రచన:హలీమ
గానం:హలీమ
చిట్టీ పొట్టీ చిన్నారి పాపకు చిరునవ్వే అందమూ
చిన్నారి చిట్టి తల్లి అలకలింక అందమూ..అలకలింక అందము

డూ డూ డూడూ బసవడు తువ్వాయి లేగలు
మా పాప గెంతులను చిన్నబోయి చూద్దురూ
చిన్నారి పొన్నారి చిలుకలు సింగారీ నెమలులు
మా పాపా పలుకులను మూగబోయి విందురూ..మూగబోయి విందురు ''చిట్టీ"
పారాడుతుంటే పాపాయి యింటా పసిడి పంట పండును
చిరునవ్వుల రత్నాలు వేనవేలు కురియును
జాబిల్లి పాడేసి జోలపాట తన నిద్దుర మరిచెను
ఏ కన్నూ సోకకుండా మబ్బు దిష్టి తీసెను.. ''చిట్టీ"

No comments:
Post a Comment