Thursday, March 8, 2012

వేటూరి పాటలు. .(vennelave vennelave, o vaana padite,aparanji madanude,mallee mallee idi raani roju,aakaasam yenaatido,vasantam laa vachchipovaa ila,premalekha raasaa,manasuloni marmamunu telusuko)

మెరుపుకలలు
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం
పిల్లా..పిల్లా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన
పువ్వుల్లో తడి అందాలో అందాలే వేళ

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట
కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు
పిల్లా..పిల్లా..పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
vennelave vennelave
******************************************************     
వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటునే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి
సాగింది నాలో సరిగమ పదనిస రే...
వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో
టిక్ టిక్ అంటాది గోడల్లో....
దూర పయనంలో రైలు పరుగుల్లో
చుక్ చుక్ గీతాలే చలో..
సంగీతిక సంగీతిక
సంగీతిక సంగీతిక మధుర సంగీత సుధ
పాపల్ని తానే పెంచి పాడే తల్లి లాలే హాయి
మమతారాగాలు కదా...
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే
మంగలారే మంగలారే డోరి డోరి భయ్యా
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే
జంగ్లారే జంగ్లారే భూమిరాగే భయ్యా

వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి

నీలాల మడుగుల్లో అల్లార్చే రెక్కల్లో
ఫట్ ఫట్ సంగీతాలే విను..
గోవుల్ల చిందులలో కొలువున్న మాలచ్చి
ఎట్టా పాడిందో విను..
సంగీతిక సంగీతిక
సంగీతిక సంగీతిక జీవన సంగీత సుధ
వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలె
ధరణి చిటికేసె విను..
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే
మంగలారే మంగలారే ఛోరి ఛోరి భయ్యా
హిల్కోరే హిల్కోరే హిల్కోరే హిల్కోరే
జంగ్లారే జంగ్లారే భూమిరాగే భయ్యా

వాన పడితే కొండకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుకుకూ ఎద కోరే కాంబోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహిరి లాలి పసి మువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటునే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి
సాగింది నాలో సరిగమ పదనిస రే...
o vaana padite aa konda kona haayi
***************************************************      
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...
వినువీధిలో ఉండే సూర్యదేవుడునే
ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశిపాలుడోచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
పోరాట భూమినే పూదోట కోనగా
పులకింప జేసినాడే...పులకింప జేసినాడే...

కళ్వారి మలమేలు కలికి ముత్యపు రాయి
కన్న బిడ్డతడు లేడే..
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి
ఓడిలోన చేరినాడే..
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా
ఇలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలమ్ము పుట్టాడు పూజకై
పుష్పమై తోడు రాకై..

అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...వచ్చె వలపంటివాడే...
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే...అతడేమి అందగాడే...
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే...వచ్చె వలపంటివాడే...
aparanji madanude anuvaina sakhudule
**************************************************      
రాక్షసుడు
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటి చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది??
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ??
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. 
మల్లి జాజి అల్లుకున్న రోజు..

చేరువైన రాయబారాలే, చెప్పబోతే మాట మౌనం..
దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావ గీతం..
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో,
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా,కోకిలమ్మ కబురేది??
గున్నమావి విరబుస్తున్నా, తోట మాలి జాడేది??
నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా!!

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..
మల్లి జాజి అల్లుకున్న రోజు..

 
కళ్ళనిండా నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం..
దేహమున లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం??
సందిట్లో మొగ్గే పూయనీ..రాగాలే బుగ్గల్లో దాయనీ..
గులాబీలు పూయిస్తున్నా..తేనెటీగ అతిథేడి??
సందెమబ్బులెన్నొస్తున్నా..స్వాతి చినుకు తడుపేది??
రేవులో నావలా నీ జతే కోరగా!!

జాబిలంటి చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది??
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ??
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. 
మల్లి జాజి అల్లుకున్న రోజు..
లాల లాల లల లాలలల
ఊహు ఊహు..ఆహ అహ అహా..
mallee mallee idi raani roju
******************************************************    
నిరీక్షణ
లాలలలా
లాలలలా
లలల లలాల లలలల లలల లాలాల

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...

పువ్వు ఏతేటిదన్నది నాడో రానున్నది..
ముద్దు మోవిదన్నది పొద్దో రాసున్నది...
బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా..
మందార్ం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా!!
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే.. స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను!!

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది...

మేఘం వాన చినుకై చిగురాకై మొలకెత్తునో..
రాగం గుండె లోతున గీతం పలికించునో..
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగా..
కౌగిలిలో చెర వేసీ మదనుని కరిగించీ గెలిపించమనగా!!
మోహాలే..దాహాలై..
సరసాలే.. సరదాలై..
కాలాన్నే నిలవేసీ కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు..

ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందది..
లాల లలలల..లాలా లల లల లలలా..
లలలల లలలల లలలల లలలల లలలలా
లాల లలలల..లాలా లల లల లలలా..
aavesham yenaatido anuraagam aanaatidi
************************************************************    
ముద్దులప్రియుడు
వసంతంలా...వచ్చిపోవా ఇలా..
నిరీక్షించే...కంటికే పాపలా..
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన 
తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా...వచ్చిపోవా ఇలా..
నిరీక్షించే...కంటికే పాపలా..

హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగా
వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలపాలే
మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా
నడిచే బృందావని నీవని తెలిసే కలిశా
పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా

వసంతంలా...వచ్చిపోవా ఇలా..
నిరీక్షించే...కంటికే పాపలా..

మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో
నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే
శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే
కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచె
నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా

వసంతంలా...వచ్చిపోవా ఇలా..
నిరీక్షించే...కంటికే పాపలా..
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన 
తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా...వచ్చిపోవా ఇలా..
vasantam laa vachchipovaa ilaa
***************************************************     
ముత్యమంతముద్దు
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది
పూల బాణమేసా ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెల వేడెక్కుతున్నది
పిల్ల గాలికే పిచ్చేక్కుతున్నది
మాఘమాసమా వేడెక్కుతున్నది
మల్లె గాలికే వెర్రెక్కుతున్నదీ
వస్తే గిస్తే వలచీ వందనాలు చేసుకుంటా
హంస లేఖ పంపా నీకందిఉంటది
పూల పక్క వేశా అది వేచీ ఉంటది

ఆడ సొగసు ఎక్కడుందో చెప్పనా
అందమైన పొడుపుకథలు విప్పనా 
కోడెగాడి మనసు తీరు చెప్పనా
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
సత్యభామ అలకలన్నీ పలకరింతలే అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే
సరసమాడినా క్షమించలేనురా
కృష్ణా గోదారుల్లో ఏది బెస్టో చెప్పమంట
హంస లేఖ పంపా నీకందిఉంటది
పూల బాణమేసా ఎదకంది ఉంటదీ

మాఘమాస వెన్నెలెంత వెచ్చనా
మంచి వాడివైతే నిన్ను మెచ్చనా
పంటకెదుగుతున్న పైరు పచ్చనా
పైటకొంగు జారకుండా నిలుచునా
సినిమాల కథలు వింటె చిత్తు కానులే చాలించు నీ కథాకళీ
ఆడవారి మాటకు అర్దాలు వేరులే అన్నాడు గ్రేటు పింగలీ
అష్టపదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే 
అష్టపదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే 
నుయ్యో గొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది
పూల పక్క వేశా అది వేచీ ఉంటది
premalekha raasaa neekandi untadee
*****************************************************      
నారినారినడుమమురారి 
మనసులోని మర్మమును తెలుసుకో..
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
మాన రక్షకా..మరకతాంగ..
మాన రక్షకా..మరకతాంగ..
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
మదనకీలగ..మరిగిపోక..
మదనకీలగ..మరిగిపోక..
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
ఇనకులాబ్ద నీవే గాని వేరెవరూ లేరు..దిక్కెవరూ లేరు..
ఆనంద హృదయా..మనసులోని మర్మమును తెలుసుకో!!
అనువుగాని ఏకాంతాన కాంతకైనా.. ఆకాంక్ష తగున రాకేందు వదనా?
మనసులోని మర్మమును తెలుసుకో!!
మునుపు ప్రేమ గల దొరవై సదా తనువు నేలినది గొప్ప కాదయా..
మదని ప్రేమకథ మొదలై ఇలా అదుపు దాటినది ఆదుకోవయా..
కనికరమ్ముతో ఈవేళ..
కనికరమ్ముతో ఈవేళ..నా కరముబట్టు..హా..
త్యాగరాజ వినుతా!!
మనసులోని మర్మమును తెలుసుకో!!
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
మరుల వెల్లువల వడినై..ఇలా దరులు  దాటితిని నిన్ను చేరగా..
మసక వెన్నెలలు ఎదురై..ఇలా తెగువ కూడదని మందలించవా??
కలత ఎందుకిక వేళ..నా కరము వణికే..

ఆగడాల వనితా..మనసులోని మర్మమును తెలుసుకో!!
మదనకీలగ..మరిగిపోక..
మదనకీలగ..మరిగిపోక..
నా మనసులోని మర్మమును తెలుసుకో!!
manasuloni marmamulu telusuko..

No comments:

Post a Comment