Tuesday, August 16, 2011

అష్టలక్ష్మీ స్తోత్రం(Asta Lakshmi stotram)


ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదమతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరి పాలయమామ్ || 1 ||
ధాన్యలక్ష్మి
ఆయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయమామ్ || 2 ||
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరి పాలయమామ్ || 3 ||
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయమామ్ || 4 ||
సంతానలక్ష్మి
అయిగజ వాహిని మోహిని చక్రణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి, సప్తస్వర భూషిత గాన నుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుగే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయమామ్ || 5 ||
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞాన వికాసని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకర దేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయమామ్ || 6 ||
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హాస్యయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ పరిపాలయమామ్ || 7 ||
ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి, దుంధుభి నాద పూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యమతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయమామ్ || 8 ||
ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని
శ్లో|| శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||

అన్నపూర్ణాష్టకం(annpurnaastakam)


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||
అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||
సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే || 13 ||

Friday, August 12, 2011

నా జాన పదం

రచన:హలీమ
గానం:హలీమ
 
వల్లకాదురో మామా నేనొల్లలేను రామా 
వల్లా కాదురో మామ నేనొల్లలేను రామా
కల్లు మానరా వొళ్ళు వంచరా ఇల్లు నడుపుతూ నువ్ సల్లాగుండరా..  .  (వల్ల)

తిండికి మాత్రం తిమ్మరాజువే పనులు చేయ నువ్ సోమరోడివే..౨
మాటలు కోటలు దాటిస్తావు... చేతలు గడపను దాటవాయెరా ..
ఇలా అయితే మరీ ..     (వల్ల)

ఇద్దరు కలిసి కలలు కందమూ..నిజము చేయ మరి పాటు పడదమూ...౨
నీతిగా మనమే నిలబడదాము..  కమ్మని బ్రతుకును పండిద్దాము..
అలా అయితే మరీ...

హాయి మనదేలే మామా సుఖశాంతి  మనకేలే మామా ..౨
పిల్లల పెద్దల ప్రేమను పొంది అందరినీ మనమాదరిద్దమూ..
 

 

Saturday, July 30, 2011

నేను రాసిన తొలి పాట

రచన:హలీమ
గానం:హలీమ
 
ఏ దేవుని వరమో నీవు  ఏ పూజల ఫలమో నీవు
ఏ జన్మల బంధం నీవు తెలుసునా
నా గుండెకు ఊపిరి నీవు నా ఆశల కిరణం నీవు
నా తారక మంత్రం నీవు తెలుసునా
ఎన్నెన్నో ఊహలు ఏవేవో ఊసులు ఎదురొచ్చి నిలిచెను తెలుసునా
ఎగసోచ్చేఅలలపై రాగాలై పలికెను నాలోని ఆశలూ తెలుసునా..(ఏ దేవుని)
 
ఏదో విధమైన అలజడి రేగెను మదిలోన ఏమో ఆ సందడి తెలుసునా
నీతో చెప్పాలని నా మనసే ఉరకలు వేస్తుంది  ఏమో ఆ సంగతీ తెలుసునా
మనసే కలవరమాయే మది ఆశల సాగరమాయే....౨
నీలి మేఘాల పల్లకిలో ఊహలుయ్యాలలూగాలిలే...(ఏ దేవుని)

 

Friday, July 29, 2011

మైకం మబ్బేసి

రచన:హలీమ
గానం:హలీమ

మైకం మబ్బేసి మోహం మాటేసి మనసును ముంచేసింది
చూపులు కట్టేసి ఊపిరి లాగేసి గుండెను పిండేసింది..
ఏమిటిదీ ఏమిటిదీ ఏదో తెలియని తహతహని
ఎందుకనీ ఎందుకనీ లోకం తెలియని తికమకనీ (మైకం)

తెలియక చేసిన నేరం చేసెను బ్రతుకును ఓ పెనుభారం
చేతులు కలిపిన స్నేహం చివరకు చేసిందేమో ద్రోహం
మచ్చలేని చంద్రుడంటూ ఎక్కడైన ఉంటాడా  ..
మమతలన్ని దూరమైతే మనిషి తేరుకుంటాడా  ..       
మనసులేని మనిషిగ మిగిలి మరణం కోరుకుంటాడా  ...(మైకం)


        

చిట్టీ పొట్టీ చిన్నారి పాప

రచన:హలీమ
గానం:హలీమ

చిట్టీ పొట్టీ చిన్నారి పాపకు చిరునవ్వే అందమూ
చిన్నారి చిట్టి తల్లి అలకలింక అందమూ..అలకలింక అందము   
చిట్టీ పొట్టీ చిన్నారి పాపకు చిరునవ్వే అందమూ

డూ డూ డూడూ బసవడు తువ్వాయి లేగలు
మా పాప గెంతులను చిన్నబోయి చూద్దురూ
చిన్నారి పొన్నారి చిలుకలు సింగారీ నెమలులు
మా పాపా పలుకులను మూగబోయి విందురూ..మూగబోయి విందురు     ''చిట్టీ"

పారాడుతుంటే పాపాయి యింటా పసిడి పంట పండును  
చిరునవ్వుల రత్నాలు వేనవేలు కురియును
జాబిల్లి పాడేసి జోలపాట తన నిద్దుర మరిచెను
ఏ కన్నూ సోకకుండా మబ్బు దిష్టి తీసెను..      ''చిట్టీ"






 

కాదన్నా కలలు రేపు

రచన:హలీమ
గానం:హలీమ

కాదన్నా కలలు రేపు  కాలాన్నే కదలనీకు
మనసంతా మాయ నింపు మౌనాన్నే రాసి పంపు
చిలుక చిలుకా చిగురాకు చాటు పలుకా
చినుక చినుకా మరుమల్లె మేలుకొలుపా......''కాదన్నా''

ఉషషుతో మనసంతా వుషారుగా మారేనంట.. 
వసంతమే నా వెంట వయారమై తరిమేనంట..
మాటలన్నీ పాటలంట ...మరపురాని రంగులంట..
నింగి నేల కలిపే ఊయల ఊగుతోంది మనసంతా......''కాదన్నా''

లోకాన్నే చుట్టోద్దాము ఆకాశం ఎక్కేద్దాము
అవతలేపు ఏముంటుందో ఒక్కసారి చూసోద్దాము
కొత్తలోకం ఎక్కడున్నా కొల్లగొట్టి వచ్చేద్దాము ..
మన భూమిని మించిన స్వర్గం వేరేలేదని చాటేద్దాము  ...''కాదన్నా''