చిట్టి చిట్టి చీమలన్నీ జట్టు కట్టి పట్టు పట్టి
నోట కరచి తెచ్చుకున్న మట్టి పెళ్లల కూర్చి కూర్చి
పేర్చి పేర్చి కట్టుకున్న పుట్ట ఇంట
కళ్ళు కప్పి బుసలు కొట్టి పరుగు పరుగున
విషపు నాగే వచ్చి చేర ...
చీమలన్నీ చేరి కూరి పంతమాడి అంత పామును
కుట్టి కుట్టి పెట్టవా..మట్టిపాలు చేయవా...
చేవ లేక, చేత కాక చీమలన్నీ వూరకుండిన
చీమ కలలే చెదిరిపోవు,చింతయే మరి మిగిలిపోవు
చీమలే అని చిన్న చూపు చూడబోయే అంత నాగు
చాలు మేమే నీదు చావుకు అనుచు చాటే ఇంత చీమలు...

No comments:
Post a Comment