Wednesday, December 21, 2011

నాకిష్టమైన తెలుగు పాటలు

1.

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణ వేణి పొంగులా
పాలలా తేనెలా దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు (కృష్ణ)

కృష్ణ దేవరాయల కీర్తి వెలుగు తెలుగు
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు
కూచిపూడి నర్తన త్యాగరాజ కీర్తన
అడుగడుగు ఆణువణువూ అచ్చ తెలుగు జిలుగు తెలుగు
సంస్కృతికే ముందడుగు (కృష్ణ)

పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి తెలుగు
కందుకూరి సంస్కారం చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బాహుటా (కృష్ణ)

2.

పాడనా తెలుగుపాట! పరవశనై - మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల గణ గణలో - గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా - మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట - ఒక పాట || పాడనా

త్యాగయ క్షేత్రయ రామదాసులు - తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది - వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట - ఒక పాట || పాడనా

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు - అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును నాటె ప్రతిచోట - ఒక పాట || పాడనా


3.

దినదినము వర్దిల్లు తెలుగు దేశం...
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం...

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వరనాదసుధలు, నవరసభావాలమనులు
చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడి గోడల రమనీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం
త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!





No comments:

Post a Comment