Tuesday, October 23, 2012

మాతృదేవత

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..(మనసే)

ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం(2)
కలకాలం మది నిండాలి
కలలన్నీ పండాలి(2)
మన కలలన్నీ పండాలి(మనసే)

ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగా పొందాను(2)
ప్రతీ రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేను(2)(మనసే)

నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో(2)
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి(2)(మనసే)

manase kovelagaa mamatalu mallelugaa

No comments:

Post a Comment