Friday, March 9, 2012

సత్యం సంగీతంలో..

సినిమా : స్వయంవరం
రచన : రాజశ్రీ
సంగీతం : సత్యం
గానం:బాలు,సుశీల

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..
రారమ్మని పిలిచే పైబడీ.. (ఆకాశం ఎందుకో)

పసుపుపచ్చ లోగిలిలో పసుముకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలిలో పసుబార బోసినట్టు
పాదాల పారాణి అద్దినట్టూ..
నుదుటిపై కుంకుమా దిద్దినట్టూ..(ఆకాశం ఎందుకో)

పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి పోసినట్టూ..
కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..(ఆకాశం ఎందుకో)

(aakaasam yenduko pachchabaddadi)

ఆచార్య ఆత్రేయ పాటలు(Janaki kalaganaledu,poosindi poosindi punnaaga,raallallo isakallo,kanulu kanulato kalabadite aa tagavuku,kanne pillavani,sapaatu yetoo ledu)

రాజ్ కుమార్
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
రామాయణం..మన జీవన పారాయణం!!

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..

చెలి మనసే శివధనుసైనది..తొలిచూపుల వశమైనది..
వలపు స్వయంవరమైనప్పుడు..గెలువనిది ఏది?
ఒక బాణము ఒక భార్యన్నది..శ్రీరాముని స్థిరయశమైనది..
శ్రీవారు వరమిస్తే..సిరులన్నీ నావి!!

తొలి చుక్కవు నీవే..చుక్కానివి నీవే!!
తుది దాకా నీవే..మరుజన్మకు నీవే!!
.. .. ..

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..

సహవాసం మనకు నివాసం.. సరిహద్దు నీలాకాశం..
ప్రతి పొద్దు ప్రణయావేశం.. పెదవులపై హాసం..
సుమసారం మన సంసారం..మణిహారం మన మమకారం..
ప్రతీ రోజు ఒక శ్రీకారం.. పరవశ శృంగారం

గతమంటే నీవే..కథకానిది నీవే!!
కలలన్నీ నావే..కలకాలం నీవే!! 
.. .. ..

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
రామాయణం..మన జీవన పారాయణం!!

లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా
లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా (jaanaki kalaganaledu)
****************************************************   
సీతారామయ్య గారి మనువరాలు
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..
ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..
ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..
ఆడ జతులాడ..
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా..
అష్టపదులే పలుకే నీ నడకే వయ్యారంగా..
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిలే..
కలలొచ్చేటి నీకంటి పాపాయిలే కధ చెప్పాయిలే!!
అనుకోని రాగమే, అనుకోని దీపమై..
వలపన్న గానమే, ఒక వాయు లీనమై..
పాడె..మది పాడే..
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..
పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగా..
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా..
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే..
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే!!
అల ఎంకి పాటలే, ఇల పూల తోటలై..
పసి మొగ్గరేకులే,పరువాల చూపులై..
పూసే..విరబూసే..
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..
ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..
ముల్లోకాలే కుప్పెలై, జడ కుప్పెలై..
ఆడ జతులాడ..
పూసింది పూసింది పున్నాగా,పూసింత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసే సల్లంగ,దాని సన్నాయి జళ్ళీన సంపెంగ..
(poosindi poosindi punnaaga)
**************************************************   
సీతారామ కల్యాణం
లా..లా..లలలాల లాలాల..లలలలా
లా లా లా .. లలలాల..లాలలాలలా..
ఊహూహు..ఆహాహా ఓహోహో..
లాలాలా..ఆహాహా ఓహోహో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..
ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..
ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..
కలలన్నీ పంటలై పండేనేమో?? కలిసింది కన్నుల పండగేమో??
చిననాటి స్నేహమే అందమేమో..అది నేటి అనురాగ బంధమేమో..
తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో..
తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో..
ఎన్నాళ్ళాకీనాడు విన్నాము సన్నాయి మేళాలు??
మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో..
ఎన్నెన్ని భావాలో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..
ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..
చూశాను ఎన్నడో పరికిణీలో..వచ్చాయి కొత్తగా సొగసులేవో..
హృదయాన దాచిన పొంగులేవో..పరువాన పూచెను వన్నెలేవో!!
వన్నెల వానల్లో..వనరైన జలకాలలో..
వన్నెల వానల్లో..వనరైన జలకాలలో..
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో!!
మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో..ఎన్నెన్ని కౌగిళ్ళో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు..
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో..
ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో..
లాలలాల లాలలా..లాలలాలలా
లాలలాల లాలలా..లాలలాలలా!!(raallallo isakallo)
**************************************   
సుమంగళి
కనులు కనులతో కలబడితే తగవుకు ఫలమేమి
కలలే..
కనులు కనులతో కలబడితే తగవుకు ఫలమేమి
కలలే..
నా కలలో నీవే కనబడితే చొరవకు బలమేమి
మరులే..
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి
మనువు ఊఉ ఊఉ
మనువై ఇద్దరు ఒకటైతే మనుగడ పేరేమి
సంసారం!!
కనులు కనులతో కలబడితే తగవుకు ఫలమేమి
కలలే..ఏఏ ..
అల్లరి ఏదో చేసితిని..చల్లగా మనసే దోచితివి
అల్లరి ఏదో చేసితిని..చల్లగా మనసే దోచితివి
ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం.. నే కొరెను నిన్ను ఇల్లరికం.. లేదు ప్రేమకు పేదరికం.. నే కొరెను నిన్ను ఇల్లరికం..
నింగి నేలకు కడు దూరం.. మన ఇద్దరి కలయిక విడ్డూరం..
కనులు కనులతో కలబడితే తగవుకు ఫలమేమి
కలలే..
నా కలలో నీవే కనబడితే చొరవకు బలమేమి
మరులే..
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి
మనువు ఊఉ ఊఉ
మనువై ఇద్దరు ఒకటైతే మనుగడ పేరేమి
సంసారం!!
కనులు కనులతో కలబడితే తగవుకు ఫలమేమి
కలలే..ఏఏ ..
(kanulu kanulato kalabadite aa tagavuku)
************************************   
ఆకలిరాజ్యం
తన తననన తన తననన తనన ననన తానా తానా తననా..
ఓహో..
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
లల లలలల లల లలలల లలలల లల లల లాలాలా  
అహహా..చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
ఏమంటావ్?? ఉహు..
హు..హు..హు.సంగీతం..
....నా..మ్ మ్ నువ్వయితే..
రి రి.. ..సాహిత్యం..
మ్ మ్ హు..హు..నేనౌతా!!
సంగీతం.. నువ్వయితే..
సాహిత్యం..నేనౌతా!!

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!

సే ఇట్ వన్సెగెన్ 
మ్ మ్ హు..స్వరము నీవై..

తరనన తరరనన
స్వరమున పదము నేనై..ఓకే!!
తానే థానే తాన
ఓహో అలాగా!!
గానం గీతం కాగా!!
తరన తన..
కవిని నేనై..
తానా ననన తాన..
నాలో కవిత నీవై!!
నాననాననా..లలలా..తననా..తారనా..
బ్యుటిఫుల్
కావ్యమైనదీ..తలపో పలుకో మనసో??

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!!
సంగీతం..ఆహహా.. నువ్వయితే..ఆహహా..
సాహిత్యం..ఆహహా..నేనౌతా..ఆహహా!!
ఇప్పుడు చూద్దాం..
తనన తనన తన్నా
మ్ మ్ హు తనన తనన అన్నా!!
తాన తన్న తానం తరనాతనా!!
తాన అన్నా తాళం ఒకటే కదా!!
తనన తాన తాననాన తాన..
ఆహ..అయ్య బాబోయ్!!
తనన తాన తాననాన తాన..
మ్ మ్ పదము చేర్చి పాట కూర్చ లేదా??
శభాష్!!
దనిని దసస అన్నా..
నీద అన్న స్వరమే రాగం కదా??
నీవు నేననీ..అన్నా..మనమే కదా??
నీవు నేననీ..అన్నా..మనమే కదా??

కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి..
చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ??
కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి..
చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ??

మ్ మ్ ఆహాహ లలలా మ్ మ్ హు మ్ మ్ ఆహహ 
లలలా.. లలలా..లలలా.. (kanne pillavani)
*****************************************************   
హే హే హే హే హే హే హే..హే ఏహే..
రు రు రు రు రూరు రూ రూ  రురు..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్..
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..
మన తల్లి అన్నపూర్ణ ..మన అన్న దాన కర్ణ ..మన భూమి వేద భూమిరా.. తమ్ముడూ..
మన కీర్తి మంచు కొండరా.. !!
మన తల్లి అన్నపూర్ణ ..మన అన్న దాన కర్ణ ..మన భూమి వేద భూమిరా.. తమ్ముడూ..
మన కీర్తి మంచు కొండరా.. !!
డిగ్రీలు తెచ్చుకుని,చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము..దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..
బంగారు పంట మనది..మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుతామురా.. ఇంట్లో.. ఈగల్ని తోలుతామురా!!
పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా.. ..
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా??
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..
సంతాన మూళికలం..సంసార భానిసలం..సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ..
సంపాదనొకటి బరువురా.. ..
చదువెయ్య సీటు లేదు..చదివొస్తే పని లేదు..
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్..
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..
(sapaatu yetoo ledu)