Wednesday, December 21, 2011

వీణ పాటలు

1.
సినిమా:కురుక్షేత్రం
రచన:సి నారాయణ రెడ్డి
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గానం : బాలు,పి సుశీల

  .. .. హా హా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..

..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..

పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో..
నీలిమబ్బుపైనే లిఖియించిన లేఖలందుకున్నావో??
లేఖలే వివరించగా..రసలేఖలే ఉదయించగా..
లేఖలే వివరించగా..రసలేఖలే ఉదయించగా..
కల వరించి..కవరించి..
కల వరించి..కవరించి..
పులకిత తనులత నిను చేరుకోగా!!

మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..

మత్స కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా..
మయురాంగనలు ఆటవెలదులై లయల హరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా.. దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా.. దైవమే కరుణించగా..
సుమశరుడే పురోహితుడై..సుమశరుడే పురోహితుడై..
శుభముహూర్తమే నిర్ణయించగా!!
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలోనా..
మ్రోగింది కళ్యాణ వీణా..మ్రోగింది కళ్యాణ వీణా..
2.
సినిమా:కటకటాల రుద్రయ్య
రచన:వేటూరి
సంగీతం:జెవి రాఘవులు
గానం: బాలు,పి సుశీల


 
ఆఆఆఆఆఅ.....ఆఆ..ఆఅ....ఆఆఆ...ఆఆ..ఆ..
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది
పూవు నాది పూత నీది ఆకు  చాటు అందముంది (వీణ)


తొలిపొద్దు ముద్దాడగానే   ఎరుపెక్కే తూరుపు దిక్కు
చెలిచూపు రాచాడగానే వలపొక్కటే వయసు దిక్కు
వరదల్లె వాటేసి మనసల్లె మాటేసి వయసల్లె కాటేస్తే చిక్కు
తీపి ముద్దిచ్చి తీర్చాలి మొక్కు                            (వీణ)

మబ్బుల్లో మెరుపల్లె కాదు.. వలపు వాన కురిసి వెలిసి పోదు
మనసంటే మాటలు కాదు అది మాట ఇస్తే మరచి పోదు
బ్రతుకల్లె జత గూడి, వలపల్లె వొనగూడి వొడిలోనే గుడి కట్టే దిక్కు
నా గుడి దీపమై నాకు దక్కు                                     (వీణ)


3.
సినిమా:ప్రేమించు పెళ్ళాడు
రచన:వేటూరి
సంగీతం:ఇళయ రాజ
గానం: బాలు,జానకి
 

చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ

విడిపోలేనీ విరి తీవెలలో
ఉరులే మరులై పోతుంటే హోయ్
ఎడబాటేదీ ఎదలోతులలో 
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ

గళమే పాడె అల కోయిలలే
వలచీ తెలిపే నా గీతం హోయ్
నదులై సాగే ఋతు శోభలలే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే హోయ్
వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపనా
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలో చేసే ప్రేమాలాపనా
4.
సినిమా:ఆత్మీయులు
రచన:దాశరధి
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గాయని: పి సుశీల

ఆఆఅ .ఆఆఅ..ఆఅఆ ..ఆఆ ..ఆఅ
ఓ.. ఓ ఓ ఓ ..ఓ ఓ ఓ ...ఓ ఓ ఓ ....
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నోచెలరేగే
కలనైన కానని ఆనందం ఇలలోన విరిసే ఈ నాదే (మదిలో)

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది...-౨
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది...(మదిలో)

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరెను...-౨
అందాల తారయై మెరిసి చెలి కాని చెంత చేరెను..(మదిలో)

రాధలోని అనురాగామంతా మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే...(మదిలో)


5.
సినిమా:పంతులమ్మ 
రచన:వేటూరి 
సంగీతం:రాజన్ నాగేంద్ర
గానం: బాలు,పి సుశీల

మానస వీణా మధు గీతం
మన సంసారం సంగీతం
సాగర మదనం అమృత మధురం
సంగమ సరిగమ నవ పారిజాతం (మానస)

ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయ సరాగం
ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిశాంతాల
సుమసుగంధాల బ్రమర నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే.(మానస)
జాబిలి కన్నా నా చెలి మిన్న.. పులకింతలకే పూచినా పొన్న ..
కానుకలేమి నేనివ్వగలను.. కన్నుల కాటుక నేనవ్వగలను..
పాల కడలిలా వెన్నెల పొంగింది ...
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాలా నిను చేరగలనో..
మనసున మమతై కడ తేరగలను ..   (మానస)

కురిసే దాక అనుకోలేదు శ్రావణ మేఘమని ...
తడిసే దాక అనుకోలేదు తీరని దాహమని ...
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమని ...(మానస)

6.
సినిమా : జమిందారు గారి అమ్మాయి
రచన: దాశరధి
సంగీతం: జి కే వెంకటేష్
గాయని:పి సుశీల

మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే (మ్రోగింది)

ఆధారాల మీద ఆడింది నాదం కనుపాపలందు కదిలింది రూపం...
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే...(మ్రోగింది)

సిరిమల్లె పువ్వు కురిపించి  నవ్వు..నెలరాజు అందం వేసింది బంధం..
ఆ బంధమే మరీ మరీ ఆనందమే ...(మ్రోగింది)
7.
సినిమా:ప్రేమ నగర్
రచన:ఆచార్య ఆత్రేయ
సంగీతం:కే వి మహదేవన్
గానం: పి సుశీల
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి ..


మూల దాగి ధూళి మూగి మూగవోయిన మధుర వీణ ..౨
మరచిపోయిన మమత లాగా..౨
మమతలుడికిన మనసులాగా...మాసిపో తగునా....ఎవరో రావాలి..
 
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో ...౨
కొనగోట మీటిన చాలు...౨
నీలో కోటి స్వరములు పలుకును ..ఎవరో రావాలి

రాచ నగరున వెలసినావు రసపిపాసకు నోచినావు...౨
శక్తి మరచి రక్తి విడచి ...౨
మత్తు ఏదో మరగినావు...మరచిపో తగునా....


ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి ..

8.
సినిమా :డాక్టర్ చక్రవర్తి
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎస్ రాజేశ్వర రావు
గానం :పి సుశీల

పాడమని నన్నడగవలెనా..పరవశించి పాడనా...నేనే పరవశించి పాడనా...(పాడమని)

నీవు పెంచిన హృదయమే...ఇది నీవు నేర్పిన గానమే..౨
నీకు గాక ఎవరి కొరకు...నీవు వింటే చాలు నాకు..(పాడమని)

చిన్ననాటి ఆశలే...ఈనాడు పూచెను పూవులై...2
ఆ పూవులన్నీ మాటలై ...వినిపించు నీకు పాటలై..(పాడమని)


ఈ వీణ మ్రోగక ఆగినా...నే పాడజాలకపోయినా...౨
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ...అనురాగమటులే  ఉండనీ....(పాడమని)

9.
సినిమా :డాక్టర్ చక్రవర్తి
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎస్ రాజేశ్వర రావు
గానం :పి సుశీల


ఊ హు హు హు ఊ ఉ హు  ఊ ఊ ఊ ఊ ..
నీవు లేక వీణ పలుక లేనన్నది ..నీవు రాక రాధా నిలువలేనన్నది...ఆ....(నీవు)


జాజి పూలు నీకై రోజు రోజు పూచే..చూచి చూచి పాపం సోమ్మసిల్లిపోయే..
చందమామ నీకై తొంగి తొంగి చూచే...౨ సరసన లేవని అలుకలుబోయే...(నీవు)


కలలనైన నిన్ను కనుల చూతమన్న ...నిదుర రాని నాకు కలలు కూడా రావే...
కదలలేని కాలం విరహ గీతి రీతి..౨ పరువము వృధగా బరువుగా సాగే..(నీవు)


తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను..తలపులెన్నో మదిలో దాచి వేచినాను.
తాపమింక నేను ఓపలేను స్వామి ...౨ తరుణిని కరుణను ఏలగా రావా...(నీవు)


10.
సినిమా:నర్తనశాల
రచన:సముద్రాల
సంగీతం:సుసర్ల దక్షిణా మూర్తి
గానం:సుశీల

సఖియా...వివరించవే...వగలెరిగిన చెలునికి నా కధా..(సఖియా)

నిన్ను జూచి కనులు చెదరి ...కన్నె మనసు కానుక జేసి..౨
మరువలేక మనసు రాక...విరహాన చెలికాన వేగేనని..(సఖియా)

మల్లెపూల మనసు దోచి..పిల్లగాలి వీచేవేళా..ఆ...ఆ...2
చలువలేని వెలుగులోన..సరసాల సరదాలు తీరేనని...(సఖియా)

 11.
సినిమా:పూల రంగడు
రచన్:దాశరధి
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గానం:సుశీల

నీవు రావు ...నిదుర రాదు...నిలిచిపోయే ఈ రేయి...(నీవు)

తారా జాబిలి ఒకటై సరసమాడే ఆ రేయి...2
చింతా చీకటి ఒకటై ..చిన్నబోయే ఈ రేయి...(నీవు)


ఆశలు మదిలో విరిసి..దోసిటా విరులై కురిసే..
ఆలయాన చేరి చూడా..౨ స్వామి కానరాడాయే..
నా స్వామి కానరాడాయే (నీవు)


కౌగిలిలో ఒదిగిపోయి కలలుగనే వేళాయే...౨
ఎదురు చూచి ఎదురు చూచి కన్నుదోయి అలసిపోయే..(నీవు)

12.
సినిమా:భార్యాభర్తలు
రచన:శ్రీ శ్రీ
సంగీతం:ఎస్ రాజేశ్వర రావు
గానం:సుశీల

ఏమని పాడెదనో ఈ వేళా...మానస వీణా మౌనముగా నిదురించిన వేళా..(ఏమని)
జగమే మరచి..హృదయ విపంచి..౨
గారడిగా వినువీధి చరించి..౨
కలత నిదురలో కాంచిన కలలే..గాలిమేడలై కూలిన వేళా...౨ (ఏమని)

వన సీమలలో హాయిగా ఆడే..౨ రాచిలుకా నిను రాణిని చేసే..౨
పసిడి తీగలా పంజరమిదిగో ..పలుకవేమని పిలిచే వేళా...౨ (ఏమని)

13.
సినిమా:చక్రవాకం
రచన:ఆచార్య ఆత్రేయ
సంగీతం:కే వి మహదేవన్
గానం:సుశీల

వీణలోనా..తీగలోనా...ఎక్కడున్నది రాగము..
అది ఎలాగైనది రాగము..వీణలోనా..తీగలోనా...

మాటలోనా...మనసులోన..ఎక్కడున్నది భావమూ...అది ఎలాగైనది రాగము..
నాదమునకు స్వరమే రాగము..మనసులోని మాటే భావము..
రాగాభాములేకమైనవి..రమ్యమైన గానము .. (వీణలోన)


గతజన్మ శ్రుతి చేసుకున్నది...అది ఈ జన్మ సంగీతమైనది.
సరిగమ..పదనిస..నిదమగారిసా..
రాగాల ఆరోహనావరోహమైనది..అనురాగ హృదయాల అన్వేషనైనది..(వీణలోన)

గుండెలోన..గొంతులోనా...ఎక్కడున్నది ఆవేదనా..అది ఏలాగవును సాధనా..
గీతమునకు బలమే వేదనా... రాగమునకు మెరుగే సాధనా..
గుండె గొంతుకలేకమైనవి ...నిండు రాగాలాపనా...(వీణలోనా)
 

No comments:

Post a Comment