Thursday, March 8, 2012

వేటూరి పాటలు. .(sirimalle neeve..virijallu kaave,maanasa veena madhugeetam,gopemma chetilo gorumudda,vayyaari godaaramma,sirimalle poovaa,)

sirimalle neeve..virijallu kaave..

సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
వరదల్లే రావే..వలపంటి నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
ఎలదేటి పాట..చెలరేగె నాలో..
చెలరేగి పోవే మధుమాసమల్లే..
ఎలమావితోటా పలికింది నాలో..
పలికించుకోవే మది కోయిలల్లే..
నీ పలుకు నాదే..నా బ్రతుకు నీదే..
తొలిపూత నవ్వే..వనదేవతల్లే..
పున్నాగ పూలే..సన్నాయి పాడే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ.. ఆ ఆ
మరుమల్లె తోట..మారాకు వేసే..
మారాకు వేసే నీ రాక తోనే..
నీ పలుకు పాటై..బ్రతుకైన వేళా..
బ్రతికించుకోవే..నీ పదము గానే..
నా పదము నీవే..నా బ్రతుకు నీదే
అనురాగమల్లే సుమగీతమల్లే..
నన్నల్లుకోవే..నా ఇల్లు నీవే..
ఎన్నెల్లు తేవే..ఎద మీటి పోవే..
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే..
హహ హాహ హాహ..లలాలలాల..

*****************************************
maanasa veena madhugeetham..

మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..
సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం
మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..సంసారం సంగీతం..
ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం..ఆ..ఆ..ఆ..
ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోకిల గీతం
శతవసంతన దశదిశంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే..
మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..
జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్న
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనో..మనసున మమతై కడతేరగలను
పా ..పదసరి గపదప  మమగగా రిరిసస సరిసద
మా..రిమ దపమ రిమారి సరిరి దపద పదప పదదప
మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..సంసారం సంగీతం..
ఆ.. ఆ.. నిరిగమద మగరిని దనిరినిదమ..ఆ..ఆ..
నినిరిరి గగమమ దద ..దద నిని రిరి గగమమ
మామ దద నిని రిరి గాగాగా
కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని..ఆ..
తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని..ఆ..
కలిసేదాక అనుకోలేదు తీయని స్నేహమని..
సనిరిసని నినిని నిరి నిరి ని దాని దని దమా దని సససా
మగదమగా మగమగ గదమద  మగ నిమగమగమ దగరిగరిగా
సరి నిరి నిరి..ఆ..మామ రిమ ద పమ రిమారి సరి మరి సరి సద
దసరి సరిమ..పెదవి నీవుగా పదము నేనుగా ఎదలు పాడనీ
మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..
సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం
మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..సంసారం సంగీతం..
*********************************************************
gopemma chethilo gorumudda..

ల ల ల ల..లా లా లాల..
ల ల ల ల ల ల..లా లా..ల ల
లాల లాల లాల..లాల లాల లాల
గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు..
రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు..
ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు..
ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు..
ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!!

గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు..
రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు..
రాగాలంత రాసలీలలు..అలు..అరు..ఇణి
రాగాలైన రాధగోలలు..అలు..అరు..ఇణి
రాధా..ఆ ఆ ఆ
రాధాబాదితుణ్ణిలే..ప్రేమారాధకుణ్ణిలే
అహహ..హా జారుపైట లాగనేలరా?ఆరుబైట అల్లరేలరా?
ముద్దు బేరమారకుండ ముద్దలింక మింగవా??

గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు..
రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు..
ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు..
ముద్దు కావాలా?? ఉహుహు..ముద్ద కావాలా..ఉహుహు..
ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!!
గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు..
రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు..

వెలిగించాలి నవ్వు బువ్వలు..అలా..అలా..అహహ..
తినిపించాలి మల్లె బువ్వలు..ఇలా..ఇలా..ఇలా..
కాదా..ఆ..ఆ..ఆ
చూపే లేత శోభనం..మాటే తీపి లాంచనం!!
వాలు జళ్ళ వుచ్చు వేసినా..కౌగిలింత ఖైదు వేసిన..
ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లె వుండనా!!

గోపెమ్మ చేతిలో గోరుముద్ద..ఉహుహు..
రాధమ్మ చేతిలో వెన్నెముద్ద..ఉహుహు..
ముద్దు కావాలి ఉహుహు..ముద్ద కావాలి..ఉహుహు..
ముద్దు కావాలి ఉహుహు..ముద్ద కావాలి..ఉహుహు..
ఆ విందా.. ఈ విందా..నా ముద్దు గోవిందా!!
గోపెమ్మ చేతిలో ఆహహహహా
రాధమ్మ చేతిలో ఆహహహహా
***********************************
vayyari godaaramma..vollantaa yendukamma kalavaram..

వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం??
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం!!
ఇన్ని కలలిక ఎందుకో?? కన్నే కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై!!
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం??

నిజము నా స్వప్నం..హొ..హొ..
కలనో..హొ..హొ..లేనో..హొ..హొ..హొ!!
నీవు నా సత్యం..హొ..హొ.. కానో...హొ..హొ..హొ!!
ఊహ నీవే..ఆ హ హాహ..ఉసురు కారాదా..ఆహా
మోహమల్లే ..ఆ హ హాహ..ముసురుకోరాదా..ఆహా..
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా..
ఆకాశ వీణ గీతాలలోన,ఆలాపనై నే కరిగిపోనా!!

వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం??
తందాన తాననన..తందాన తాననన..నా..
తందాన తాననన..తందాన తాననన..

తాకితే తాపం..హొ..హొ..
కమలం..హొ..హొ..భ్రమరం..హొ..హొ..హొ!!
సోకితే మైకం..హొ..హొ..
అధరం..హొ..హొ..అధరం..హొ..హొ..హొ!!
ఆటవెలది..ఆ హ హహ..ఆడుతూ రావే..ఆహా..
తేటగీతి..ఆహ హాహ..తేలిపోనీవే..ఆహా..
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక..
చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ!!
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం??
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం!!
ఇన్ని కలలిక ఎందుకో?? కన్నే కలయిక కోరుకో..
కలవరింతే కౌగిలింతై!!
వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం??
***************************************************
sirimalle puvvaa..sirimalle puvvaa..

సిరిమల్లె పువ్వా..సిరిమల్లె పువ్వా..
చిన్నారి చిలుకమ్మా..
నా వాడు ఎవరే..నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే..(సిరి)

తెల్లారబోతుంటే..నా కలలోకి వస్తాడే..
కళ్లారా చుద్దామంటే..నా కళ్ళుమూస్తాడే..
ఆ అందగాడు..నా ఈడు జోడు..ఏడే..
ఈ సందెకాడ..నా చందమామ రాడే..
చుక్కల్లారా..దిక్కులుదాటి..వాడెన్నాళ్ళకొస్తాడో..(సిరి)

కొండల్లో కోనల్లో..కూయన్న ఓకోయిలా..
ఈ పూల వానల్లో.. ఝుమ్మన్న ఓ తుమ్మెదా..
వయసంతా వలపై..మనసేమైమరుపై ఊగేనే..
పగలంతా దిగులు..రేయంతా రాగాలు..రేగేనే..
చుక్కల్లారా..దిక్కులుదాటి..వాడెన్నాళ్ళకొస్తాడో..(సిరి)

2 comments:

  1. చివరి పాత (ప్రియతమా నా హృదయమా) వేటూరి గారు రాసింది కాదేమో ?

    ReplyDelete
  2. ప్రియతమా ..నా హృదయమా పాటని ఆచార్య ఆత్రేయ పాటలకి మార్చేసాను .ధన్యవాదములు..

    ReplyDelete