కూలి నెం :1
కొత్త కొత్తగా వున్నది..స్వర్గమిక్కడే అన్నది..
కోటి తారలే..పూల ఏరులై..
కోటి తారలే..పూల ఏరులై..
నేల చేరగానే!!
కొత్త కొత్తగా వున్నది..స్వర్గమిక్కడే అన్నది..
నా కన్ను ముద్దాడితే..కన్నె కులుకాయె కనకాంబరం..
నా చెంప సంపెంగలో.. కెంపు రంగాయె తొలి సంబరం..
ఎన్ని పొంగులో కుమారి కొంగులో..
ఎన్ని రంగులో సుమాల వాగులో!!
ఎన్ని పొంగులో కుమారి కొంగులో..
ఎన్ని రంగులో సుమాల వాగులో!!
ఉద్యోగమిప్పించవా..సోకు ఉద్యాన వనమాలిగా..
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా!!
కొత్త కొత్తగా వున్నది..స్వర్గమిక్కడే అన్నది..
కోటి తారలే..పూల ఏరులై..
కోటి తారలే..పూల ఏరులై..
నేల చేరగానే!!
కొత్త కొత్తగా వున్నది..స్వర్గమిక్కడే అన్నది..
నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయె నా యవ్వనం..
నాజుకు మందారమే ముళ్ళ రోజాగ మారే క్షణం..
మొగలి పరిమళం మొగాడి కౌగిలి..
మగువ పరవశం సుఖాల లోగిలి!!
మొగలి పరిమళం మొగాడి కౌగిలి..
మగువ పరవశం సుఖాల లోగిలి!!
కండల్లో వైశాఖమా.. కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి..నరాల పందిరి..అందించుకోనా!!

***********************************
ఇందిర
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగానం
కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
ఎటో పోతుంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా
ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా
అన్నీ వైపులా మధువనం మధువనం ఎండిపోయెనే ఈ క్షణం
అణువణువునా జీవితం అడియాసకే అంకితం
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగానం
కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్న ప్రాణం
****************************************
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
చిన్నదానీ వయసే చెంతచేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరానా మోజులు తీర్చేనా
హద్దుమరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేనా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై నరములు వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేనా
మధువులు కురిసే పెదవుల కొరకే
ఇరవై వసంతాలూ వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలూ కాచుకొన్నా
ఇకపైన మన జంటా కలనైనా విడరాదే
మరీ కొంటె కలలెన్నో కన్నె ఎద తీర రాదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగ నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
***********************************
ఇద్దరు
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
ఎన్నెలా కన్నులా ఏదింత మత్తెక్కించే
ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసి
నీవేదో పెట్టంగా నేనేదో పూయంగా
ఒడి చేరే ప్రేమికా ఉసురే దోచా
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు
కౌగిళే చేరితే తెలవారుతుంది కాలం
వేసంగి వెన్నెల వేధించే కన్నుల
కవ్విస్తున్న కాంక్షే కలిసే వరమా
వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావే
వచ్చెనే మొదటి కాంక్ష
కన్నుల చల్లకే మధుర ధార
కలిగెనే ముద్దు కాంక్ష
తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా
కారణం నేనా నీవే నీవేలే
***********************************
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
నా బ్రతుకే పండగా...
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో
చేబంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒకనాడైనా శోధించావా అణువణువు ఉసురౌతాలే
అణువణువు ఉసురౌతాలే
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా
నీలవర్ణం సెలవంటే ఆకాశమే గాలి కదా
సూర్యుడునే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే
నా ఉసురిక నిలవదులే
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
పూనగవే పువ్వులది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిళి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలో పూల వేళ నా బ్రతుకే పండగా
అహ హహ ఆ..
*******************************
వి.డు.ద.ల..వి.డు.ద.ల..
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహే హే హే హే...
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
ఛోడా..ఛోడా..లాలల్లాలల్లాలల్లాల
ఛోడా..ఛోడా..లాలల్లాలల్లాలల్లాల
మనిషీ మనసూ నా పక్షం మలయానిలమే నా పక్షం
చిట్టి చిలుకలు నా పక్షం చెట్టూ కొమ్మలు నా పక్షం
ఎండే తుమ్ములు నా పక్షం తెలుగింటమ్మలు నా పక్షం
దిక్కులెనిమిది నా పక్షం ఇది కల కాదోయ్
కడుపిరికే కత్తి ధలుకు
వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్
ఏకమౌతుంటే ఆకలి వర్గాలే
కొలువులు కోటలు క్షణమున మారే కాలం
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
పోరాపో అనరాదోయ్ అది నా పతనం కాలేదోయ్
కనకం కాసు విసిరేస్తే ఆ కాసుకు ధర్మం లొంగదులే
వెండి వానలిచ్చే మల్లె మేఘం పిలుపుకు చినుకై పడుతుందా
విత్తులు శక్తి కాసుకు బలి కాదు లొంగే పనిలేదు
వెండి వెలుగే వచ్చు వరకే
తెలవారని చీకటి రాజ్యమురా
చురుకుమని మొదటి దిశ
చీకటింట చిచ్చుపెట్టి మాకు దక్కు వేకువమ్మా
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి
కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా
వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ - భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ - గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహే హే హే హే...
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
వి.డు.ద.ల.. విడుదల..వి.డు.ద.ల.. విడుదల..
ఛోడా..ఛోడా..లాలల్లాలల్లాలల్లాల
ఛోడా..ఛోడా..లాలల్లాలల్లాలల్లాల
*********************************
శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నవమదనా నవమదనా కలపకు కన్నుల
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
మదన మోహిని చూపులోన మాండు రాగమేల
మదన మోహిని చూపులోన మాండు రాగమేల
పడుచు వాడిని కన్నె వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘాల కట్టిన ఇల్లే
శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా
నీయం వీయం ఏదేదైనా తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే
నవమదనా నవమదనా కలపకు కన్నుల
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
************************************
గోరింటాకు
కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??
కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
మనసులో ధ్యానం..మాటలో మౌనం..
మనసులో ధ్యానం..మాటలో మౌనం..
మనసు మాటకందని నాడు..మధురమైన పాటవుతుంది..
మధురమైన వేదనలోనే.. పాటకు పల్లవి పుడుతుంది..
మనసు మాటకందని నాడు..మధురమైన పాటవుతుంది..
మధురమైన వేదనలోనే.. పాటకు పల్లవి పుడుతుంది..
పల్లవించు పడుచుదనం.. పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం.. పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో..ముసురుకున్న మబ్బులు చూడు..
అందుకే ధ్యానం..అందుకే మౌనం..
కొమ్మ కొమ్మకో సన్నాయి..
కొంటె వయసు కోరిలాగా..గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బందం చూడు..
కొంటె వయసు కోరిలాగా..గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే..పడవకున్న బందం చూడు..
ఒడ్డుతోనో, నీటితోనో.. పడవ ముడి పడి ఉండాలి!!
ఎప్పుడే ముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి!!
అందుకే ధ్యానం..అందుకే మౌనం..
అందుకే ధ్యానం..అందుకే మౌనం..
కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..
ఏమిటి మౌనం??ఎందుకీ ధ్యానం??
మనసులో ధ్యానం..మాటలో మౌనం..
కొమ్మ కొమ్మకో సన్నాయి..
************************************************
ఇంటింటిరామాయణం
వీణ వేణువైన సరిగమ విన్నావా??
ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా??
తనువు తహతహలాడాల..చెలరేగాల..
చెలి ఊగాల వుయ్యాలలీవేళలో!!
వీణ వేణువైన సరిగమ విన్నావా??
ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా??
ఊపిరి తగిలిన వేళ ..నే వంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే..పలికే రాగమాల!!
ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ..ఆ చుక్కలు వెలిగినవేళ..
నా తనువున అణువణువునా జరిగే రాసలీల!!
వీణ వేణువైన సరిగమ విన్నావా??
ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా??
ఎదలో అందం ఎదుట..ఎదుటే వలచిన వనిత..
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత!!
ఆ ఆ ఆ ఆ..లలలా ఆ ఆ
కదిలే అందం కవిత..అది కౌగిలికొస్తే యువత..
నా పాటలో నీ పల్లవే..నవతా నవ్య మమతా!!

**************************************************
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!
ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..
ముసిముసి నవ్వులలో.. గుసగుస లాడినవే..నా తొలి మోజులే నీ విరజాజులై..
మిస మిస వన్నెలలో.. మిల మిల మిన్నవిలే..నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే..
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే!!
మనసులు పాడే..మంతనమాడే..ఈ పూట జంటగా..
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా!!
మల్లెలు పూసే ..వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా!!
ఆహా..ఆ ఆ ఆ ఆహ..హా
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ
తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా..
తొలకరి కోరికలే..తొందర చేసినవే..ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా!!
సొగసరి కానుకలే..సొద పెడుతున్నవిలే..ఏ తెరదాటునో ఆ చెర వీడగా..
అందిన పొందులోనే అందలేని విందులీయవే!!
కలలిక పండే..కలయిక నేడే..కావాలి వేయిగా..

No comments:
Post a Comment