Friday, January 27, 2012

ఓ పాపా లాలి!!

 
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంట రా (మాటే రాని)

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే  (మాటే రాని)

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే    (మాటే రాని)

గాయం

అలుపన్నది ఉందా..
ఎగిసే అలకు, యెదలోని లయకు
అదుపన్నది ఉందా, కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు...
లల... లల....లలలలా..
(అలుపన్నది)

నా కోసమె చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు 
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు..
లల.... లలా.... లలలలా..
(అలుపన్నది)

నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు..
లల.... లలా.... లలలలా
(అలుపన్నది )

Sunday, January 22, 2012

లాలి లాలి అను రాగం సాగుతుంటె

సినిమా: ఇందిర
రచన: వేటూరి
సంగీతం:ఏ ఆర్ రెహ్మాన్
గానం:    హరిణి


లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడకే
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ..పగటి భాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంతవేళ
                                                          : లాలి లాలి అను రాగం :
సమగప  పమపమా   గరి గారిసాని
సమగప  పమపమా
సమగప  పమపమా   గరి  గారిసాని
సమగప  సగమ
గమ  దదమ నినిద  సనిరీసా నిదప
గమ  దదమ నినిద  గరిసా నిదపమగ  

ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా
ఏదో అంటుంది కోయల పాట రాగం ఆలకించరా
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం        
                                                       : లాలి లాలి అను రాగం :

చిత్ర పాటలు

సినిమా: సింధు భైరవి 
సంగీతం : ఇళయరాజా
గానం :  చిత్ర



పాడలేను పల్లవైన భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను   : పాడలేను : 2 :



తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్న    : పాడలేను :



అమ్మ జోల పాటలోనా రాగమెంత ఉన్నది
పంట చేల పాటలోనా భాష ఎంత ఉన్నది
ఊయలే తాళం పైరగాలే  మేళం     
మమతే రాగం శ్రమ జీవనమే భావం
రాగమే లోకమంతా : 2 :
కష్టసుఖములె స్వరములంటా 
షడ్జమ కోకిల గాన స్రవంతికి 
పొద్దు పొడుపే సంగతంటా                     : పాడలేను : 



రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనే తియ్యగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా 
ఏ ప్రాణమైనా తమిదీరి పోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ .ఓ .2 :
రహస్యమేముంది విప్పి చెబితే
ఆహో ఊహూ రోకటి పాటలొ 
లేదా మధుర సంగీతం    : ఆహో :        : పాడలేను :



మపదమ పాడలేను పల్లవైన
స రి గమ పదమ పాడలేను పల్లవైన
పదనిస నిదమగ సరి పాడలేను పల్లవైన
సస రిగ సరిగమ గస పదమ 
మమ పద మపదని దమ పదని
పద నిసరిగ సనిదమ
పదనిస నిదపద నిదమప దమగమ పదమగ మగస
ససస ససస ససస సరిగప గపగస నిద  
మమమ మమమ మమమ పదనిస నిసనిస మగ 
ససరిరి గగమమ పపదద నినిస
నిస సస నిస నినిద
మపదని దని దదమ
గమగస రిగమగ
మపదమ పదనిస
రిగమగ సనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ
నీ మనసున దయ రాదు                    : మరి మరి :      




చిత్రం :       స్వయంవరం
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం :   వందేమాతరం  శ్రీనివాస్
గానం :      చిత్ర


మప    మపరి
రిమ    రిమస

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా  : 2 :

ఎద లోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని : 2 :
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని   : మరల తెలుపనా  :

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని  : 2 :
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని : 2 :
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని

మరల తెలు హ..హ. ప్రియా మరల తెలుపనా

నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ జూసే  : 2 :
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయే   : మాట రాని :
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక
మనసు పడే మధుర భాధ                                    : మరల తెలుపనా :





చిత్రం: ప్రేమ
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  కే.ఎస్.చిత్ర


ఈనాడే ఏదో  అయ్యింది
ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం  మరలా రానిదీ
ఆనందరాగం మోగింది
అందాల లోకం రమ్మంది            : ఈనాడే :


నింగీ నేల ఏకం కాగా ఈ క్షణమిలాగెలాగింది : 2 :
ఒకటే మాటన్నదీ ఈ.ఈ .
ఒకటై పొమ్మన్నది
మనసే ఇమ్మన్నది అది  నా సొమ్మన్నది
పరువాలు మీటి నన  ననన
సెలయేటి తోటి   నన ననన
పాడాలి నేడు నన ననన
కావాలి తోడు నన నన   నన నన
నన నన  నన నన 
నన నన                               : ఈనాడే :


సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంతా కాచింది : 2 :
పగలు రేయన్నది అసలే లేదన్నది
కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది
ఎదలోని ఆస నన ననన
ఎదగాలి బాస నన ననన
కలవాలి నీవు నన ననన
కరగాలి నేను నన నన నన నన
నన నన నన నన 
నన నన                               : ఈనాడే :




చిత్రం :         స్వాతి కిరణం
సంగీతం :     పుహళేంది
గానం :        వాణి జయరాం, చిత్ర


జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా  : 2 :
రెప్ప వెయ్యనేలేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచని  : 2 :
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

కాటుక కంటి నీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీప కళిక చిన్నబోనియ్యకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్న  : 2 :
నీ కుంకుమకెపుడూ పొద్దు గుంకదమ్మా


సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరిచి శూలాన మెడ విరిచి
పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా  : 2 :
ఆ రెండు కళ్లల్లో అది కన్నీటి చితి
కాల కూటం కన్నా ఘాటైన గరళమిది
గొంతు నులిమే గురుతై వెంటనే ఉంటుంది

ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి
ఆది శక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్న

కంచి కెళ్ళి పోయేవే కథలన్నీ ..



సినిమా: మాతృదేవోభవ
సాహిత్యం :   వేటూరి
సంగీతం :  ఎం ఎం కీరవాణి
గానం :        చిత్ర


వేణువై వచ్చాను భువనానికి
గాలిని పోతాను గగనానికి
మమతలన్ని మౌన గానం
వాంఛలన్ని వాయు లీనం


మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ

ఏడుకొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను మేననుకుంటే ఎద చీకటే
హరీ .. హరీ ..హరీ ..
రాయినై ఉన్నాను ఈనాటికి
రామ పాదము రాక ఏనాటికి     : వేణువై  :

నీరు కన్నీరాయె ఊపిరే  బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో  : నీరు  :
ఆ నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ ..హరీ .హరీ ..
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి        : వేణువై  :


వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి




చిత్రం: రుద్రవీణ
రచన: సీతారామశాస్త్రి
సంగీతం: ఇళయరాజా
గానం: కే.జే.ఏసుదాస్, కే.ఎస్.చిత్ర
 


లలిత ప్రియకమలం విరిసినదీ       : 2 :
కన్నుల కొలనిని  అ.. అ.. అ.. 
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని అ..అ..అ..
ఉదయ రవికిరణం మెరిసినదీ
అమృత కలశముగా ప్రతి నిమిషం  : 2 :
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది               
                                                        : లలిత ప్రియకమలం :


రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం : 2  :
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిల కిల తీగ సొగసుల తొణికిన మిల మిల
పాడుతున్నది ఎద మురళీ రాగఝరి తరగల మృదు రవళి
తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటన గని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను 
                                                       : లలిత ప్రియకమలం :


కోరే కోవెల ద్వారం నీదై  చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ   : 2  :
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పధం సాగినది ఇరువురి బ్రతుకు రధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె ఒడి ఒడి పరువిడి     
                                                          : ఉదయ రవికిరణం :
 
 

ఏకవీర

సినిమా: ఏకవీర
రచన: డాక్టర్ సి.నారాయణ రెడ్డి
సంగీతం : కే వి  మహదేవన్
గానం : ఘంటసాల, సుశీల


తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు       : తోటలో  :


నవ్వులా అవి కావు
నవ్వులా అవి కావు నవపారిజాతాలు  : 2 :
రవ్వంత సడి లేని రసరమ్య గీతాలు  : 2 :
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా  : 2 :
అపరంజి కలలన్ని చిగురించునా        : తోటలో  :


చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను  : 2 :
పాటలాధర రాగ భావనలు కన్నాను  : చాటుగా  :
ఎలనాగ నయనాల కమలాలలో దాగి  : 2 :
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను  : 2 :
ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ  : 2 :
అనురాగ మధుధారయై సాగనీ          : తోటలో  :


 

Saturday, January 21, 2012

సంతానం

సినిమా:సంతానం
రచన:అనిశెట్టి పినిశెట్టి
సంగీతం:సుసర్ల దక్షిణామూర్తి
గానం:లతా మంగేష్కర్


నిదురపో..నిదురపో..నిదురపో..
నిదురపో..నిదురపో..నిదురపో..


నిదురపోరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా


నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా
నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన కలత నిదురే లేదురా
నిదురపోరా తమ్ముడా


ఆఆఆఅ
కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే...
ఆఆఆఆ
కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే...
లేత మనసుల చిగురుటాశ పూటలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా


ఆఆఆఆ
జాలి తెలిసి కన్నీరు తుడిచే దాతలే కనరారే
జాలి తెలిసి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా యింతలో చితి ఆయే
నీడ చూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా



పి.లీల పాటలు

సినిమా:   శాంతి నివాసం 
రచన : :    సముద్రాల 
సంగీతం :   ఘంటసాల 
గానం :       పి.లీల  

తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
నీకొరకే రాజా..ఆ..ఆ..
వెన్నెల రాజ


కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే


కలువ మిటారపు కమ్మని కలలు..   
 కలువ మిటారపు కమ్మని కలలు
కళలు కాంతులు నీ కొరకేలే
చెలియారాధన శోధన నీవే 
జిలిబిలి రాజ జాలి తలచరా


కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే


కనుల మనోరథ మాధురి దాచి  ..ఆ ఆ......
కానుక చేసే వేళకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి  నిలచెరా


కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే


సినిమా:రాజ మకుటం
రచన:దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం:మాస్టర్ వేణు
గానం:పి.లీల


సడి సేయకో గాలి ..సడి సేయబోకే ..
సడి సేయకో గాలి ..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవలించేనే..
సడి సేయకో గాలి ..సడి సేయబోకే


రత్న పీఠిక లేని రారాజు నాస్వామి ..
మణికిరీటము లేని మహారాజు గాకేమి ..
చిలిపి పరుగుల మాని కొలచి పోరాదే. .
సడి సేయకో గాలి ..సడి సేయబోకే


ఏటి గలగలలకే  ఎగసి లేచేనే ..
ఆకు కదలికలకే అదిరి చూసేనే ..
నిదుర చెదిరిందంటే నేనూరుకొనే ..
సడి సేయకో గాలి ..సడి సేయబోకే


పండు వెన్నలనడిగి పాన్పు తేరాదే ...
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే ..
విరుల వీవెన బూని విసిరి పోరాదే ..
సడి సేయకో గాలి ..సడి సేయబోకే


సినిమా:మిస్సమ్మ
రచన:పింగళి నాగేశ్వర రావు
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గానం:పి.లీల


కరుణించు మేరి మాతా శరణింక మేరి మాతా...
నీవే శరణింక మేరి మాతా

పరిశుద్ధాత్మ మహిమా.. వర పుత్రుగంటివమ్మా..౨
ప్రభు ఎసునాధు కృపచే మా భువికి కలిగే రక్షా...(కరుణించు)

దరిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకూ..౨
క్షణమైన శాంతి లేదే ...దినదినము శోధనాయే...(కరుణించు)



సినిమా:  చిరంజీవులు 
రచన :  సముద్రాల
సంగీతం : ఘంటసాల
గానం :  పి. లీల
  


తెల్లవార వచ్చె తెలియక నా సామి  : 2 :
మళ్ళి పరుండేవు లేరా  : 2 :
మళ్ళి పరుండేవు మసలుతు ఉండేవు  : 2 :
మారాము చాలింక లేరా : 2 :             : తెల్లవార వచ్చె:  


కళ కళమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా : 2 :
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదుర లేరా : 2 :
దైవరాయ నిదుర లేరా  


నల్లనయ్య రార నను కన్న వాడా బుల్లితండ్రి రార బుజ్జాయి రారా  : 2 :

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా : 2 :
వెన్న తిందువుగాని రారా                   : తెల్లవార వచ్చె : 

Friday, January 20, 2012

చెలికాని తుది పలుకు

మొగము చూసిన ముగ్దమోహనమయ్యే  
నగవు చూసిన నవ్య రత్నాలు జిమ్మె
మాటలందున మధువు ధారలై కురిసే
మగువ మనసెందుకో కఠిన పాశమై నిలిచే
అమ్మను మరిపించింది తన పాపను నేనంది…
అందమైన జీవితమే మన సొంతం అన్నది
అమావాస్య కమ్మునని అనుకోలేదానాడు
ఆటబొమ్మననుకుందో విసిరేసిందీ నన్ను 
విధి లీల అనుకోనా చెలి లీల అనుకోనా?
చెదిరింది నా బ్రతుకు మిగిలిందీ తుది పలుకు
ఏ నీడన నువ్వున్న నా నీడ నీ కొరకు...

నా పల్లె

చీకటి ముసుగు తీసి మంచు స్నానాలు చేసి
వెలుగు చీర చుట్టుకున్న వేకువ మల్లి 
నింగి చుక్కల తెచ్చి నిండు ముగ్గులు తీర్చి
మురిసి ముస్తాబయ్యే నా పల్లె తల్లి …

Saturday, January 7, 2012

శ్రీ రాముని పాటలు

1.
సినిమా: శంకరాభరణం
రచన:రామదాసు
సంగీతం:కే వి మహదేవన్
గానం:వాణి జయరాం


ఏ తీరుగ నను దయ జూచెదవో...
ఇనవంశోత్తమ రామా..
ఏ తీరుగ నను దయ చూచెదవో ...
ఇనవంశోత్తమ రామా..

నా తరమా ..భవ సాగరమీదను నళిన దళేక్షణ రామా...
నా తరమా ..భవ సాగరమీదను నళిన దళేక్షణ రామా...


శ్రీ రఘు నందన సీతారమణా..
శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా...


క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా...
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా...
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా..


2.
సినిమా:మీనా
రచన:ఆరుద్ర
సంగీతం:రమేష్ నాయుడు
గానం:పి.సుశీల 


శ్రీ రామ నామాలు శతకోటి ..ఒక్కొక్క పేరు బహు తీపి...బహు తీపి...(శ్రీ రామ)

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరధరామయ్య స్థవనీయుడు
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు..(శ్రీ రామ)


సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందరరామయ్య సుకుమారుడు
కోతి మూకలతో....ఆ..ఆఅ..ఆ....కోతి మూకలతో లంకపై దండెత్తు
కోదండరామయ్య రణధీరుడు...రణధీరుడు...(శ్రీ రామ)


పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు
పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు..
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు...అఖిలాత్ముడు...(శ్రీ రామ)


3.
సినిమా:శంకరాభరణం
రచన:మైసూరు వాసుదేవాచార్
సంగీతం:కే వి మహదేవన్
గానం:వాణి జయరాం,బాలు


బ్రోచేవారెవరురా
నిను విన..నిను విన
రఘువరా  ..రఘువరా నను
బ్రోచేవారెవరురా


నీ చరణాంబుజములునే నీ చరణాంబుజములునే 
విడజాల కరుణాలవాల

బ్రోచేవారెవరురా.......

ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే
సా సనిదపద  నిస  నిని దద పమ   
పా దమ గమపదని సా ని  ద ప మ ని ద ప మ
గ మ ప ద మ గ రి స స మా  గ మ ప ద మా ప ద ని
స స రి ని ని ని స దా ద ద ని పా ద మ ప ద ని
సా ని ద ప  మ గ మ ని ద ని  ప ద మా ప ద ని
సమా  గరిస  రిసానిదప   సానీదపమ గామాపదని

బ్రోచేవారెవరురా ........

సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక
సా సనిదపద నిస  నినిదదపమ
పాదమ గా మా పాదాని  సానీదపమ నీదాపమా
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దాదానిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమ గామాపదని

బ్రోచేవారెవరురా..... 

4.
సినిమా:లవకుశ
రచన:సదాశివబ్రహ్మం
సంగీతం:ఘంటసాల  
గానం:రాఘవులు,వైదేహి,కోమల,సౌమిత్రి


జయజయ రాం జయజయ రాం

శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా
రఘు రామ రామ రణరంగ భీమ జగదేకసర్వభౌమా  (శ్రీ రామ)

సూర్యాన్వయాబ్ధి  సోమా సుగుణాభిరామ శుభ నామా
సూర్యాన్వయాబ్ధి  సోమా సుగుణాభిరామ శుభ నామా
కారుణ్యధామా దశకంఠ విరామా రాఘవరాజనలామా (శ్రీ రామ)


సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా
సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా
అరవిందలోచన సుందరసురుచిర ఇందీవరశ్యామా (శ్రీ రామ)

జయజయ రాం జయరఘు రాం
జయజయ రాం జయరఘు రాం
జయజయ రాం 


సినిమా: సప్తపది
రచన:త్యాగరాయ
సంగీతం :కే.వి. మహదేవన్
గానం : ఎస్. జానకి


మరుగేలరా ఓ రాఘవా : 4 :
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన : 2 :
                                                           : మరుగేలరా :
అన్ని నీవనుచూ అంతరంగమునా : 2 :
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా : అన్ని :
నిన్నెగాని మదిని ఎన్నజాల నొరులా 
నిన్నెగాని మదీనెన్న జాల నొరుల 
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత                  : మరుగేలరా :