Tuesday, October 23, 2012

ఇది కథ కాదు


ఆ...ఆ...ఆ....ఆ...ఆ...
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా ఉరికే మనసుకు
గిరిగీస్తే అది ఆగేదేనా(గాలి)

ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో(ఆ నింగిలో)
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతమొస్తే
మల్లెకేల ఆకుచాటు(గాలి)

ఓ తెమ్మెరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణమయ్యింది
పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది(గాలి)
galikadupu ledu kadalikantu ledu

*****************************

సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
చెలి కాలి మువ్వల గలగలలు(2)
చెలి కాని మురళిలో...........
సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు

ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో(2)
కదిలి కదలక కదిలించు కదలికలు(2)
గంగా తరంగాల శృంగార డోలికలు(సరిగమలు)

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు(సరిగమలు)

నయనాలు కలిసాయి ఒక చూపులో
నాట్యాలు చేసాయి నీ రూపులో(2)
రాగమై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో(సరిగమలు)

sarigamalu galagalalu
***************************************

JUNIOR.....JUNIOR...JUNIOR
జూనియర్.....జూనియర్...జూనియర్
ఇటు అటు కానీ హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డి పోచవు

గడ్డి పోచా...నేనా
ఒడ్డున పెరిగే గడ్డి పోచవు
ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు..
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటే ఎందుకు కారాదు

సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిల గానం కాకి పాడితే ద్రోహమురా
నీ మొహమురా...
తీగకు పందిరి కావలెగాని తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహము వేస్తే
తేనె కోసం తేటి వస్తే
పాపం గీపం అనటం చాదస్తం

NO IT IS BAD....BUT IAM MAD

మోడు కూడా చిగురించాలని మూగమనసు
కోరే కోర్కెను మోహం ద్రోహం అనటం అన్యాయం
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు

LOVE HAS NO SEASON నాట్ EVEN REASON SHUT UP

ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తెన్నులు కాచేవు
ఎండ వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి

IT IS HIGHLY IDIOTIC
NEVER IT IS FULLY ROMANTIC
పాట పాడిన ముద్దుల బొమ్మ
పకపక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పి నవ్వమ్మా
ని మనసున వున్నది చెప్పి నవ్వమ్మా


*********************************



No comments:

Post a Comment