Monday, September 3, 2012

తీగనై మల్లెలు పూచిన వేళ(teeganai mallelu poochina vela)

సినిమా:ఆరాధన

గానం:ఎస్ పి బాలు,పి జానకి

తీగనై మల్లెలు పూచిన వేళ

ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
అందుకున్న పొందికుందా పొత్తు కుదిరిందా
ప్రేమకన్నా పాశముందా
పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా
పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా ఇది కథలో మది విందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
మారమంటే మారుతుందా మసిపోతుందా
చేసుకున్న పున్నెముందా
చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా
చేయి చేయి కలిసేనా

తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల


No comments:

Post a Comment