Sunday, September 9, 2012

ఆరుద్ర పాటలు(sreerastoo Shubhamastoo,oohalu gusagusalaade,vedamlaa ghosinche godaavari,idi teeyani vennela reyi)

సినిమా:పెళ్ళిపుస్తకం
రచన:ఆరుద్ర
సంగీతం:కే వి మహదేవన్
గానం:బాలు,సుశీల

(sreerastoo Shubhamastoo)
శ్రీరస్తూ శుభమస్తూ ..శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీరస్తూ శుభమస్తూ ...శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!
శ్రీరస్తూ శుభమస్తూ ..శ్రీరస్తూ శుభమస్తూ

తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టుపెట్టినా
తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం..

శ్రీరస్తూ శుభమస్తూ ..శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో..
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో..
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికి నింపుకో..!!

శ్రీరస్తూ శుభమస్తూ ..శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!
శ్రీరస్తూ శుభమస్తూ ..శ్రీరస్తూ శుభమస్తూ
*********************************
సినిమా:బందిపోటు
రచన:ఆరుద్ర
సంగీతం:ఘంటసాల
గానం:ఘంటసాల,సుశీల

(oohalu gusagusalaade)
ఊ..హూ ..హూ..ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
ఊ..హూ ..హూ..ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
ఊహలు గుసగుసలాడే..నా హృదయము ఊగిసలాడే
ప్రియ..ఊ..
ఊహలు గుసగుసలాడే..నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసు,కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు,కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే..అది నీకు మునుపే తెలుసు..
ఊహలు గుసగుసలాడే..నా హృదయము ఊగిసలాడే

ననుకోరి చేరిన బేలా..దూరాన నిలిచేవేలా
ననుకోరి చేరిన బేలా..దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరికూడా
ఊహలు గుసగుసలాడే..నా హృదయము ఊగిసలాడే

దివిమల్లెపందిరి వేసే ..భువి పెళ్లి పీటను వేసే
దివిమల్లెపందిరి వేసే ..భువి పెళ్లి పీటను వేసే
నెరవెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే..
ఊహలు గుసగుసలాడే..మన హృదయములూయలలూగే ..
**************************************
సినిమా:ఆంధ్ర కేసరి
రచన:ఆరుద్ర
సంగీతం:సత్యం
గానం:బాలు

(vedamlaa ghosinche godaavari)
వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం...శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం.. (వేదం)

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్నమేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కధలన్నీనినదించే గౌతమి హోరు (వేదం)

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్థితి మావహంచ విహితాం స్త్రీ పుమ్సయోగోద్భావాం
తే వేదత్రయ మూర్తయ స్త్రీపురుషా సంపూజితా వస్సురైర్భూయాసుహు
పురుషోత్తమం భుజభవ శ్రీకంధరాశ్రేయసే

ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము (వేదం)

దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టు కధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకోనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు (వేదం)
***********************************
సినిమా:ప్రేమలేఖలు

రచన:ఆరుద్ర
సంగీతం:సత్యం
గానం:బాలు,సుశీల
(idi teeyani vennela reyi)
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రకాలు..కురిపించెను ప్రేమలేఖలు..
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి
ఆ..హాహాహా..ఆహా..ఆ ఆహా..

నడిరాతిరి వేళా నీ పిలుపు..గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళా నీ పిలుపు..గిలిగింతలతో నను ఉసిగొలుపు
నునుచేతులతో నను పెనవేసి..నా ఒడిలో వాలును నీ వలపు..
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి

నా మనసే నీ కోవెల చేసితిని.ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే నీ కోవెల చేసితిని.ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు..కనువిందులు చేసే శిల్పాలు
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి

నీ పెదవులు చిలికే మధురిమలు..అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు..అనురాగము పలికే సరిగమలు
మన తనువులు పలికే రాగాలు..కలకాలం నిలిచే కావ్యాలు..
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రకాలు..కురిపించెను ప్రేమలేఖలు..ప్రేమలేఖలు..
ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి
















No comments:

Post a Comment