Thursday, March 8, 2012

వేటూరి పాటలు. .

 దేవత
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
పూలు వింటాయి సడిసేయకూ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
అనువైన వేళ అందాలు దాచకూ
అనువైన వేళ అందాలు దాచకూ
అణువణువు నిన్నే కోరే మురిపించకూ
ఇకనైన నునుసిగ్గు తెరవేయకూ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
పూలు వింటాయి సడిసేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే మోహాలతో నన్ను మరిపించకూ
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే మోహాలతో నన్ను మరిపించకూ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనసారా ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
పూలు వింటాయి సడిసేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ 

*****************************************        
గజదొంగ
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా
మురిపాల మీగడంతా తోడిపెడతావా

బంగారు కొండమీద శృంగార కోటలోన
చిలకుంది తెమ్మంటావా..చిలకుంది తెమ్మంటావా..
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో

నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను

వజ్రాల వాడలోన వైఢూర్యమంటి నన్ను
వాటేయ వద్దంటావా..వాటేయ వద్దంటావా..
వరహాల పందిట్లో విరహాలు నీకేలా
రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో
గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో

నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మురిపాల మీగడంతా తోడిపెడతావా

********************************  
జగదేకవీరుడు అతిలోకసుందరి
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించేలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లదా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచీ ఇల చేరే క్షణాలలో 

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృషించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

*************************************************   
కిల్లర్
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
నీ లయ పంచుకుంటుంటే.. నా శృతి మించిపోతుంటే..
నాలో రేగే..
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
జగలాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు..
ఎవరులేని మనసులో, ఎదురు రావే నా చెలి..
అడుగు జారే వయసులో, అడిగి చూడు కౌగిలి..
ఒకే వసంతం..కుహు నినాదం, నీలో నాలో పలికే!!
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
నీ లయ పంచుకుంటుంటే.. నా శృతి మించిపోతుంటే..
నాలో రేగే..
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
శరత్తులోన వెన్నెల తలెత్తుతుంది కన్నుల..
షికారు చేసే కోకిలా పుకారువేసే కాకిలా..
ఎవరు ఎంత వగచినా,చిగురు వేసే కోరిక..
నింగి తానే విడిచినా,ఇలకు రాదు తారకా..
మధే ప్రపంచం..విధే విలాసం,నిన్ను నన్ను కలిపే!!
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
నీ లయ పంచుకుంటుంటే.. నా శృతి మించిపోతుంటే..
నాలో రేగే..
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
ప్రియా ప్రియతమా రాగాలు..సఖి కుశలమా అందాలు??
ప్రియా ప్రియతమా
****************************************      
కోకిల
కోకిల..కోకిల..
కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా
లవ్ యు
ఒరేయ్ నువ్వు కాదురా   లవ్ యు నేనురా

లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు

జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాటే వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే
చుక్కమ్మ కోపం చి పో ముద్దొచ్చే రూపం వదులు
కన్నుల్లో తాపం వెన్నెల్లో దీపం
హోయ్ నాలోని లల్లాయికే నీకింక జిల్లాయిలే
లయలేమో హోయలేమో ప్రియభామా కథలేమో

కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు

కొమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే రెమ్మా పండే
కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా
కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా
బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గు పండే సిగ్గు పండే
బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా
బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా

కొండల్లో వాగమ్మ కొంకర్లు పోయే నీ గాలిసోకి
చైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారీ ప్రాణాలు తోడే వయ్యారమంతా వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ హాలీడే పూజావడీ
ఇక చాలు సరసాలు కుదిరేనూ మురిపాలూ

కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరు పూదోటలో మది రేపింది మారాపిలా
లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు
లవ్ యు లవ్ యు

*********************************************     
కొండవీటి దొంగ
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ
ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ
ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
అనాద జీవులా.... ఉగాది కోసం..మ్మ్
అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడిసె గుడిసెనూ గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా
పూడ్చు వాళ్ళకూ భూస్వాములకూ..
పూడ్చు వాళ్ళకూ భూస్వాములకూ బూజు దులపకా తప్పదురా
తప్పదురా..తప్పదురా..తప్పదురా..
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
న్యాయ దేవతకూ....కన్నులు తెరిచే....
న్యాయ దేవతకూ కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా
న్యాయ దేవతకూ కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా
దోపిడి రాజ్యం.. దొంగ ప్రభుత్వం
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా
తప్పదురా..తప్పదురా..తప్పదురా..
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ
ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ
ఎదురే నాకు లేదూ నన్నేవరూ ఆపలేరూ
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా సాహసమే పూబాటా
***********************************************    
కొండవీటిసింహం
మధుమాసంలో దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
మధుమాసంలో దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి
అనురాగాలు పలికించువేళ
మధుమాసంలో దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే
శుభయోగాలు తిలకించువేళ
మధుమాసంలో దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
**********************************************************     
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం
త్యాగాలమయమై సంసారబంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
హస్తవాసే నాకున్న నేస్తం
అనురాగ సూత్రం
మా ఇంటిలొన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
మీ కంట తడిని నే చూడలేను
మా అమ్మ నీవై కనిపించినావు
బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఇంటి దీపం మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
మీ  కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే



No comments:

Post a Comment