భక్త కన్నప్ప
ఓం నమశ్శివాయ నమో భవాయ
ఓంకార స్వరూపాయ విరూపాయ
నమో విష్ణు రూపాయ
అవ్యయాయ అనంతాయ అభవాయ నమోనమః
తకిటతక తకిటతక చకిత పదయుగళా
నికట గందస్నవిత మకుట తట నిగళా
సాంద్రచ్ఛటాపటల నిటల చంద్రకళా
జయజయ మహదేవా శివశంకర
హరహర మహదేవ అభయంకరా
అని దేవతలు శివుని కొనియాడ, పరవశ
మ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనంతలో అకాల ప్రళయజ్వాల
జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలిన వాని మొగము నగవై పోయే
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితర సాధ్యము పాశుపతాస్త్రము
కోరి ఇంద్రగిరి జేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె
తలపైన గంగమ్మ తలపులోనికి జారె
నిప్పులు మిసే కన్ను నిదురోయి బొట్టాయె
బూది పూతకు మారు పులితోలు వలువాయె
ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారె తానె ఎరుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడు
వరాహ రూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా
చిచ్చర పిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా పట్టె బాణము
ధనువొక చేతను అందుకొని
మాసిన కంటను చూడకనే - గురి
చూసినంతనే - వేసినంతనే
తలలు రెండుగా విలవిలలాడుచూ
తనువు కొండగా గిరగిర తిరుగుచూ
అటు నిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహము
కొట్టితి నేనని అర్జునుడు - పడగొట్టితినేనని శివుడు-
పట్టిన పట్టు వదలకనే తొడకట్టిన బీరముతో అపుడు-
వేటనాది వేటునాది వేటాడే చోటునాది
ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు
చేవనాది చేతనాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు-
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు - కానీ అపుడతడు
వేయి చేతుల కార్తవీర్యార్జునుడు
ఓంకార ఘన ధనుష్టంకారముల తోడ
శరపరంపర కురిసె హరుడు -అయినా
నరుని కాతడు మనోహరుడు-
చిత్రమేమో పెట్టిన గురి వట్టిదాయే..
అస్త్రములే విఫలమాయే - శస్ర్తములే వికలమాయే
సవ్యసాచి కుడి ఎడమై సంధించుట మరచిపోయె-
జగతికి సుగతి
*********************************
ఛాలెంజ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే??
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే??
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా!!
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా!!
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
కవ్వించే కన్నులలో, కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో, పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో, కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకిళించే పెదవుల్లో మురిపాలు,ఋతువుల్లో మధువంతా సగపాలు..
సాహోరే భామా..హోయ్!
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే??
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే??
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా!!
ఐ లవ్ యూ ఓ హారికా..
మీసంలో మిసమిసలు, మోసాలే చేస్తుంటే..
బిగిసిన కౌగిలిలో,సొగసరి మీగడలే దోచేసుకో..
రుస రుస వయసులతో, ఎడదల దరువులతో ముద్దాడుకో!!
తొలిపుట్టే ఎండల్లో సరసాలు..
పగపట్టే పరువంలో ప్రణయాలు..

*****************************
చంటి
అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణీ....
అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో
రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి
నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి
విరబూసే పూబోనీ...

ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవలు వేకువలకు మేలుకొలుపులేమో
పాల కడలి మీద తేలు చంద్రికో
గగనాల వేళ కాంతు లీను తారకో
వెన్నల్లే వస్తాడు ఓనాడు రాజుంటి గొప్పింటి మొగుడు
ఊరంతా సందెల్లు ఆనాడు వాడంతా వియ్యాల వారు
పిప్పి పీ..పీ..డుం..డుం..డుం..

**********************************************************
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే
కోనలన్నీ పాడుకనే గువ్వ చిన్న పాట ఇదే
రాగముల తాళములో నాకసలే రావులే
పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే

******************************************************
ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా
క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా
జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో
ఓ ప్రేమా నా ప్రేమా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా
గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున
కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా
స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ
మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా

*********************************************
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు
మిమ్ము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే ఈ అన్నలు
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు
పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగానైనా మగాణైనా ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది

గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు
పల్లే పాఠాలే నేర్చాడు ఈ భీముడు
నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట
పలుకాకులలో పుట్టానండి కోకిలగా మారానండి
కాకా ఇది కుకు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు
తెలుగింటమ్మ తిరునాళ్ళు

****************************************************
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకీ
చెమ్మగిల్లు బిడ్డకన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడ దీవెన
బువ్వ పెట్టీ బుజ్జగించే నాలమెంతో తియ్యన
మంచుకన్నా చల్లనైనా
మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా

******************************************
ఓ ప్రేమా నా ప్రేమ
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ
నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ
నా పాటే వినరావా
గడచిన దినముల కధలను మరువకు మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమా
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

************************************
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ..ఓ..ఓ..ఓ..
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి
చాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపీ
పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీరేదే కాదా..

తాళంటే తాడనే తలిచాను నాడు
అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజము
తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం
నా మీద నాకేలే కోపం
నాతోనే వేదములా ఇది తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాదే పోదా..

************************************************
No comments:
Post a Comment