Monday, September 9, 2013

మహామృత్యుంజయస్తోత్రం(Mahaa mrityunjaya stotram)

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్

శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్
శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్
జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః

తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోzహం సదా మృడ
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్

నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః



దారిద్ర్యదుఃఖదహన శివస్తోత్రం (Daaridryaduhkha Dahana Siva stotram)

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

చర్మంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోహరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

భానుప్రియాయ దురితార్ణవతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ




తోటకాష్టకం (Totakashtakam)

విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం

సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్



Friday, January 25, 2013

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు (Itti muddulaadi baalu )


అన్నమాచార్య కీర్తన
రాగం: దేవగాంధారి


ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే

Saturday, January 19, 2013

పచ్చని తోట పసరుల తావి (pachchani tota pasarula taavi)

సినిమా:కడలి
రచన:వనమాలి
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
గానం:అభయ్ జోద్పుర్కర్,హరిణి

పచ్చని తోట పసరుల తావి
నిశీధి మౌనం నీ ప్రేమ గానం...
పౌర్ణమి రేయి పొగమంచు అడవి
ఒంటరిగ వెళ్ళే నీతోటి పయనం..
ఇవి మాత్రం చాలు..ఇవి మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే..
ఇవి మాత్రం చాలు..ఇవి మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే..
పచ్చని తోట పసరుల తావి
నిశీధి మౌనం నీ ప్రేమ గానం...

కొలనుల నీటిలో తడిసే కొంగలు
విదిలించు రెక్కలా జల్లే అందమే
ముక్కోపమిడిచి ..నీ కొంగు తీసి..
నా మేను తుడిచే ..నిన్నల్లుకోనా
ఇది మాత్రం చాలు..ఇది మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే...
ఇది మాత్రం చాలు..ఇది మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే...

మానులు వొణికే మంచుకు తడిసీ
నెత్తురు నిలిచే చలికే జడిసీ
ఉష్ణం కోరెలే..వయసీ చోటే..
ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటే..
ఇది మాత్రం చాలు..ఇది మాత్రమే..
నాకింక చాలు ..నువు మాత్రమే...
ఇది మాత్రం చాలు..ఇది మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే...

పచ్చని తోట పసరుల తావి
నిశీధి మౌనం నీ ప్రేమ గానం...
పౌర్ణమి రేయి పొగమంచు అడవి
ఒంటరిగ వెళ్ళే నీతోటి పయనం..
ఇవి మాత్రం చాలు..ఇవి మాత్రమే..
నాకింక చాలు.. నువు మాత్రమే..

















Friday, November 9, 2012

మధురానుభవమా ప్రేమ (Madhuraanubhavamaa prema )

మధురానుభవమా ప్రేమ
మతిలేని తనమా ప్రేమ
నువు తేల్చ గలవా
కాలమా కాలమా కాలమా
మృదువైన స్వరమా ప్రేమ
పదునైన శరమా ప్రేమ
బదులీయగలవా
దైవమా దైవమా దైవమా

కోనేటి కలువా ప్రేమ
కన్నీటి కొలువా ప్రేమ
బతికించు చలువా ప్రేమ
చితి పేర్చు సిలువా ప్రేమ
ఎడబాటు పేరే ప్రేమ
పొరబాటు దారే ప్రేమ
బదులీయమంటే మౌనమా

మధురానుభవమా ప్రేమ
మతిలేని తనమా ప్రేమ
నువు తేల్చ గలవా
కాలమా కాలమా కాలమా
మృదువైన స్వరమా ప్రేమ
పదునైన శరమా ప్రేమ
బదులీయగలవా
దైవమా దైవమా దైవమా

అరణ్యాల మార్గం నువ్వు
అసత్యాల గమ్యం నువ్వు
పడదోసి మురిసే ప్రణయమా
విషాదాల రాగం నువ్వు
వివాదాల వేదిక నువ్వు
కన్నీరు కురిసే మేఘమా
ఎదురీత కోరే ప్రేమ
ఎదకోత లేని సీమ
నిను చేరుకుంటే నేరమా

మధురానుభవమా ప్రేమ
మతిలేని తనమా ప్రేమ
నువు తేల్చ గలవా
కాలమా కాలమా కాలమా
మృదువైన స్వరమా ప్రేమ
పదునైన శరమా ప్రేమ
బదులీయగలవా
దైవమా దైవమా దైవమా

నడి ఏట నావయి నువ్వు
సుడి లోన పడదోస్తావు
కడ దాక తోడయి వుండవు
విడదీయ బలినే నువ్వు
విజయాలు అనుకుంటావు
ముడివేయు మంత్రం ఎరుగవు
ఎదురీత కోరే ప్రేమ
ఎదకోత లేని సీమ
నిను చేరుకుంటే నేరమా

మధురానుభవమా ప్రేమ
మతిలేని తనమా ప్రేమ
నువు తేల్చ గలవా
కాలమా కాలమా కాలమా
మృదువైన స్వరమా ప్రేమ
పదునైన శరమా ప్రేమ
బదులీయగలవా
దైవమా దైవమా దైవమా

Madhuraanubhavamaa prema from happy happygaa

















Tuesday, October 23, 2012

ఇది కథ కాదు


ఆ...ఆ...ఆ....ఆ...ఆ...
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా ఉరికే మనసుకు
గిరిగీస్తే అది ఆగేదేనా(గాలి)

ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో(ఆ నింగిలో)
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతమొస్తే
మల్లెకేల ఆకుచాటు(గాలి)

ఓ తెమ్మెరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణమయ్యింది
పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది(గాలి)
galikadupu ledu kadalikantu ledu

*****************************

సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
చెలి కాలి మువ్వల గలగలలు(2)
చెలి కాని మురళిలో...........
సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు

ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో(2)
కదిలి కదలక కదిలించు కదలికలు(2)
గంగా తరంగాల శృంగార డోలికలు(సరిగమలు)

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు(సరిగమలు)

నయనాలు కలిసాయి ఒక చూపులో
నాట్యాలు చేసాయి నీ రూపులో(2)
రాగమై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో(సరిగమలు)

sarigamalu galagalalu
***************************************

JUNIOR.....JUNIOR...JUNIOR
జూనియర్.....జూనియర్...జూనియర్
ఇటు అటు కానీ హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డి పోచవు

గడ్డి పోచా...నేనా
ఒడ్డున పెరిగే గడ్డి పోచవు
ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు..
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటే ఎందుకు కారాదు

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిల గానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా...
తీగకు పందిరి కావలెగాని తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహము వేస్తే
తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనటం చాదస్తం

NO IT IS BAD....BUT IAM MAD

మోడు కూడా చిగురించాలని మూగమనసు
కోరే కోర్కెను మోహం ద్రోహం అనటం అన్యాయం
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు

LOVE HAS NO SEASON నాట్ EVEN REASON SHUT UP

ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు
ఎండ వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి

IT IS HIGHLY IDIOTIC
NEVER IT IS FULLY ROMANTIC
పాట పాడిన ముద్దుల బొమ్మ
పకపక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పి నవ్వమ్మా
ని మనసున వున్నది చెప్పి నవ్వమ్మా


*********************************