Tuesday, June 16, 2015

కొత్తగా నేర్చుకున్న లాలి పాట..


కస్తూరి రంగ రంగా
చిన్నారి కావేటి రంగ రంగా
బంగారు ముద్దు కొండా
బజ్జోర నీ కడుపు చల్లగుండా

నీ ఇల్లు నేల గట్టా
నీ నోట బెల్లమ్ము గడ్డ గొట్టా
నీ ఇంట సిరులు పుట్టా
చీమలై చుట్టాలు చుట్టుముట్టా

కస్తూరి రంగ రంగా
చిన్నారి కావేటి రంగ రంగా

రామయ్య వంటి తండ్రి
అచ్చముగ సీతమ్మ వంటి తల్లీ
లక్ష్మణుడు బాబాయి రా
నా తండ్రి నీకింక లోటేమిరా

కస్తూరి రంగ రంగా
చిన్నారి కావేటి రంగ రంగా