Monday, September 3, 2012

మధుమాస వేళలో(madhumaasa Velalo.. Marumalle Totalo)

సినిమా:అందమె ఆనందం

సంగీతం:సత్యం
రచన:దాశరధి
గానం:ఎస్ పి బాలు

మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో

మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
మనసైన చిన్నది.. లేదేలనో
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
ఆఆ..ఆఆఆ..ఆహా..ఆఆఆఆ..ఆఆఆ

ఆడింది పూల కొమ్మ.. పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగే వేళా.. ఆఆఆ..ఆఆ..ఆ ప్రణయాలు పొంగే వేళా
నాలో రగిలే ఎదో జ్వాల
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో

ఉదయించె భానుబింబం.. వికసించలేదు కమలం
నెలరాజు రాక కోసం వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకే నా..ఆఆఆ..ఆఆ.. వలచింది వేదనకే నా
జీవితమంతా దూరాలేనా..
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
మనసైన చిన్నది.. లేదేలనో
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో

No comments:

Post a Comment