1.
సినిమా:శ్రీమతి ఒక బహుమతి
రచన:సిరివెన్నల
సంగీతం:శంకర్ గణేష్
గానం:బాలు
ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం ..
ఆడదే సంతోషం ..మనిషికి ఆడదే సంతాపం ..
ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం ..
ఆడదే సంతోషం ..మనిషికి ఆడదే సంతాపం ..
కోతి మంద చేత సేతువే నిర్మింప చేసింది ఆడది రా ..
నాడు తాళి కోసం యముడి కాల పాశం తోనే పోరింది ఆడది రా ..
ఖడ్గ తిక్కన కత్తి తుప్పుపట్టకుండా ఆపింది ఆడది రా ..
అల్ల బాల చంద్రుడి చండ భానుతేజం వెనుక వెలిగింది ఆడది రా ..
వేమన వేదానికి నాదం ఒక ఆడది రా ..
వేమన వేదానికి నాదం ఒక ఆడది రా ..
ఇతగాడ్ని నడుపుతోంది అటువంటి ఆడది రా ..
దశరధున్ని నాడు దిక్కు లేని దశకు తెచ్చింది ఆడది రా ..
అయ్యో భీష్ముడంతటివాన్నిఅంపశయ్యను పెట్టి చంపింది ఆడది రా ..
అందాల అగ్గి లో విశ్వామిత్రుడి నిష్ఠ చెరిపింది ఆడదిరా ..
అహ పల్నాడు నేలంత పచ్చి నెత్తుట్లోన తడిపింది ఆడది రా
కోడల్ని తగలపెట్టేటి అత్త కూడా ఆడది రా ..
ఈ మగవాడ్ని నేడు చెరిచింది ఆడది రా ..
ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం ..
ఆడదే సంతోషం ..మనిషికి ఆడదే సంతాపం ..
పంచపాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడది రా ..
అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడది రా .
పోత పోసిన పున్నమంటి తాజ్మహల్ పునాది ఆడది రా ..
అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడది రా ..
మంచి కైనా చెడు కైనా మూలం ఒక ఆడది రా ...
మంచి కైనా చెడు కైనా మూలం ఒక ఆడది రా ...
చరిత్రలో ప్రతీ పుట ఆమె కధే పాడును రా ...
ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం ..
ఆడదే సంతోషం ..మనిషికి ఆడదే సంతాపం ..
2.
సినిమా:ఆడదే ఆధారం
రచన:సిరివెన్నెల
సంగీతం:శంకర్ గణేష్
గానం:బాలు
మహిళలు మహారాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గి రవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కోరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహారాణులు
ఆశ పుడితే తీరు దాక ఆగరు ఇల ఇంతులు
సహనానికి నేల తల్లిని పోలగలరు పడతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చుతల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు
మహిళలు మహారాణులు
విద్య ఉన్నవిత్తమున్నవొద్దికెరుగని వనితలు
ఒడ్దు దాటే ఉప్పెనల్లె ముప్పు కదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే ఒద్దంటే
మానం మర్యాద ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణ కొద్ది కాపాడే రెప్పలే
కతులై పొడిచేస్తే ఆపేదిఇంకెవరులే
వంగి ఉన్న కొమ్మలే బంగారు బొమ్మలూ
మహిళలు మహారాణులు
సినిమా:ప్రతిఘటన
రచన:వేటూరి
సంగీతం:
గానం:జానకి
ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహా భారతం ఆరవ వేదం...
మానభంగ పర్వంలో.....మాతృ హృదయ నిర్వేదం ...నిర్వేదం.....
పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాల కేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిల కామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహా భారతం ఆరవ వేదం...
మానభంగ పర్వంలో.....మాతృ హృదయ నిర్వేదం ...నిర్వేదం.....
కన్న మహా పాపానికి ఆడది తల్లిగ మరి
నీ కండలు పెంచినది గుండెలతో కాదా
యెర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లీ ఒక ఆడదని మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగళ్యం
మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టీ పశువులుగా మారితే
మనవ రూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని ద్రుతరాస్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే
ఏమైపోతుంది సభ్య సమాజం
ఏమైపోతుంది మనవ ధర్మం
ఏమైపోతుంది ఈ భారత దేశం
మన భారత దేశం మన భారత దేశం
సినిమా: మాతృదేవత .
రచన: డాక్టర్ సి .నారాయణ రెడ్డి
సంగీతం: కే వి మహదేవన్
గానం : పి .సుశీల & వసంత
మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్య దేవో భవా
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ...
త్యాగంలో అనురాగంలో .. తరగని పెన్నిధి మగువ ... ||మానవజాతి||
ఒక అన్నకు ముద్దుల చెల్లి .. ఒక ప్రియునికి వలపులవల్లి ...2
ఒక రామయ్యకే కన్నతల్లి ..2 సకలావనికే కల్పవల్లి ...
ఆ .. ఆ .. ఆ ... ఓ ..ఓ ... ||మానవజాతి||
సీతగా ..ధరణిజాతగా .. సహన శీలం చాటినది ...
రాధగా .. మధురబాధగా .. ప్రణయగాధల మీటినది ...
సీతగా ..ధరణిజాతగా .. సహన శీలం చాటినది ...
రాధగా .. మధురబాధగా .. ప్రణయగాధల మీటినది ...
మొల్లగ .. కవితలల్లగా .. తేనేజల్లు కురిసినది ...2
లక్ష్మిగా .. ఝాన్సీలక్ష్మిగా .. సమర రంగాన దూకినది .2.||మానవజాతి||
తరుణి పెదవిపై చిరునగవోలికిన ..మెరయును ముత్యాల సారులు ..
కలకంటి కంట కన్నీరొలికిన తొలగిపోవు ఆ సిరులు ...
కన్నకడుపున చిచ్చు రగిలెన . కరవుల పాలౌను దేశం ..2.
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం ...2
ఆ .. ఆ .. ఆ ... ఓ ..ఓ ... ||మానవజాతి||
సినిమా : మీనా
రచన : ఆరుద్ర
సంగీతం : రమేష్ నాయుడు
గానం : పి.సుశీల
మల్లెతీగ వంటిది మగువ జీవితం ..
చల్లని పందిరి వుంటే .. అల్లుకుపోయేను . అల్లుకుపోయేను ...||మల్లెతీగ ||
తల్లితండ్రుల ముద్దూమురిపెం . చిన్నతనంలో కావాలి ...
ఇల్లాలికి పతి అనురాగం .. ఎల్లకాలము నిలవాలి ...
తల్లికి పిల్లల ఆదరణా .. పండు వయసులో కావాలి ...
ఆడవారికి అన్నివేళలా .. తోడూ నీడా వుండాలి ..తోడూ నీడా వుండాలి ... ||మల్లెతీగ ||
నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ ...
పిల్లాపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి ...
అనురాగంతో మనసును దోచే పతియే మమతల పంట ...
జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియె జగతికి ఆధారం .. జననియె జగతికి ఆధారం ...||మల్లెతీగ ||