Sunday, August 5, 2012

మాతృ దేవో భవ:వేణువై వచ్చాను(venuvai vachaanu bhuvanaaniki),రాలిపోయే పువ్వా..నీకు రాగాలెందుకే..(raalipoye puvvaa..neeku raagaalenduke..)

సినిమా:మాతృ దేవో భవ
రచన:వేటూరి
సంగీతం:కీరవాణి
గానం:చిత్ర

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే
హరీ! హరీ!హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు
హరీ!హరీ!హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికీ..

 *******************

సినిమా:మాతృ దేవో భవ
రచన:వేటూరి
సంగీతం:కీరవాణి
గానం:కీరవాణి

రాలిపోయే పువ్వా..నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడులే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో చీకటాయేలే ..
నీకిది తెలవారని రేయమ్మాఆ..
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం..
రాలిపోయే పువ్వా..నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడులే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో చీకటాయేలే ..

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా..
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆ..ఆ..
తనవాడు తారల్లో చేరగా మనసు మంగళ్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా..
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నలవై
కరిగే కర్పూరం నీవై..ఆశలకే హారతివై..
రాలిపోయే పువ్వా..నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడులే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..

అనుబంధమంటేనే అప్పులే..కరిగే బంధాలన్నీ మబ్బులే..
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే..ఆ ఆ..
తన రంగు మారింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే..
పగిలే ఆకాశము నీవై..జారిపడే జాబిలివై..
మిగిలే ఆలాపన నీవై..తీగ తెగే వీణియవై..
రాలిపోయే పువ్వా..నీకు రాగాలెందుకే..
తోటమాలి నీ తోడు లేడులే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
లోకమెన్నడో చీకటాయేలే ..

No comments:

Post a Comment