1.
సినిమా:మెరుపుకలలు
రచన:వేటూరి
సంగీతం:ఏ ఆర్ రెహమాన్
గానం:అనురాధ శ్రీరామ్
అపరంజి మదనుడి అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే
వినువీధిలో వుండే సూర్యదేవుడినే ఇల మీద వొదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటి తో కడుగు సిశుపాలుడోచ్చినాడే

పోరాటభూమినే పూదోట కోనగా పులకింప చేసినాడే
కల్యారి మనమేలు కలికి ముత్యపు రాయి కన్నదిక్కతడులేవే
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలా బాలుడోచ్చినాడే
ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడూ నాకై

2.
సినిమా:రాజాధి రాజు
రచన:ఎం జాన్సన్
సంగీతం:కే వి మహదేవన్
గానం:ఫై సుశీల
రాజ్యము బలము మహిమా నీవే నీవే
జవము జీవము.. జీవన నీవే నీవే (రాజ్యము)
మరియ తనయ.. మధుర హృదయ...౨
కరుణామయా ...కరుణామయా ...(రాజ్యము)
అవసరానికి మించి ఐశ్వర్య మిస్తే ..మనిషి కన్నూ మిన్నూ కానబోడేమో..
కడుపుకు చాలినంత కబలమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో
మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి...౨
గుండె గుండె నీ గుడి దీపాలై అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమీవయ్యా...నీ రాజ్యమీవయ్యా..
అర్హత లేని వారికి అధికారం ఇస్తే ..దయా ధర్మం దారితప్పునేమో
దారి తప్పిన వారిని చేరదీయకుంటే తిరిగి తిరిగి తిరగబడతారేమో
తగిన వారికి తగు బలమిచ్చి సహనం క్షమా సఖ్యత నిచ్చి --౨
తనువూ తనువూ నిరీక్షణ శాలై అణువు అణువు నీ రక్షణ సేనయ్యే బలమీవయ్యా..ఆత్మ బలమీవయ్యా
శిలువపైన నీ రక్తం చిందిన నాడే షమ దమాలు శోభించెను గాదా
నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి ..శోకం మరణం మరణించెను కాదా
చావు పుటుక నీ శ్వాసలని దయా దండన పరీక్షలని..౨
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని సత్యం మార్గం సర్వం నీవని
మహిమ తెలుపవయ్యా ..నీ మహిమ తెలుపవయ్యా.. (రాజ్యము)
3.
సినిమా:మిస్సమ్మ
రచన:పింగళి నాగేశ్వర రావు
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గానం:పి.లీల
కరుణించు మేరి మాతా శరణింక మేరి మాతా...
నీవే శరణింక మేరి మాతా
పరిశుద్ధాత్మ మహిమా.. వర పుత్రుగంటివమ్మా..౨
ప్రభు ఎసునాధు కృపచే మా భువికి కలిగే రక్షా...(కరుణించు)
దరిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకూ..౨
క్షణమైన శాంతి లేదే ...దినదినము శోధనాయే...(కరుణించు)

No comments:
Post a Comment