Monday, September 3, 2012

ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి (vurakalai Godaavari Urike Naa Odiloniki )

సినిమా:అభిలాష

గానం:ఎస్ పి బాలు,ఎస్ జానకి

ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి
సొగసులై బృందావనీ విరిసే నా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపే మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ

నీప్రణయ భావం నా జీవరాగం
నీప్రణయ భావం నా జీవరాగం
రాగాలూ తెలిపే భావాలూ నిజమైనవీ
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవీ
అనురాగ రాగాలా స్వరలోకమే మనదైనదీ

ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపే మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనదీ
నీ వన్న మనిషే ఈనాడూ నాదైనదీ
ఒక గుండే అభిలాషా పదిమందికి బ్రతుకైనదీ

ఉరకలై గోదావరి ఉరికే నా ఒడిలోనికి
సొగసులై బృందావనీ విరిసే నా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపే మురళీ
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ

No comments:

Post a Comment