Friday, March 9, 2012

సత్యం సంగీతంలో..

సినిమా : స్వయంవరం
రచన : రాజశ్రీ
సంగీతం : సత్యం
గానం:బాలు,సుశీల

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..
రారమ్మని పిలిచే పైబడీ.. (ఆకాశం ఎందుకో)

పసుపుపచ్చ లోగిలిలో పసుముకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలిలో పసుబార బోసినట్టు
పాదాల పారాణి అద్దినట్టూ..
నుదుటిపై కుంకుమా దిద్దినట్టూ..(ఆకాశం ఎందుకో)

పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి పోసినట్టూ..
కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..(ఆకాశం ఎందుకో)

(aakaasam yenduko pachchabaddadi)
































































No comments:

Post a Comment