సినిమా:పాండురంగ మహత్యం
రచన:సముద్రాల సీనియర్
సంగీతం:టి.వి.రాజు
గానం:ఘంటసాల
హే.... కృష్ణా... ముకుందా... మురారీ.
జయకృష్ణా ముకుందా మురారీ "జయ"
జయ గోవింద బృందా విహారీ
దేవికి పంట వసుదేవు వంట "2"
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట "2"
వ్రేపల్లె ఇల్లాయ నంటా
నీ పలుగాకి పనులౌ గోపెమ్మ "2"
కోపించి నిను రోట బంధించెనంట
ఊపున బోయి మాకుల గూలిచి
శాపాలు బాపితివంట "కృష్ణా"
అమ్మా తమ్ముడు మన్ను తినేనూ
చూడమా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఏదన్నా నీ నోరు చూపుమనగా...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గుభువన భాండమ్మల
ఆ రూపము గనిన యశోదకు
తాపమునశియించి
జన్మ ధన్యతగాంచెన్
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా పాప విదారా "కృష్ణా"
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీమ్
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
విజయతే గోపాల చూడామణీ
లలిత లలిత మురళీ స్వరాళీ "లలిత"
పులకిత వనపాలీ గోపాలీ..... పులైత వనపాలీ
విరళీకృత నవరాసకేళీ "2"
వనమాలీ శిఖపింఛమౌళి "2"
కృష్ణా ముకుందా మురారీ
శ్రీ కామినీ కామితాకార
సాకార కారుణ్య ధారా నవాంకూర
అంసార సంతాప నిర్వాపణా-
పాప నిర్వాపణోపాయనామ ప్రశంసానుభావా
భవా భావాహే వాసుదేవా -
సదానంద గోవింద సేవించు మావిందవై
డెందమానంద మొందింప ఎందున్
విచారంబు లేమిన్ - వచోగోచరా గోచరత్వంబు లూహింప లేమైతిమో
దేవా - నీ పాద సేవా దరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదు; శమాదుల్
కడుంజాల నార్జించి భోగేచ్చ వర్జించి నానాతపశ్చర్య తాత్పర్యపర్యాకు
లత్వంబునన్ గైకొనన్ మాకునే యత్నముల్ లేకయే నీ కృపాలోక సంసిద్ధి
సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబుగాదే? జగనాధా హే జగన్నాధ
ఈ రీతి చెన్నార మున్నే రఘల్ నిను గన్నార కన్నారు - నా
కన్నులెనంగ యే పుణ్యముల్ జేసినో నిన్నుదర్శింపగా - నా
కల్యాణ నానాగుణ శ్రీ సముద్భ్ సింతాంగా - దయాపూర
రంగత్తరంగాంతరంగా నమో రుక్మిణీసంగా
హేపాండురంగా.... హే పాండురంగ
నమస్తే - నమస్తే - నమ:
No comments:
Post a Comment