ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి (2)
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
పతి దేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన (2)
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ(2)
మగువేగా మగవానికి మధుర భావన
సేవలతో అత్త మామ సంతసించగా
పది మందిని ఆదరించు కల్పవల్లిగా(2)
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాసే దేవతగా(2)
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా
aalayaana velasina aa devuni reeti
******************************
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
నీ చూపుతో నన్ను ముడి వేయకు
ఈ పూలు వింటాయి సడి చేయకు
నీ చూపుతో నన్ను ముడి వేయకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట లాగి కవ్వించకు (2)
అనువైన వేళ అందాలు దాచకు (2)
ఆణువణువు నిన్నే కోరే మురిపించకు
ఇకనైన నును సిగ్గు తేర వేయకు
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మంత్రించకు (2)
మనలోని ప్రేమ మారాకు వేయనీ(2)
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ
kannullo misamisalu kanipinchanee
********************************
తొలివలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
తొలివలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే
ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం నా మనసున మీకై నోచిన పూచిన కానుకలు
నీ కనుల వేలిగెనే దీపాలు మీ ప్రతిరూపాలు(2)
మన అనురాగానికి హారతులు
ఏల ఈ వేళ కడు వింతగా దోచే తీయగా హాయిగా ఈ జగము
యవ్వనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము
ఈ రేయి పలికెలే స్వాగతము ఈనాడే బ్రతుకున శుభదినము(2)
ఈ తనువే మనకిక చెరిసగము
tolivalape pade pade piliche
*********************************
బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే.. తలచేది జరుగదు...జరిగేది తెలియదు..
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా(2)
గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక
అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాశ చేసి పాతాళ లోకాన తోసేవులే....
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు హాలాహల జ్వాల చేసేవులే
ఆనంద నౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే
bommanu chesi pranamu posi
No comments:
Post a Comment