Monday, September 3, 2012

ఆలాపన(aa Kanulalo Kalala Naa Celi..)

సినిమా:ఆలాపన

సంగీతం:పుహళెంది
రచన:ఆచార్య ఆత్రేయ
గానం:ఎస్ పి బాలు,ఎస్ జానకి

ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా

ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆది మంత్రమై

నిదిరించు వేళ హూదయాంచలాన
అలగా పొంగెను నీ భంగిమ
అది రూపొందిన స్వర మధురిమ
ఆ రాచ నడకా రాయంచ కెరుగా
ఆ రాచ నడకా రాయంచ కెరుగా
ప్రతి అడుగు శృతిమయమై
కణకణమున రసధ్వనులను మీటిన

ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆదిమంత్రమై

నీ రాకతోనే ఈ లోయలోనే
అణువులు మెరిసెను మణి రాసులై
మబ్బులు తేలెను పలు వన్నెలై
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ
ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన

ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సoధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ..
ఆలాపనకు ఆది మంత్రమై

2.ఆవేశమంతా అలాపనేలే(aveshamantaa Alaapanele yedalayalo)

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన..
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో

నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసపామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్నా
గిరివీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే అలాపన ఆరాగాలు తీసే ఆలోచనా
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచే నాలో హృదయమే

ఆవేశమంతా ఆలాపనే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనే

సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిస నిస గమగపదనిస
జలకన్యలాడే తొలి మాసమన్నా
గోధూళి తెరలో మలిసంజె కన్నా
అందాలు కరిగే ఆవేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలి పింఛం..
ఎదలు కదిపి నాలోవిరిపొదలు వెతికే మోహం..

ఆవేశమంతా ఆలాపనే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన..
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో

No comments:

Post a Comment