Thursday, March 8, 2012

వేటూరి పాటలు. .


మంచు పల్లకి
..ఆఆ..ఆఆ..
మేఘమా దేహమా మెరవకే క్షణం
మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్
మేఘమా దేహమా మెరవకే క్షణం
మెరిసినా కురిసినా కరుగునే 
మెరిసినా కురిసినా కరుగునే జీవనం
మేఘమా దేహమా మెరవకే క్షణం

మెరుపులతో పాటు ఉరుములుగా
దనిరిసా రిమ దనిస దనిపగా
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిటా ముగ్గులుగా....
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా

మేఘమా దేహమా మెరవకే క్షణం
మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్
మేఘమా దేహమా మెరవకే క్షణం

పెనుగాలికి పెళ్ళిచూపూ
పువ్వు రాలిన వేళా కళ్యాణం
అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వూ
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో .. ..

మేఘమా దేహమా మెరవకే క్షణం
మెరిసినా కురిసినా కరుగునే జీవనం.. మ్మ్
మేఘమా దేహమా మెరవకే క్షణం

*********************************************        
జాకీ

అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి
దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని
అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి

నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా
నిదురపోదు కన్నూ నిశిరాతిరి
నీవు తోడు లేక నిలువలేని నాకు
కొడిగట్టునేల కొన ఊపిరి
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ
ఎలా పడుకోను నిట్టూర్పు జోల
పూల బాణాలు గాలి గంధాలు సోకేను నా గుండెలో
సోదలేని సయ్యాటలో

అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి
దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని

పూటకొక్క తాపం పూల మీద కోపం
పులకరింతలయె సందెగాలికి
చేదు తీపి ప్రాణం చెలిమిలోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సముఖాన ఉన్నా రయబారమాయె
చాటుమాటునేవో రాసలీలలాయె
ప్రేమ గండాలు తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్ళకో
కలిసేది ఏనాటికో

అలా మండిపడకే జాబిలి చలీ ఎండ కాసే రాతిరి
దాహమైన వెన్నెల రేయి దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోను ప్రేమని ఎలా పిలుచుకోను రమ్మని

***************************************************        
జానకిరాముడు
నా గొంతు శృతిలోన నా గుండెలోన
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
..నా గొంతు శృలోన నా గుండెలోన
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
..నా గొంతు శృతిలోన నా గుండెలోన
ఒక మాట పది మాటలై అది పాట కావాలని
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడలేని కలలుగ
నిలిచిపోవాలని....
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోన నా గుండెలోన
ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని
తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని....
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
నా గొంతు శృతిలోన నా గుండెలోన
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
*************************************************        
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...
వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట
వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట
అరుదైన వరదయ్యా బిరుదైన క్షేత్రయ్య
గోపాలా మువ్వగోపాలా అని మురిసేటి తెలుగింటి పాట
 
అని మురిసేటి తెలుగింటి పాట
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...
తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట
తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట
రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై
శ్రీరామా రారా రఘురామా అని పిలిచేటి తెలుగింటి పాట
అని పిలిచేటి తెలుగింటి పాట
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
తెలుగు పాట పాడవే తియ్యగా హాయిగా
కుక్కూ కుక్కూ కుక్కూ...కుక్కూ కుక్కూ కుక్కూ...

******************************************  
కాంచనగంగ
వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

ఇవ్వాలి చేయూత ..
మనసివ్వడమే మమత..మనసివ్వడమే మమత!!

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

పూలురాలి నేలకూలి..తీగబాల సాగలేదు..
చెట్టులేక..అలుకోక..పూవు రాదు నవ్వలేదు!!

మోడు మోడుని తిట్టుకున్నా..తోడు విడిచేనా??
పులకరించే..కొత్త ఆశ, తొలగిపోయెనా?

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

ఆదరించే ప్రభుతలేక..కావ్యబాలా నిలువలేదు..
కవిత ఐనా..వనిత ఐనా..ప్రేమలేకా పెరగలేదు..

చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా??
చేదు మింగి..తీపి నీకై పంచమరిచేనా??

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

తనది అన్న..గూడులేక కన్నెబాల బతకలేదు..
నాది అన్న తోడులేక ..నిలువలేదు విలువలేదు!!

పీడ పీడని తిట్టుకున్నా..నీడ విడిచేనా??
వెలుగులోన..నీడలోన నిన్ను మరిచేనా..

వనిత..లత..కవిత..
మనలేవు లేక జత..

***********************************************
మన్మధ
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే 
ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే 
ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాదైనా
తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు
తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి

నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే 
ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
ఆశ లాంటీ నీ శ్వాస తగిలితే బతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయెనే
తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
చెలియ నీపేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెదిరిపోకుండా గొడుగువలే నేనుంటే వానెంతలే
నా చిట్టి ప్రేమా...

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే 
ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా

******************************************      
ముద్ద మందారం

నీలాలు కారేనా.. కాలాలు మారేనా??
నీ జాలి పంచుకోనా??
నీలాలి నే పాడలేనా??
జాజి పూసేవేళ..జాబిల్లి వేళ..
పూల డోల నేను కానా??
నీలాలు కారేనా.. కాలాలు మారేనా??
నీ జాలి పంచుకోనా??
నీలాలి నే పాడలేనా??
జాజి పూసేవేళ..జాబిల్లి వేళ..
పూల డోల నేను కానా??
సూరీడు నెలరేడు సిరిగల దొరలే కాదులే..
పూరి గుడిసెల్లో,పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే!!
నింగి, నేల కొనగల సిరులే లేవులే..
కలిమి లేముల్లో, కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే!!
నీలాలు కారేనా.. కాలాలు మారేనా??
నీ జాలి పంచుకోనా??
నీలాలి నే పాడలేనా??
జాజి పూసేవేళ..జాబిల్లి వేళ..
పూల డోల నేను కానా??
గాలిలో తేలి వెతలను మరిచే వేళలో..
కలికి వెన్నెల్లో, కలల కన్నుల్లో కలతారిపోవాలిలే!!
తారలే చేరి తళ తళ మెరిసే రేయిలో..
ఒడిలో నువ్వుంటే, ఒదిగి పోతుంటే కడతేరి పోవాలిలే!!
నీలాలు కారేనా.. కాలాలు మారేనా??
నీ జాలి పంచుకోనా??
నీలాలి నే పాడలేనా??
జాజి పూసేవేళ..జాబిల్లి వేళ..
పూల డోల నేను కానా??
నీలాలు కారేనా.. కాలాలు మారేనా??
నీ జాలి పంచుకోనా??
నీలాలి నే పాడలేనా??
జాజి పూసేవేళ..జాబిల్లి వేళ..
పూల డోల నేను కానా??

***********************************
అలివేణి ఆణిముత్యమా.. నీ కంట నీటిముత్యమా..
ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో..
స్వాతివాన లేత ఎండలో..జాలినవ్వు జాజి దండలో


అలివేణి ఆణిముత్యమా.. నీ కంట నీటిముత్యమా..
ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో..
స్వాతివాన లేత ఎండలో..జాజిమల్లి పూలగుండెలో

అలివేణి ఆణిముత్యమా..

కుదురైన బొమ్మకి..కులుకు మల్లెరెమ్మకి..
కుదురైన బొమ్మకి..కులుకు మల్లెరెమ్మకి..
నుదుట బొట్టు పెట్టనా.. బొట్టుగా
వద్దంటే ఒట్టుగా..


అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి
అడుగుమడుగులొత్తనా..మెత్తగా
అవునంటే తప్పుగా..

అలివేణి ఆణిముత్యమా..
నా పరువాల ప్రాణముత్యమా..

పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా..పూజగా..
పులకింతల పూజగా..

తొలిజన్మల నోముకి.. దోరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి.. దోరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా.. చల్లగా
మరుమల్లెలు చల్లగా!! 

అలివేణి ఆణిముత్యమా.. 
నీ కంట నీటిముత్యమా.. ఆఆ
జాబిలి కలువే ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో..జాజిమల్లి పూలగుండెలో
అలివేణి ఆణిముత్యమా..
అలివేణి ఆణిముత్యమా..
  

No comments:

Post a Comment