Monday, October 22, 2012

ఆచార్య ఆత్రేయ పాటలు (priyatama..naa hrudayamaa)

ప్రియతమా నా హృదయమా(2)
ప్రేమకే ప్రతిరూపమా(2)
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయలాగ జత చేరినావు
నువ్వు లేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ

నీ పెదవి పైన వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమ
priyatama..naa hrudayamaa


No comments:

Post a Comment