Saturday, December 24, 2011

నదుల గురించి పాటలు

1.
సినిమా:కృష్ణవేణి
రచన:డాక్టర్ సి.నారాయణ రెడ్డి
సంగీతం:విజయ భాస్కర్
గానం:పి సుశీల,రామకృష్ణ & కోరస్


కృష్ణవేణి....కృష్ణవేణి....కృష్ణవేణి....కృష్ణవేణి....
కృష్ణవేణి....తెలుగింటి విరిబోణి.....
కృష్ణవేణి....నా ఇంటి అలివేణి.........(కృష్ణవేణి....)


శ్రీగిరి లోయల సాగే జాడల..విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు..
లావణ్య లతవై..నను చేరు వేళ..౨
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి..ఆ..ఆ..(కృష్ణవేణి....)


నాగార్జునగిరి కౌగిట ఆగి..బీళ్లను బంగారు చేలుగా మార్చేవు...
ఆంధ్రావనికే అన్నపూర్ణవై .. కరువులు బాపేవు..బ్రతుకులు నిలిపేవు..
నా జీవనదివై ఎదలోన ఒదిగి ..పచ్చని వలపులు పండించు కృష్ణవేణి...(కృష్ణవేణి....) 


అమరావతి గుడి..అడుగుల నడయాడి...
రాళ్ళను అందాల రమణులుగా తీర్చేవు...
ఏ శిల్ప రమణులు ...ఏ దివ్య లలనలు..
నోచని అందాలు..దాచిన కృష్ణవేణి....
ఆ..ఆ.ఆ..ఆ...(కృష్ణవేణి....)


అభిసారికవై...హంసల దీవిలో..
సాగర హృదయాన...సంగమించేవు..
నా మేని సగమై..నా ప్రాణ సుధవై ..
నిఖిలము నీవై...నిలిచిన కృష్ణవేణి....
ఆ..ఆ..ఆ..ఆ..(కృష్ణవేణి....)


2.
సినిమా:గంగోత్రి
రచన:వేటూరి
సంగీతం:ఎంఎం కీరవాణి
గానం:ఎంఎం కీరవాణి,గంగ & కోరస్


ఓం.....ఓం.....ఓం.......
జీవన వాహినీ.....పావనీ.....

కలియుగమున కల్పతరువు నీడ నీవని..
కనులు తుడుచు కామధేను తోడు నీవని...
వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగా దేవి ..
నిను కొలిచిన చాలునమ్మ సకలలోక పావని..
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభధాత్రి..
గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి ....౨

జీవన వాహినీ.....పావనీ.....

మంచుకొండలో ఒక కొండ వాగులా యిల జననమొందిన విరజా వాహిని
స స స రి స రి గ రి గ మ గ మ గ మ గ మ గ రి స రి స రి స రి ...
విష్ణు చరణమే తన పుట్టినిల్లు గా శివగిరికి చేరిన సుర గంగ నీవని..
స ని ద గ రి స ని ద ప మ గ రి స రి స రి గ మ గ మ గ రి స ...
అత్తింటికి సిరులనోసగు అలకనందవై..సాగరకులము కాపాడిన భాగీరదివై...
బదరీవన హృషీకేస హరిద్వారా ప్రయాగముల..మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీ వారణాసి....

గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి .

పసుపు కుంకుమతో పాలు పన్నీరుతో శ్రీగంధపు ధారతో..పంచామృతాలతో..
అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం ..
అమ్మా...గంగమ్మా..
క్రిష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని..
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడోద్దని..
గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికి..చెప్పమ్మా..మా గంగమ్మా...

జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా..
శివుని ఝటలనే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా...
గండాలను పాపాలను కడిగివేయగా..ముక్తి నదిని మూడు మునకలే చాలుగా...
జలదీవేన తలకుపోసే జననీ గంగా భవాని ..ఆమె అండ మంచుకొండ..వాడని సిగ పూదండ..
గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....గంగోత్రి....

గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
గలగలగల గంగోత్రి....హిమగిరి దరి హరి పుత్రి
జీవన వాహిని..పావనీ......


3.
సినిమా:ఆంధ్ర కేసరి
రచన:ఆరుద్ర
సంగీతం:సత్యం
గానం:బాలు


వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి  
వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి  
శతాబ్దాల చరిత గల సుందర నగరం...శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం.. (వేదం)


రాజరాజ నరేంద్రుడు  కాకతీయులు
తేజమున్నమేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కధలన్నీనినదించే గౌతమి హోరు (వేదం)


శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్థితి మావహంచ విహితాం స్త్రీ పుమ్సయోగోద్భావాం
తే వేదత్రయ మూర్తయ స్త్రీపురుషా సంపూజితా వస్సురైర్భూయాసుహు
పురుషోత్తమం భుజభవ శ్రీకంధరాశ్రేయసే 


ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము  (వేదం)


దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకోనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు (వేదం)

4.
సినిమా:గోదావరి
రచన:వేటూరి
సంగీతం:కే ఎం రాధాకృష్ణ
గానం:బాలు & కోరస్
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమఝరే స్వరలహరే   
సాస పాపపాప పమరిససనిస 
సాస పాపపాప పమదపప  
సాస పాపపాప పమరిససనిస 
సాస పాపపాప పమనిదప

ఉప్పొంగెలే గోదావరి
ఊగిందిలే చేలో వరీ
భూదారి లో నీలాంబరి
మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరీ కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసేయ్ చాప దోసేయ్ నావ
బార్సేయ్ వాలుగా చుక్కానే చూపుగా....
బ్రతుకు తెరువు ఎదురీతేగా.....(ఉప్పొంగెలే)
సావాసాలు సంసారాలు
చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే
లాభసాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న
ఇంటిపనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా   
ప్రభువు తాను కాగా.......(ఉప్పొంగెలే)
గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకం కాని లోకం లోనఏకాంతాల  వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా........(ఉప్పొంగెలే)
 

5.
సినిమా:శుభసంకల్పం
రచన:సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం:కీరవాణి
గానం:చిత్ర


హరి పాదాన పుట్టావంటే గంగమ్మా. .. శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా....
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా..
కడలి కౌగిలిని ..కరిగావంటే గంగమ్మా..
నీ రూపేదమ్మా .. నీ రంగేదమ్మా ..
నీ రూపేదమ్మా .. నీ రంగేదమ్మా ..
నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా ..
నీలాల కన్నుల్లో సంద్రవే హైలెస్సో .... నింగి నీలవంతా సంద్రవే హైలెస్సో..
నీలాల కన్నుల్లో సంద్రవే.. నింగి నీలవంతా సంద్రవే ..హైలెస్సో ....


  

No comments:

Post a Comment