Tuesday, October 23, 2012

అనురాగ దేవత

చూసుకో పదిలంగా
హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన

వికసించే పూలు ముళ్ళు విధి రాతకు ఆనవాళ్ళు(2)
ఒకరి కంట పన్నీరైనా ఒకరి కంట కన్నీళ్లు(2)
ఎండమావి నీరు తాగి గుండె మంటలార్చుకోకు(2)
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం(చూసుకో)

కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావ మీద(2)
ఎవరు తోడూ ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే(2)
సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి(2)
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడి గుండాలు(చూసుకో)
chusuko padilamga
 **************************

అందాల హృదయమా అనురాగ నిలయమా
నీ గుండెలోని
తొలిపాట వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట...........
ఏపాటకైనా
కావాలి రాగము
ఏ జంటకైనా కలవాలి యోగము
జీవితమెంతో తీయనైనది
మనసున మమతే మాసిపోనిది
తెలిసే నీతో సహవాసం
వలచే వారికి సందేశం


అందాల హృదయమా అనురాగ నిలయమా

మనసున్న వారికే మమతానుబంధాలు
కనులున్న వారికే కనిపించు అందాలు
అందరి సుఖమే
నీదనుకుంటే
నవ్వుతు కాలం గడిపేస్తుంటే
ప్రతి ఋతువు ఒక వసంతం
ప్రతి బతుకు ఒక మధుగీతం
అందాల హృదయమా అనురాగ నిలయమా

andala hrudayamaa anuraga

No comments:

Post a Comment