Thursday, March 8, 2012

వేటూరి పాటలు....

శారద

శారదా.. నను చేరగా
శారదా.. నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా
ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా

..శ్రావణ నీరదా..శారదా

శారదా.. నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా
..ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా

ఏమి రూపమది..ఇంద్ర చాపమది
ఏమి కోపమది..చంద్ర తాపమది

ఏమి రూపమది..ఇంద్ర చాపమది..ఏమి కోపమది..చంద్ర తాపమది
ఏమి హొయలు!
ఏమి కులుకు..సెలయేటి పిలుపు..అది ఏమి అడుగు..కలహంస నడుగు..
హోయ్..ఏమి లయలు!
కలగా కదిలే అందం..కలగా కదిలే అందం..
కావాలన్నది నా హృదయం..కావాలన్నది నా హృదయం..

..శ్రావణ నీరదా..శారదా

శారదా.. నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా
..ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా

నీలి కళ్ళలో..నా నీడ చూసుకుని
పాల నవ్వులో..పూలు దోచుకుని


నీలి కళ్ళలో..నా నీడ చూసుకుని..పాల నవ్వులో..పూలు దోచుకుని
పరిమళించేనా!

అలలై పొంగే అనురాగం..అలలై పొంగే అనురాగం..
పులకించాలీ కలకాలం..పులకించాలీ కలకాలం..

..శ్రావణ నీరదా..శారదా

శారదా.. నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా
..ఏమిటమ్మా సిగ్గా ..ఎరుపెక్కే లేత బుగ్గా..ఆహా..ఓహో..అహా..

**************************************************     
సీతామాలక్ష్మి
 సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
సీతామలచ్చిమంటే..శ్రీలచ్చిమవతారం!!

సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
సీతామలచ్చిమంటే..శ్రీలచ్చిమవతారం!!

మనసున్న మందారం..మనిషంత బంగారం
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!

మనసున్న మందారం..మనిషంత బంగారం
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!

సీతాలు సింగారం..

కూసంత నవ్విందంటే పున్నమి కావాలా..
ఐతే నవ్వనులే!!

కాసంత చూసిందంటే కడలే పొంగాలా..
ఇక చూడనులే!!

కూసంత నవ్విందంటే పున్నమి కావాలా..
కాసంత చూసిందంటే కడలే పొంగాలా..

ఎండి తెరమీద పుత్తడి బొమ్మ ఎలగాల, ఎదగాల..
ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాలా!!

నువ్వు అంటుంటే..నే వింటుంటే..
నూరేళ్ళు నిండాలా!!

సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!

మనసున్న మందారం..

లలాల్లలా లాలాల లాలలా..
లలాలలలాల
లలాలలా లాలాల లాలలా..

దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే..
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగీ,వెలిగించాలా..
వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా!!

నువ్వు అంటుంటే ..నే వింటుంటే..
వెయ్యేళ్ళు బతకాలా!!

సీతాలు సింగారం..మాలచ్చి బంగారం..
బంగారు కొండయంటే..భగవంతుడవతారం!!

లాలాల లాలాలా లాలాలా..

*******************************************************       
సీతాకోకచిలుక
..
తందానాన తందాన నానన తందాన నానన తందాన నానన 
ఆహాహా ..ఆహాహా ..

తందానానన.తందానానన.
ఆహహా ..ఆహాహా ..
తందానానన.తందానానన.

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
అందమైన రంగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
.. చుక్కా నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే..
కంటి కోలాటాల..జంట పేరంటాల!!

.. చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే..
పొందు ఆరాటాలా..పొంగు పోరాటాలా..
దప్పికంటె తీర్చ్డానికిన్ని తంటలా??

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..

..రామచిలకా..చిక్కని ప్రేమ మొలక..
గూడు ఏమందమ్మ?? ఈడు ఏమందమ్మ?? 

ఈడుకున్న గూడు, నువ్వే గోరింకా..
తోడుకుండిపోవే కంటినీరింకా..
పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంక!!

మిన్నేటి సూరీడు..లలలల..
మిన్నేటి సూరీడు..లలలల లల లలలల..

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
అందమైన తగవల్లులై..ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచీ!!

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ..
****************************************************        
ఓం శతమానం భవతి శతాయు పురుష
శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ

మాటే మంత్రము..మనసే బందము
మమతే.. సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం

మాటే మంత్రము..మనసే బందము
మమతే.. సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం

ఓఓ ఓఓ మాటే మంత్రము..మనసే బందము

నీవే నాలో స్పందించినా..
ప్రియ లయలో శ్రుతికలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పువ్వూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రము..మనసే బందము
మమతే.. సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం

మాటే మంత్రము..మనసే బందము
మనసే బందము

నేనే నీవై ప్రేమించినా..
అనురాగం  పలికించే పల్లవివే
ఎద నా కోవెలా..ఎదుటే దేవతా..
వలపై వచ్చీ..వరమే ఇచ్చీ ..కలిసే వేళలో

మాటే మంత్రము..మనసే బందము
మమతే.. సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం..కమనీయం..జీవితం

..లల లాలల..లాల లాల ..ఉహు ఉహు ఉహూ..ఉహు ఉహూ హూ హూ
****************************************************   
సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా

పా పా
సా
ని ని సా సా
నీ గా పా

సా నీ నీ పా మా గా సా నీ
ససస ని ని ని ని ని సా
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే

పా పా పా పా ని ని ని మా గా
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో

ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో

తనన ననన ననన ననన తనన నన  తాన
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
పగలు రేయి ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవనరాగంలో
అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
తనన ననన ననన ననన తనన నన  తాన
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం 
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం
తకదుం తకదుం తకదుం తకదుం

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
........ఆఆ..ఆఆఆఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే..
సందడి వినీ డెదము కీటికీలు తెరుచుకుంటే

నీ పిలుపు అనే కులులకే కలికి వెన్నెల చిలికె
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టు చీర కడితే పుత్తడి బొమ్మా
కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడి బొమ్మా..


అలలు కలలు ఎగసీ ఎగసీ అలసీ సోలసి పోయే
*******************************************      
సప్తపది
నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన
నెమలికి నేర్పిన నడకలివీ..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
  నెమలికి నేర్పిన నడకలివీ..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!
నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివీ..
***********************************************  
సాగరసంగమం
ఓం.. ..
ఓం.. ..
ఓం..

ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ..
చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా..
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!!

ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ..

పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై..
పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై..

ప్రకృతి,పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై..

ని
  ని  
..
..
ని ని

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై..నీ వాక్కులే నవరసమ్ములై..
తాపస మందారా.. ..
నీ మౌనమే..
దశోపనిషత్తులై ఇల వెలయా!! 

ఓం..ఓం..

ఓం నమశ్శివాయ..


త్రికాలములు నీ నేత్రత్రయమై..చతుర్వేదములు ప్రాకారములై..
త్రికాలములు నీ నేత్రత్రయమై..చతుర్వేదములు ప్రాకారములై..

గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై..
అద్వైతమే నీ ఆది యోగమై..నీ లయలే కాలగమనమై..
కైలాసగిరివాస నీ గానమే..
జంత్ర గాత్రముల శ్రుతి కలయ!!

ఓం..ఓం..ఓం నమశ్శివాయ..
చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా..
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!!

*************************************************       
.. ఆఆ.. .. ఆఆ..
మౌనమేలనోయి.. మరపురాని రేయి
మౌనమేలనోయి.. మరపురాని రేయి

ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
తారాడే హాయిలో..

ఇంత..మౌనమేలనోయి.. మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో

కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా

నీలి నీలి ఊసులు.. లేతగాలి బాసలు..
ఏమేమో అడిగినా

మౌనమేలనోయి.. మరపురాని రేయి

హిమమే కురిసే వందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట

ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా
ఇవి ఏడడుగులా.. వలపు మడుగులా

కన్నె ఈడు ఉలుకులు.. కంటిపాప కబురులు..
ఎంతెంతో తెలిసినా..

మౌనమేలనోయి.. మరపురాని రేయి
ఇంత..మౌనమేలనోయి.. మరపురాని రేయి

ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల
తారాడే హాయిలో..

ఉహుహూ..హుహూహూ..

ఇంత..మౌనమేలనోయి.. మరపురాని రేయి

No comments:

Post a Comment