సినిమా:భూకైలాష్
రచన:సీనియర్ సముద్రాల
సంగీతం:సుదర్శన్,గోవర్ధన్
గానం:ఎం ఎల్ వసంత కుమారి,ఘంటసాల
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ "మున్నీ"
నీ నాభి కమలాన కొలువు జేసే
వాణీసు భుజపీఠి బరువు వేసి "మున్నీ"
మీనాకృతి దాల్చినావు
వేదాల రక్షింప!
కుర్మాకృతి బూనినావు
వారధి మధియింప!
కిటి రూపము దాల్చినావు
కనకాక్షు వధియింప!
నరసింహమై వెలసినావు
ప్రహ్లాదు రక్షింప!
నతపాల మమునేల జాగేల - పాల "మున్నీ"
మోహినీ విలాన కలిత నవమోహణ
మోహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస మధుర వదన రమానాయక
కోటి చంద్ర కాంతి సదన శ్రీలోల - పాల "మున్నీ"
(Munneeta pavalinchu)
2.రాముని అవతారం
(Raamuni Avataaram)
ద్వారపాలుర మరల దరిదీయు కృపయోరచన:సీనియర్ సముద్రాల
సంగీతం:సుదర్శన్,గోవర్ధన్
గానం:ఎం ఎల్ వసంత కుమారి,ఘంటసాల
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలు చేయ "మున్నీ"
నీ నాభి కమలాన కొలువు జేసే
వాణీసు భుజపీఠి బరువు వేసి "మున్నీ"
మీనాకృతి దాల్చినావు
వేదాల రక్షింప!
కుర్మాకృతి బూనినావు
వారధి మధియింప!
కిటి రూపము దాల్చినావు
కనకాక్షు వధియింప!
నరసింహమై వెలసినావు
ప్రహ్లాదు రక్షింప!
నతపాల మమునేల జాగేల - పాల "మున్నీ"
మోహినీ విలాన కలిత నవమోహణ
మోహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస మధుర వదన రమానాయక
కోటి చంద్ర కాంతి సదన శ్రీలోల - పాల "మున్నీ"
(Munneeta pavalinchu)
2.రాముని అవతారం
(Raamuni Avataaram)
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం
రవికుల సోముని అవతారం "రాముని"
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం "రాముని"
దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు "జన్మింతురు"
లక్ష్మణ శత్రుఘ్న భరత "రాముని'
చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయు సహల్యకు శాపము "అంతము"
ఒసగును సుందర రూపం "రాముని"
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో "దనుజులు"
విరిగెను మిధిలా నగరమున "రాముని'
కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం "నరజాతికి'
గురుజన సేవకు ఆదేశం "రాముని"
అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అడిగిన మరణమె నీ జింక
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్ "రమ్ము"
ముద్రిక కాదిది భువన నిదానం "ముద్రిక"
జీవన్ముక్తికి సోపానం "జీవన్ముక్తి"
రామరామ జయ రామరామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ భక్తాగ్రేసర
అమరం బౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం "రాముని"
3.నీలకంధరా దేవా (Neelakandharaa devaa)
జయ జయ మహాదేవా
శంభో సదాశివా
ఆశ్రిత మందారా
శృతి శిఖర సంచారా
నీలకంధరా దేవా దీన బాంధవా రావా
నన్ను గావరా "నీల"
సత్యసుందరా స్వామి
నిత్య నిర్మలా పాహి "నీల"
అన్యదైవము కొలువా
నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగా
గంగాధరా
దేహియన వరములిడు
దానగుణ సీమా
పాహియన్నను ముక్తి
నిను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణగా
ఏమరక సేయుదును భవతాపహరణా
భవతాపహరణా
నీ దయామయ దృష్టి
దురితమ్ములారా
పర సుధావృష్టి
నా వాంఛ లీడేరా
కరుణించు పరమేశా
దరహాసభాసా
హరహర మహాదేవ
కైలాసవాసా కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా,
నాగభూషణ నన్నుగావక
జాగును సేయకయా
కన్నుల విందుగ భక్తవత్సల
కావగ రావయ్యా "కన్నుల"
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా "ప్రేమ"
శంకరా శివశమరా అభయంకరా
విజయంకరా
No comments:
Post a Comment