Friday, March 9, 2012

ఆచార్య ఆత్రేయ పాటలు(sarigamalu galagalalu,gaalikadupu ledu kadalikantu ledu,neeku naaku pellanta ningiki nelaku kullanta,sirimalle poovalle navvu chinnaari paapalle navvu,maata raani mounamidi mounaveena gaanamidi,sumam prathi sumam sumam,repanti roopam kanti poovinti choopula vanti,jaabilli kosam aakaasamalle vechaanu nee raakakai)

ఇది కథ కాదు
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ...
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
చెలికాలి మువ్వల గలగలలు
చెలికాలి మువ్వల గలగలలు
చెలికాని మురళిలో 
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ...

ఆవేశమున్నది ప్రతికళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతికళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు

సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ...
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు

సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ...

నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళి
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

సరిగమలు గలగలలు 
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
అహాహా...ఆహాహా   (sarigamalu galagalalu)
***********************************************   
ఆఆ....ఆఆ....ఆఆఆ.... ...... ......
.... ......
గాలికదుపు లేదు..కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా..

గాలికదుపు లేదు..కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా..

సనిస....సరి సరి సరి రిస సని..సనిస ..సరి సరి సరి రిస సని
సనిస....సరి సరి సరి రిస సని..సనిస ..సరి సరి సరి రిస సని

నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడీ కేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లె కేల ఆకుచాటూ..

గాలికదుపు లేదు..కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా..

తెమ్మెరా..ఊపవే ఊహల ఊయల నన్ను
మల్లికా..ఇవ్వవే నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళీ తరుణయ్యింది..పువ్వు పూసి మొగ్గ అయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది

గాలికదుపు లేదు..కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా..

అ (gaalikadupu ledu kadalikantu ledu)
******************************************************   
జ్యోతి
 నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట 
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట 
ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంటా-అలాగా
నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంటా
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట 
నదికి కడలికి పొంగంట
ప్రతి రేయి మనకొక తొలిరేయంట ..
తొలిముద్దు పెదవులు విడిపోవంట ..
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగా చేస్తామంటా
..నా కంట నిను చూసుకుంటా
..నీ చూపు నా రేపు పంట
..
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట 
నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట
మన కోర్కెలన్నీ పసిపాపలంట ..
చిగురాకు మనసుల చిరునవ్వులంట ..
వయసు లేనిది మన వలపేనంట
మన జీవితము ఆటాపాటే నంటా
..నాలోన నిను దాచుకుంటా
..నీ ఊపిరై కాచుకుంటా
..
నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంటా
నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట (neeku naaku pellanta ningiki nelaku kullanta)
***************************************************** 
సిరిమల్లె పువ్వల్లే నవ్వు

సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నవ్వు
నా నవ్వు...
సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
నవ్వు....
పనిసా...అహహా
సగమా...అహహా గమపా..అహహా
నినిపమ గమగమపా..అహహా
........
చిరుగాలి  తరగల్లె  మెల మెల్లగా
సెలయేటి  నురగల్లె  తెల  తెల్లగా
చిరుగాలి  తరగల్లె  మెల  మెల్లగా
సెలయేటి  నురగల్లె  తెల  తెల్లగా
చిననాటి కలలల్లె  తీయ  తియ్యగా
ఎన్నెన్నో  రాగాలు  రవలించగా 
రవలించగా
సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
నవ్వు....
నీ నవ్వు  నా  బ్రతుకు  వెలిగించగా 
  వెలుగులో  నేను  పయనించగా
నీ నవ్వు  నా  బ్రతుకు  వెలిగించగా
  వెలుగులో  నేను  పయనించగా
.. .. ..
వెలుగుతూ  ఉంటాను నీ దివ్వెగా
వెలుగుతూ  ఉంటాను నీ దివ్వెగా
నే  మిగిలి  ఉంటాను  తొలి నవ్వుగా
తొలి నవ్వుగా
సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నవ్వు
నా నవ్వు...
సిరిమల్లె పువ్వల్లే నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
నవ్వు....
sirimalle poovalle navvu chinnaari paapalle navvu
 ************************************************       
మహర్షి

మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
గానమిది..నీ ధ్యానమిది..
ధ్యానములో నా ప్రాణమిది..
ప్రాణమైన మూగగుండె రాగమిది..
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
ముత్యాల పాటల్లో కోయిలమ్మా..ముద్దారబోసేది ఎప్పుడమ్మా
పాల నవ్వులో వెన్నెలమ్మా..దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
మౌన రాగాల ప్రేమావేశం..ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం..నీకేలా ఇంత పంతం..
నింగి నేలా..కూడే వేళ..నీకు నాకు దూరాలేల
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
ఛైత్రాన కూసేను కోయిలమ్మా..గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా..నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో నీణా నాదం..కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం..పాడింది మధుర గేయం..
ఆకాశాన..తారా తీరం..అంతే లేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
దూరమిది..జత కూడనిది..
చూడనిది..మది పాడనిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది (maata raani mounamidi mounaveena gaanamidi)
******************************************************************    
తననాననాన..తననాననాన..
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
హహా.. ఆహహహహా
 

వేణువ వీణియ ఏవిటి నాదము??
వేణువ వీణియ ఏవిటి నాదము??
అచంచలం సుఖం మధుర మధురం..
మయం హృదం తరం గిరిజ సురతం..
వేళ నాలో రాగోల్లసాలు..
వేళ నాలో రాగోల్లసాలు..
కాదు మనసా.. ..ప్రేమ మహిమా..నాదు హృదయం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
హా తారర తార..తారర తారర తార..
రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!
సగం నిజం సగం వరము అమరం..
వరం వరం వరం చెలియ ప్రణయం..
వేగమేదీ నాలోన లేదు..
వేగమేదీ నాలోన లేదు..
ప్రేమమయమూ.. ..ప్రేమమయమూ నాదు హృదయం..
భానోదయాన..చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం..వనం ప్రతి వనం వనం
sumam prathi sumam sumam
*********************************************************************  
మంచి చెడు
రేపంటి రూపం కంటి..
పూవింటి చూపుల వంటి..
నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి..
పూవింటి దొరనే కంటి..
నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి

నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనేనంటి..
జంట కంటే వేరే లేదు లేదంటి..
నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనేనంటి..
జంట కంటే వేరే లేదు లేదంటి..
నీ పైన ఆశలు ఉంచి.. పైన కోటలు పెంచి
నీ పైన ఆశలు ఉంచి.. పైన కోటలు పెంచి
నీ కోసం రేపూ మాపూ  ఉంటిని నిన్నంటి

రేపంటి రూపం కంటి..
పూవింటి చూపుల వంటి..
నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి

నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి..
నీ చల్లని నవ్వుల కలసి  ఉంటే చాలంటి
నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి..
నీ చల్లని నవ్వుల కలసి  ఉంటే చాలంటి
నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి 
నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి 
రాగ సరళి తరలి పోదాం రమ్మంటి

రేపంటి వెలుగే కంటి..
పూవింటి దొరనే కంటి..
నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి

నీలోని మగసిరి తోటీ నాలోని సొగసుల పోటి..
వేయించి నేనే ఓడి పోనీ పొమ్మంటి..
నేనోడి నీవే గెలిచి..నీ గెలుపు నాదని తలచి
నేనోడి నీవే గెలిచి..నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిల్లు రోజే రాజీ రమ్మంటి
రేపంటి వెలుగే కంటి..
పూవింటి దొరనే కంటి..
నీ కంటి కళలు కలలు నీ సొమ్మంటి
రేపంటి రూపం కంటి..
పూవింటి చూపుల వంటి..
నీ కంటి చూపుల వెంటా నా పరుగంటి
repanti roopam kanti poovinti choopula vanti
*********************************************************       
మంచిమనసులు
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
నిను కానలేక..మనసూరుకోక..
పాడాను నేను పాటనై!!
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా??
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా??
పువ్వులనే నీ నవ్వులుగా..
చుక్కలనే నీ కన్నులుగా..
నునునిగ్గుల మొగ్గలు నీ బుగ్గలుగా..
ఊహల్లో తేలీ..ఉర్రుతలూగి..
మేఘాలతోటి..రాగాల లేఖ..
నీ కంపినాను..రావా దేవీ..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
నిను కానలేక..మనసూరుకోక..
పాడాను నేను పాటనై!!
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
నీ పేరొక జపమైనది..నీ ప్రేమొక తపమైనది..
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా!!
నీ పేరొక జపమైనది..నీ ప్రేమొక తపమైనది..
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా!!
ఉండీ లేక ఉన్నది నీవే..ఉన్నా కూడా లేనిది నేనే..
నా రేపటీ అడియాశల రూపం నీవే!!
దూరాన ఉన్నానా తోడు నీవే..
నీ దగ్గరున్నా నీ నీడ నాదే..
నాదన్నదంతా నీవే నీవే!!
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
నిను కానలేక..మనసూరుకోక..
పాడాను నేను పాటనై!!
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
వేచాను నీ రాకకై!!
jaabilli kosam aakaasamalle vechaanu nee raakakai

No comments:

Post a Comment