Wednesday, March 7, 2012

వేటూరి పాటలు...

గోదావరి
షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

సాస పాప పప పమరిస సనిస
సాస పాప పప పమదప
సాస పాప పప పమరిస సనిస
సాస పాప పప పమదప

ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మాగోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్టు వేయంగానే లాభసాటి భేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
అరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీదలాగా
ప్రభువు తాను కాగా

ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటూ పండు కొరకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే సంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మాగోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
*********************************     
విధి లేదు తిథి లేదు ప్రతీరోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడు నీవేలేరా
దేశం అందించే దేశం నీకేల
నీ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా..
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
మనసా గెలుపు నీదేరా..నీదేరా

మనసులోనే మార్గముంది తెలుసుకోర ఇక
గురిలేనిదే నీ బాణమింక చేరుకోదు ఎద
ప్రతిరోజు నీకొక పాఠమే చదువుకుంటూ పదా
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
మనసా గెలుపు నీదేరా..నీదేరా

ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైనా రాముడైనది ప్రేమకోసం కదా
ప్రతి జీవితం వెలుగునిడలా బిమ్మలాటే కదా

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
తళుకుల తారల్లో వెలుగుల దారల్లో 
మనసా గెలుపు నీదేరా..నీదేరా
******************************     
 తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చాపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలులు మేడల చినుకుమన్న ధారలా
తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చాపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు

గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా
వాన రేపు పిల్ల పెద్ద సయ్యాటాడగా
గోతి పడవలో పువ్వు జంటలు కూత పెట్టు లేత వలపులు
లంగారేసిన అంది చావని రంగసామి చాటు పిలుపులు
రాకడో పోకడో రాములోరికెరుకలే

తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చాపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు

యేరు నీరు దారైతే ఎదురీదాలిలే
ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే
ఘల్లు ఘల్లున సాని కిన్నెర ఓటమింక గజ్జె కట్టేలే
నింగి నంటని  గంగ వంటిది పండు ముసలి శబరి కళ్ళివే
ఆడరా పాడరా తోకలేని వానరా

తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చాపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా
మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా
గాలులు మేడల చినుకుమన్న ధారలా
తప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు
ఏటిలో చాపలు చేతిలో పాపలు చంగుమన్న నీటి జింకలు
******************************************        
 నీల గగన ఘనవిచలన ధరణిజా శ్రీరమణ
మధుర వదన నళిన నయన మనవి వినరా రామా
రామ చక్కని సీతకీ అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకీ..

పుడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలచే
చూసుకోమని మనస్సు తెలిపీ మనస్సు మాటలు కాదుగా

రామ చక్కని సీతకీ రామ చక్కని సీతకీ అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకీ..

ఇందువదన కుందరదన మంద గమన భామా
ఎందువలన ఇందువదన ఇంత మదనా ప్రేమా..
***************************************      
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్నా తెల్లారైనా పున్నమికన్నా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా..

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
మాట దాచా కాలాలు వేచా నడిచానే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

***********************************************       
అందంగాలేనా అసలేం బాలేనా 
అంత లెవలెందుకోయ్ నీకు

అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా

కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే  మాటవరసకి
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా

నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీ కదీ
తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అది
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా

అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా 
నీ ఈడు జోడు కాననా
******************************************        
గీతాంజలి
చం చం..చం చం చం..చం చం
చం చం చం..చం చం
చం చం చం..చం చం
చం చం చం
జగడ జగడ జగడం..
చేసేస్తాం రగడ రగడ రగడం..
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !!
చం చం చం
మరల మరల జననం..
రానీరా మరల మరల మరణం..
మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!!
మా ఊపిరి నిప్పుల ఉప్పెన..
మా ఊహలు కత్తుల వంతెన.. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే..
రం పం పం పం!!
జగడ జగడ జగడం..
చేసేస్తాం రగడ రగడ రగడం..
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !!
చం చం చం
మరల మరల జననం..
రానీరా మరల మరల మరణం..
మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!!
ఆడేదే వలపు నర్తనం.. పాడేదే చిలిపి కీర్తనం..
సై అంటే సయ్యాటలో.. హే హే!!
మా వెనకే ఉంది తరం.. మా శక్తే మాకు సాధనం..
ఢీ అంటే ఢీ ఆటలో!!
నేడేరా నీకు నేస్తము,రేపే లేదు
నిన్నంటే నిండు సున్నారా, రానే రాదూ..
ఏడేడు లోకాలతోన.. బంతాటలాడాలి ఈనాడే!!
తక తకధిమి తకఝణు!!
జగడ జగడ జగడం..
చేసేస్తాం రగడ రగడ రగడం..
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !!
చం చం చం
మరల మరల జననం..
రానీరా మరల మరల మరణం..
మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!!
పడనీరా విరిగి ఆకాశం..విడిపోనీ భూమి క్షణం..
మా పాట సాగేనులే.. హో..హో!!
నడిరేయే సూర్య దర్శనం..రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే!!
మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం..
పోరాటం మాకు ప్రాణము, మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం, మా జోరు చూశాక.. ఈనాడే!!
జగడ జగడ జగడం..
చేసేస్తాం రగడ రగడ రగడం..
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !!
చం చం చం
మరల మరల జననం..
రానీరా మరల మరల మరణం..
మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!!
మా ఊపిరి నిప్పుల ఉప్పెన..
మా ఊహలు కత్తుల వంతెన.. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే..
రం పం పం పం!!
జగడ జగడ జగడం..
చేసేస్తాం రగడ రగడ రగడం..
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !!
చం చం చం
తకిట తకిట తకధిమి తకధిమి తకిట         
***************************************************************       
పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా

నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడినీడలు పడనీకే దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి

పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
పాపా లాలి 

.. మేఘమా ఉరమకే పూటకీ
గాలిలో తేలిపో వెళ్ళిపో 
.. కోయిలా పాడవే నా పాటని
తియ్యని తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో
సెలయేరుల అలపాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి

పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా పాపా లాలి 
పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తియ్యగా
పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా పాపా లాలి 
*********************************     
.. .. .. ..

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!

రేగిన కోరికలతో .. గాలులు వీచగా..
జీవన వేణువులలో.. మోహన పాడగా
దూరము లేనిదై..లోకము తోచగా..
కాలము లేనిదై.. గగనము అందగా..
సూరీడే ఒరిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా..
ముద్దులా..పొద్దుకే..నిదుర లేపే ప్రణయ గీతికి ఓం!!

ఒంటరి బాటసారీ.. జంటకు చేరగా..
కంటికి పాపవైతే..రెప్పగా మారనా
తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
అల్లిక పాటగా..పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే..
జగతికే..అతిధులై..జననమందిన ప్రేమ జంటకి!!

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం..
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం..
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..
మంచు బొమ్మలొకటై..కౌగిలిలో కలిసి కరిగే లీలలో!!
************************************************      
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల కాని ఏలలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నేల తాకేదెలాగ
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే
నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాదలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమ
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాళిదాస గీతికి ప్రశ్న రాసలీలకి ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
అణాలు ఆశకి తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమ
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది నీకసి
నింగీ నేల తాకేవేళ
నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బందనం ప్రేమకే జయం ప్రేమదే జయం
**********************************************************       
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు వేళ
ఆమనీ పాడవే హాయిగా 
ఆమనీ పాడవే హాయిగా 

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నాఎద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని...

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు వేళ
రాలేటి పూల రాగాలతో 

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీభూవీ కలానిజం స్పృషించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోవు గాధ నేనని...

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు వేళ
ఆమనీ పాడవే హాయిగా 
ఆమనీ పాడవే హాయిగా 
************************************************      

No comments:

Post a Comment