై

వెలగాలి కోటి చందమామలై (కలకాలం)



No comments:

Post a Comment