Wednesday, March 7, 2012

వేటూరి పాటలు

వేటగాడు
ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే..
ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే!!

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

గోడ చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే..
గోడ చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే..

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

ముద్దిచ్చీ చినుకు ముత్యమైపోతుంటే..అహ అహ.. అహ అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే..అహ అహ.. అహ అహ

చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే..
చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే..

చినుకు నీమెడలో నగలాగ నవ్వుతుంటే!!

నీ మాట విని మబ్బు మెరిసే..
అహ..జడి వానలే కురిసీ.. కురిసీ..
వళ్ళు తడిసీ..వెల్లీ విరిసీ..
వలపు సరిగంగ తానాలు చెయ్యాలి!!
అహ అహ.. అహ అహ అహ అహ.. అహ అహ

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే.
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

మై మరచి మెరుపు నిన్నల్లుకుంటుంటే..అహ అహ.. అహ అహ
ఎదలోన మెరుపు పొదరిల్లు కడుతుంటే..అహ అహ.. అహ అహ

మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే..

అహ.. నీ పాట విని మెరుపులోచ్చీ..
అహ.. నీ విరిపూలే ముడుపులిచ్చీ..
చలిని పెంచీ.. చెలిమి పంచీ..
తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి..
అహ అహ.. అహ అహ అహ అహ.. అహ అహ

ఆకు చాటు పింద తడిసే.. అహ అహ అహ అహ..
కోకమాటు పింద తడిసే..అహ అహ అహ అహ..

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే..
ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..
గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

**************************************
వయసు పిలిచింది 
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా??
నీ ముద్దు ముచ్చట కాదంటానా?సరదా పడితే వద్దంటానా??
హయ్ యా!!

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా??
నీ ముద్దు ముచ్చట కాదంటానా?సరదా పడితే వద్దంటానా??
హయ్ యా!!

నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ..
నీ పూజకై కర్పూరమై వెలిగింది నా మనసూ..
నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ..
నీ పూజకై కర్పూరమై వెలిగింది నా మనసూ..

దాచినదంతా నీ కొరకే..దాచినదంతా నీ కొరకే..

నీ కోరిక చూస్తే.. నను తొందర చేసే..
నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది..నాలో ఏదో అవుతుంది!!

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా??
నీ ముద్దు ముచ్చట కాదంటానా?సరదా పడితే వద్దంటానా??
హయ్ యా!!

నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే..
అనుభవం పరవశం సంగీతమై పలికే..

పరుగులు తీసే నా పరువం..పరుగులు తీసే నా పరువం..
కథలే విందీ..నువ్వు కావాలంది..
నా మాటే వినకుంది నీకూ నాకే జోడంది..

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా??
నీ ముద్దు ముచ్చట కాదంటానా?సరదా పడితే వద్దంటానా??
హయ్ యా!!

రరర రా రరర రా 

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా??
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా??
నీ ముద్దు ముచ్చట కాదంటానా?సరదా పడితే వద్దంటానా??
హయ్ యా!!
 ****************************
హే..ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గా
అరె..ముట్టుకుంటే ముడుసుకుంటావ్.. ఇంత సిగ్గా!

మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే..
ఊరు నిదరోయిందిలే..మంచిసోటే మనకు కుదిరిందిలే..
మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే..

కురిసే సన్నని వాన..చలి చలిగా ఉన్నది లోన..
కురిసే సన్నని వాన..చలి చలిగా ఉన్నది లోన..
గుబులౌతుందిలే గుండెల్లోనా
జరగనా కొంచెం..నేనడగనా లంచం..
చలికి తలలు వంచం..నీ వొళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందామూ.. మనమూ..

హే..పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే..

మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే..

పండే పచ్చని నేలా..అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా..అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే..వయసు తడిస్తే..
పులకరించు నేల..అది తొలకరించువేళ..
తెలుసుకో పిల్లా.. బిడియమేలా మళ్ళా..
ఉరికే పరువమిదీ..మనదీ..

హే..కాపుకొస్తే..కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా

మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే..

నవ్వని పువ్వే నువ్వు..నునువెచ్చని తేనలు ఇవ్వు
నవ్వని పువ్వే నువ్వు..నునువెచ్చని తేనలు ఇవ్వు
దాగదు మనసే..ఆగదు వయసే..
ఎరగదే పొద్దు..అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దు..ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ..కానీ..

హే..బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ..
రాతిరంతా జాగారమే చేసుకోనీ..

మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే..
ఊరు నిదరోయిందిలే..మంచిసోటే మనకు కుదిరిందిలే..
మంచిసోటే మనకు కుదిరిందిలే..

 ************************************
 శుభోదయం

కంచికి పోతవా కృష్ణమ్మా.. .. కంచి వార్తలేమి  కృష్ణమ్మా
కంచికి పోతవా కృష్ణమ్మా కంచి వార్తలేమి  కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతవా కృష్ణమ్మా కంచి వార్తలేమి  కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతవా కృష్ణమ్మా.. ..
..ఉఉఉ ..
త్యాగరాయకీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ..రాగమేదో తీసినట్టు ఉందమ్మా

త్యాగరాయకీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ..రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వులు పూసిందీ కొమ్మ..మువ్వ గోపాలా..మువ్వ గోపాలా..
మువ్వ గోపాలా..అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వడి కావమ్మా అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
అడుగుల సవ్వడి కావమ్మా అవి ఎడదలో సందళ్ళు లేవమ్మా
కంచికి పోతవా కృష్ణమ్మా కంచి వార్తలేమి  కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతవా కృష్ణమ్మా.. ..
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా..రాతిరేళకంత నిదుర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా..రాతిరేళకంత నిదుర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ..ముద్దుమురిపాలా..
మువ్వగోపాలా..నీవురావేలా..అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా..
మనసు దోచుకున్న ఓయమ్మా..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా..
కంచికి పోతవా కృష్ణమ్మా..
ముద్దుమురిపాలా..
కంచి వార్తలేమి  కృష్ణమ్మా
మువ్వగోపాలా..
కంచిలో ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
నీవు రావేలా..

**************************************************
శ్రీవారికి ప్రేమలేఖ
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో..జో..
నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ..
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు

తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి 
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
 ****************************************
సితార
తననననన తననననన..
తననననన తననననన..
తననననన తననననన..తననననన
చమకు చమకు జింజిన జింజిన చమకు చమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
జమకు జమకు జింజిన జింజిన జమకు జమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై..
కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..
పచ్చని చేలా ...తనననన
పావడగట్టి..తనననన
పచ్చని చేలా పావడగట్టి
కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
ఎండలకన్నే సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవపాణి..
కోటను విడిచీ..పేటను విడిచీ..
కోటను విడిచీ..పేటను విడిచీ..
కన్నులా గంగా పొంగే వేళా..
నదిలా తానే సాగే వేళ..రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
రాగాల రాదారి పూదారి ఔతుంటే!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
మాగాణమ్మా చీరలు నేసే..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా
మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా
గడప దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే..
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై..
కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..
పచ్చని చేలా ...తనననన
పావడగట్టి..తనననన
పచ్చని చేలా పావడగట్టి
కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!!
వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!!
***************************************
..
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా..మైనా..
కిలకిల నగవుల వలపులు చిలికిన మైనా..మైనా..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
మధువుల పెదవుల మమతలు విరిసిన మైనా.. మైనా..
కలలను పెంచకు కలతలు దాచకు మైనా.. మైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా..మైనా..
కిలకిల నగవుల వలపులు చిలికిన మైనా..మైనా..
అడగనులే చిరునామా మైనా.. మైనా..
చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా.. నాకైనా..
తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ..
తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ..
హరివిల్లు రంగుల్లో అందాలే..
చిలికిన చిలకవు,ఉలకవు పలకవు. మైనా.. మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా..మైనా..
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా..
మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా..
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ..
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ..
వినువీధి వీణంలో రాగంలా..
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఈమైనా..
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా..మైనా..
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా..
మిల మిల మెరిసిన తార..మిన్నులవిడిన తార..
గుడికే చేరని దీపం..పడమటి సంధ్యా రాగం..
మధువుల పెదవుల మమతలు విరిసిన మైనా.. మైనా..
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా..మైనా..
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా..మైనా!!

*****************************************

సిరిసిరిమువ్వ

ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..
తనువూగింది వేళా..
చెలరేగింది ఒక రాసలీల..
ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..
తనువూగింది వేళా..
చెలరేగింది ఒక రాసలీల..
ఎదలోని సొదలా..ఎలదేటి రొదలా..
కదిలేటి నదిలా..కలల వరదలా..
ఎదలోని సొదలా..ఎలదేటి రొదలా..
కదిలేటి నదిలా..కలల వరదలా..
చలిత లలిత పద కలిత కవితలెగ
సరిగమ పలికించగా..
స్వర మధురిమ లొలికించగా..
సిరిసిరి మువ్వలు పులకించగా..
ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..
తనువూగింది వేళా..
చెలరేగింది ఒక రాసలీల..
నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి..
నటియించు నీవని తెలిసీ..
నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి..
నటియించు నీవని తెలిసీ..
ఆకాశమై పొంగె ఆవేశం..
కైలాసమే వంగె నీ కోసం
ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..
మెరుపుంది నాలో..అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో.. అది నీ మువ్వ పిలుపు..
చినుకు చినుకులో, చిందు లయలతో..
కురిసింది తొలకరి జల్లు..
విరిసింది అందాల హరివిల్లు..
పొంగులే ఏడు రంగులుగా..
ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..
తనువూగింది వేళా..
చెలరేగింది ఒక రాసలీల..
****************************
సింహబలుడు

సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయె, పడుచు గొడవ వినవేరా??

సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
కన్ను కన్ను గీటుతుంటే,సన్న సన్న మంట రేగే,కలికి చిలుక ఇటురావే??
హాయ్ హాయ్..ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు.
మగతనం చూపావు..నాలోని ఆడతనాన్ని నిద్ర లేపావు!!

రేయి తెల్లారి చల్లారి పోతుందిరా.. రా రా నా దొర..
తీగ అల్లాడి అల్లాడి పోతుందిరా..రా రా సుందరా!!  

ఒకటున్నది నీలో, ఒడుపున్నది నాలో..
అది ఉన్నదీ..లేనిదీ, హా తెలుకుకో!!

మెరుపున్నది నాలో,ఉరుమున్నది నీలో
అది నీదనీ,ఇది నాడనీ..హా మరచి పో!!

సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..

ద్వీపానికి దీపానికి నువ్వు, లంకకే నెలవంకవి నువ్వు..

మల్లెపువ్వంటి రవ్వంటి మనసుందిలే,మగ తోడుందిలే..
చింతచిగురంటి పొగరుంది వగరుందిలే,సెగ రేగిందిలే..

వలపున్నది నాలో, వల ఉన్నది నీలో..
పట్టుని, విడుపునే, హా కోరుకో..

సగమున్నది నాలో,సగమున్నది నీలో
రెంటినీ జంటగా మలుచుకో..హోయ్..
హా..సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా??
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే, వగలమారి సెగలు పుట్ట్, వలపు పిలుపు విని పోయే..

సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..
సన్నజాజులోయ్.... కన్నె మోజులోయ్..

**********************************
శివరంజని

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..

నీ..వయసే వసంత ఋతువై..నీ మనసే జీవన మధువై..
నీ వయసే వసంత ఋతువై..నీ మనసే జీవన మధువై..
నీ పెదవే నా పల్లవిగా..నీ నగవే సిగమల్లికగా..
చెరిసగమై.. సగమేదో మరచిన మన తొలి కలయికలో ..

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..

నీ..ఒడిలో వలపును నేనై..నీ గుడిలో వెలుగే నేనై..
నీ ఒడిలో వలపును నేనై..నీ గుడిలో వెలుగే నేనై..

అందాల హారతిగా..అందించే పార్వతిగా..
మనమొకటై..రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో..

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతిరేయి..
కార్తిక పున్నమి రేయి!!

నవమినాటి వెన్నెల నేను..
దశమినాటి జాబిలి నీవు!!

*****************************************************
ఆదిత్య 369

.. .. .. ..
నెర జాణవులే..వర వీణవులే..
కిలికించితాలతో!!

ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే..
మధు సంతకాలలో!!

కన్నులలో..సరసపు వెన్నెలలే..
సన్నలలో..గుస గుస తెమ్మెరలే..
మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!!

జాణవులే..వర వీణవులే..
కిలికించితాలతో!!

ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే..
మధు సంతకాలలో!!

మోమటు దాచీ..మురిపెము పెంచే..లాహిరిలో..
అహహహహ..ఒహోహూ హొహొహూ
మూగవుగానే..మురళిని ఊదే..వైఖరిలో

చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల..
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే వేళ..
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా!!

జాణవులే..వర వీణవులే..
కిలికించితాలతో!!

ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే..
మధు సంతకాలలో!!

కన్నులలో..సరసపు వెన్నెలలే..
సన్నలలో..గుస గుస తెమ్మెరలే..
మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!!

జాణవులే..వర వీణవులే..
కిలికించితాలతో!!

ఆహాహాహా..జాణవులే..మృదుపాణివిలే..
 సంతకాలలో!!

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో..
అహహహహ..ఒహోహూ హొహొహూ
వెన్నెల తాపం వయసుకు ప్రాణం చలిలో..
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ..
తొలి సోయగమే సగము ఇవ్వాళీవేళ..
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా!!

జాణవులే..వర వీణవులే..
కిలికించితాలతో!!
ఆహాహాహా..

జాణవులే..మృదుపాణివిలే..
మధు సంతకాలలో!!

కన్నులలో..సరసపు వెన్నెలలే..
సన్నలలో..గుస గుస తెమ్మెరలే..
మోవిగని..మొగ్గగని మోజు పడిన వేళలో!!

జాణవులే.. ఆహాహా..వర వీణవులే..
కిలికించితాలతో!!

ఆహాహా..మృదుపాణివిలే..
మధు సంతకాలలో!!

No comments:

Post a Comment