Tuesday, September 4, 2012

ఓం! నమో ! నారాయణాయ!(Naaraayana mantram..)

సినిమా:భక్త ప్రహ్లాద
రచన:సీనియర్ సముద్రాల
సంగీతం:ఎస్ రాజేశ్వరరావు
గానం:సుశీల

ఓం! నమో ! నారాయణాయ!

నారాయణా మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణా మంత్రం శ్రీమన్నారాయణ భజనం

భవ బంధాలూ పారద్రోలీ
పరము నొసంగే సాధనం
గాలిని బంధించీ హఠించీ గాసిల పనిలేదు
జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు
మాధవా! మధుసూదనా!అని
మనసున తలచిన చాలుగా

నారాయణా మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లియు తండ్రియు నారాయణుడే!
గురువూ చదువూ నారాయణుడే!
యోగము యాగము నారాయణుడే!
ముక్తియు దాతయు నారాయణుడే!
భవబంధాలూ పారద్రోలీ
పరము నొసంగే సాధనం
నారాయణా మంత్రం శ్రీమన్నారాయణ భజనం

నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!

No comments:

Post a Comment